EPAPER

World’s Richest Dog: సింహాసనంపై శునకం.. రూ.3300 కోట్ల ఆస్తికి అధిపతి ఈ కుక్క.. ప్రైవేట్ ప్లేన్, బిఎండబ్ల్యూ కారు ఇంకా ఎన్నో..

World’s Richest Dog: సింహాసనంపై శునకం.. రూ.3300 కోట్ల ఆస్తికి అధిపతి ఈ కుక్క.. ప్రైవేట్ ప్లేన్, బిఎండబ్ల్యూ కారు ఇంకా ఎన్నో..

World’s Richest Dog| ఒక కుక్క వద్ద నాలుగు కోట్ల డాలర్ల (రూ.3300 కోట్లు) ఆస్తి ఉందని ఎవరైనా చెబితే మీరు నమ్ముతారా?. అంతే కాదు. ఈ ఆస్తి మొత్తం ఆ కుక్క సంపాదించలేదు. మూడు దశాబ్దాలుగా అతని పూర్వీకుల నుంచి అతనికి వారసత్వంగా లభించిందని చెబితే మీరు ఇదంతా అబద్ధమని నవ్విపోతారేమో. కానీ ఇది కొంతవరకు నిజమే. ఆ కుక్క వద్ద అంత ఆస్తి ఉందనే మాట వాస్తవమే.. కానీ ఆస్తి ఎలా వచ్చింది? అనే దానిపై అందరికీ అనుమానాలు ఉన్నాయి.


ప్రపంచంలోనే ధనవంతమైన కుక్క అని గూగుల్ లో మీరు సెర్చ్ చేస్తే.. గుంథర్ 6(Gunther VI)అనే పేరుతో చాలా వార్తా కథనాలు కనిపిస్తాయి. అందులో ఈ కుక్క గురించి వివరాలున్నాయి. ఆ కథనాల ప్రకారం.. జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన ఈ కుక్క పేరు గుంథర్ సిక్స్. ఇది ఈ భూలోకంలో ఉన్న కుక్కలు చాలా మంది మనుషుల కంటే ఎక్కువ ఆస్తి కలిగి ఉంది.


ఒక విలాసవంతమైన జీవితం గడిపే ఈ శునక మహారాజు కోసం 27 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందులో ఒక స్పెషల్ చెఫ్ కూడా ఉన్నాడు. ఆ చెఫ్ కుక్క కోసం అన్ని రకాల వంటకాలు వండిపెడతాడు. దానికి గారాబంగా తినిపిస్తాడు కూడా. పైగా కుక్క కు బోర్ కొడితే ఐపిఎల్ తరహాలో చీర్ లీడర్స్ కూడా వచ్చి ఎంటర్ టైన్ చేస్తారు. ఈ కుక్క పేరుతో ప్రపంచ వ్యాప్తంగా ఆస్తులున్నాయి. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో పాప్ సింగర్ మడోన్నా ఇంటిని ఈ కుక్క 29 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఇది జర్మనీలో నివసిస్తుంది. తన నగరంలో తిరగాలంటే ప్రత్యేకంగా బిఎండబ్లూ కారు ఉంది. దేశాలు దాటాలంటే ప్రత్యేకంగా ప్రైవేట్ జెట్ విమానం ఉంది. ఇంత వరకు కథ నిజమే. కానీ ఈ ఆస్తి కుక్క వద్ద ఎలా వచ్చింది? అనేది కీలక ప్రశ్న.


గుంథర్ సిక్స్ ఆస్తి గురించి వార్తా కథనాలు:

1992లో జర్మనీ దేశంలో కౌంటెస్ (ఒక రాజు గారి లేదా జమీందారు గారి వితంతువు) ఉండేది. ఆమె పేరు కార్లోట్టా లియేబెన్‌స్టీన్. అయితే ఆమె 1992లో చనిపోయే ముందు ఆమె ఏకైక కుమారుడు చనిపోయాడు. దీంతో ఆమెకు వారసులెవరూ లేరు. ఆ సమయంలో ఆమె వద్ద గుంథర్ 3 అనే కుక్క మాత్రమే ఉంది. అందుకే కౌంటెస్ కార్లోట్టా చనిపోయే సమయంలో తన ఆస్తి మొత్తం గుంథర్ 3 పేరున రాసి చనిపోయింది. అయితే కుక్క కు గార్డియన్ (మేనేజర్) గా తనకు నమ్మకస్తుడైన మారిజియో మియా (Maurizio Mian)ని నియమించింది. ఆ సమయంలో కుక్క ఆస్తి విలువ 80 మిలియన్ డాలర్లు.

ఈ మారిజియో మియా గుంథర్ 3 ఆస్తితో వ్యాపారం చేశాడు. అతనికి చాలా వ్యాపారాలున్నాయి. పైగా గుంథర్ పేరుతో గుంథర్ కార్ప్ అని కంపెనీలు స్థాపించాడు. గుంథర్ ఫౌండేషన్ పేరుతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి కుక్క ఆస్తిని మేనేజ్ చేసేవాడు. ఇదంతా ప్రభుత్వానికి పన్ను ఎగవేసేందుకు మారిజియో మియా వేసిన ప్లాన్. అలా కుక్క పేరుతో వ్యాపారాలు చేస్తూ.. ఆస్తిని ఈ రోజు 400 మిలియన్ డాలర్లకు పైగా పెంచాడు. ఈ రోజు గుంథర్ 3 తరువాత అతని పిల్లల్లో గుంథర్ 6 బతికి ఉన్నాడని మారిజియో తెలిపాడు.

అయితే దురాశ దుఖానికి చేరువ చేస్తుందని పెద్దలు అంటారు. మారిజియో అతితెలివి కాస్తా అమెరికాలో పట్టుబడింది. ప్రపంచవ్యాప్తంగా గుంథర్ కుక్క పేరుతో మారిజియో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి వందల కోట్లు సంపాదించాడు. కానీ 1995లో హాలీవుడ్ దిగ్గజ నటుడు సిల్వెస్టర్ స్టాలోన్ ఇంటిని గుంథర్ కార్ప్ కంపెనీ పేరుతో కొనాలని ప్రయత్నించాడు. ఇది కూడా పన్ను ఎగవేసే ప్లాన్ లో భాగమే. కానీ ఈ కుక్కకి అంత ఆస్తి ఎలా వచ్చిందని అక్కడి మీడియా విచారణ ప్రారంభించింది.

Also Read: కుటుంబాన్ని పోషించడానికి ఆ పనిచేస్తున్న మహిళ.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజెన్లు!

దీంతో మారిజియో బండారమంతా బయటపడింది. నిజానికి 1992 సమయానికి జర్మనీలో ఎటువంటి కౌంటెస్ లు లేరు. మరి మారిజియో చెబుతున్న కౌంటెస్ ఎవరు? ఆమె ఏ వంశానికి చెందిన వారని? మీడియా ప్రశ్నించగా మారిజియో సరైన సమాధానం చెప్పలేకపోయాడు. ఆ తరువాత ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ గుంథర్ 6 పై ఒక డాక్యూ సిరీస్ ని తీసి ప్రపంచం ముందుకు పెట్టింది. ఇందులో మారిజియో, అతని కుటుంబం పన్ను ఎగవేసేందుకు ప్లాన్ చేసి జర్మనీ కౌంటెస్ అని, ఆమె కుక్క అని కథ అల్లారు. అయితే ఇప్పటికీ మారిజియోపై జర్మనీ లేదా ఇతర దేశాల్లో చట్టపరంగా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఏది ఏమైనా గుంథర్ మాత్రం రాజసంగా బతుకుతోందనడంలో సందేహం లేదు.

Related News

Shocking Video: సన్యాసిగా మారిన పిల్లిని ఎప్పుడైనా చూశారా..! ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు

Mystery: చావు రహస్యం తేలిపోనుంది.. మరణం తర్వాత మూడో దశ!.. కన్ఫమ్ చేసిన సైంటిస్టులు

Flipkart: స్మార్ట్‌ఫోన్ పై 99 శాతం డిస్కౌంట్.. ఇదెక్కడి మోసమంటూ ఫ్లిప్‌కార్ట్‌పై కస్టమర్ల ఆగ్రహం

Viral Video: నూడుల్స్‌ని ఇష్టంగా లాగించేస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు

Amazon Delivery After 2 Years: రెండేళ్ల క్రితం అమెజాన్ ఆర్డర్ క్యాన్సిల్.. రీఫండ్ పూర్తి.. ఇప్పుడు డెలివరీ!

Viral Video: మీరేంట్రా ఇలా ఉన్నారు.. రూ. 10 జిలేబీ కోసం కొట్టుకుంటారా..

Urination: మూత్ర విసర్జన తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..

Big Stories

×