చలికాలంలో మీ చర్మం డ్రైనెస్‌ని తగ్గించడానికి మాయిశ్చరైజర్, కోల్డ్ క్రీమ్స్‌ని అప్లై చేసుకోవాలి.. నీరు అధికంగా తాగడం వల్ల కూడా మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది

రెగ్యలర్‌గా వ్యాయామం చేస్తే మీ శరీరం వెచ్చగా మారి మీరు మరింత యాక్టివ్‌గా ఉంటారు. చలి కాలంలో వ్యాపించే రోగాలనెదుర్కోవడానికి ఇమ్మునిటీ కూడా పెరుగుతుంది

రెండు లేదా మూడు తులసి ఆకులను గోరువెచ్చటి నీటిలో తేనె కలుపుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది. జలుబు, దగ్గు లాంటివి రాకుండా ఉంటాయి.

వులెన్ వస్త్రాలను మాత్రమే ధరించేలా ఏర్పాటు చేసుకోండి. బయటకు వెళ్తున్నప్పుడు మీ వెంట స్వెటర్, ష్రగ్స్ తీసుకెళ్లడం మరువకండి

గోరువెచ్చని నీటితో స్నానం చేయండి. ఇది మీ బాడీని రోజంగా యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంది. జలుబు దరిచేరకుండా కూడా ఉంటుంది.

చలికాలంలో ఎండ తక్కువగా ఉంటుంది. ఎండ మీ బాడీకి తగిలేవిధంగా బయటకు వస్తూ ఉండండి.  లేదంటే బాడీలో విటమిన్ డి తగ్గుతుంది.

ఎండ తక్కువగా ఉండడం వల్ల బాడీలో మెలటోనిన్ పెరుగుతూ ఉంటుంది. ఇది మిమ్మల్ని నిద్రమత్తులోకి జారుకునేలా చేస్తుంది. కాబట్టి రోజుకు కనీసం 7-8 గంటలు నిద్రపోయేలా చూసుకోండి

జలుబును పెంచే పుచ్చపండు, మస్క్‌మిలన్, నిమ్మరసం లాంటి వాటికి దూరంగా ఉండండి.

మీ చుట్టూ వాతావరణం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోండి. లేదంటే దోమల వల్ల మలేరియా, డెంగ్యూ అధికంగా వ్యాపించేలా ఉంటుంది.

గొంతునొప్పి, గొంతు సమస్యలు రాకుండా ఉండేందుకు.. గోరువెచ్చని నీటిలో కొంత ఉప్పు వేసి పుక్కలించడం వల్ల మీ ఈ సమస్యల నుంచి మీరు బయట పడతారు.