EPAPER

Watch Video: మంటల్లో కాలుతున్న కారు జనాల మీదికి దూసుకొస్తే, నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

Watch Video: మంటల్లో కాలుతున్న కారు జనాల మీదికి దూసుకొస్తే, నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

Jaipur Car Accident: దేశ వ్యాప్తంగా రోజూ పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి.  ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కలుగుతుంది. వాటిలో కొన్ని రోడ్డు ప్రమాదాలు మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి. అలాంటి వాటిలో ఒకటి జైపూర్ కారు ప్రమాదం. ఓ ఫ్లై ఓవర్ మీదికి రాగానే కారులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ కారులో నుంచి బయటకు దూకాడు. మండుతున్న కారును చూసేందుకు తోటి వాహనదారులు కారు చుట్టూ గుమిగూడారు. మండుతున్న కారు నెమ్మదిగా వారి మీదికి దూసుకురావడంతో వాహనాలు అక్కడే వదిలేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. స్థానికులు ఈ వీడియోను షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.


ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

రాజస్థాన్ రాజధాని జైపూర్‌ లో ఈ కారు ప్రమాదం జరిగింది. సోడాలా సబ్జీ మండి ప్రాంతం నుంచి సుదర్శన్‌ పురా పులియా  వైపు ఓ కారు వెళ్తున్నది. అజ్మీర్ రోడ్‌లోని ఎలివేటెడ్ ఫ్లై ఓవర్ మీదకు చేరుకోగానే కారులో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. కారును నడుపుతున్న జితేందర్ మంటలను గమనించి వెంటనే బయటకు దూకేశాడు. ఫ్లై ఓవర్ మీదే కారు మంటల్లో కాలిపోయింది. అందులో ఎవరైనా ఉన్నారేమోనని కాపాడుదామనే ఉద్దేశంతో తోటి వాహనదారులు, చుట్టూ చేరారు. కార్లు, బైకులు ఫ్లై ఓవర్ మీదే ఆపి కారును చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కారు నెమ్మదిగా ఫ్లై ఓవర్ కింది వైపు కదిలింది. మంటలతోనే దూసుకొచ్చింది. తోటి వాహనదారులు తమ బైకులు, కార్లను తీసుకుని పక్కకు పరిగెత్తారు. కొంతదూరం వెళ్లాక, ఓ బైకును ఢీకొట్టి ఆగింది. ఆ సమయంలో ఎక్కువగా వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందంటున్నారు స్థానికులు. విషయం తెలుసుకుని స్పాట్ కు చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసి, కారును పక్కకు తీసుకెళ్లారు.


షార్ట్ సర్క్యూట్ కారణంగా కారులో మంటలు

ఇంజిన్ లో సమస్యల కారణంగానే కారులో మంటలు వచ్చినట్లు కారు నడుపుతున్న జితేంద్ర వెల్లడించాడు. వాస్తవానికి కారు ఇంజిన్ లో ఏదో సమస్యగా ఉన్నట్లు అనిపించిందని, ఫ్లై ఓవర్ మీదికి రాగానే షార్ట్ సర్క్యూట్ అయి  కారులో పొగలు వచ్చాయన్నారు. తానుకు కిందికి దూకిన కాసేపటికే మంటలు వ్యాపించినట్లు చెప్పాడు. అసలు ఎందుకు ఇలా జరిగిందో తనకు తెలియన్నారు. కారు ఫ్లై ఓవర్ నుంచి కిందికి మంటలతో దూసుకెళ్లిని ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు. ఫ్లై ఓవర్ కు కాస్త దూరంలో పార్క్ చేసిన ఓ టూవీలర్ ను ఢీకొట్టి ఆగినట్లు చెప్పారు. ప్రమాద సమయంలో అటుగా రాకపోకలు తక్కువగా ఉండటంతో పెద్ద ముప్పు తప్పినట్లు అయ్యిందన్నారు. కారులో మంటలు చెలరేగిన విషయాన్ని కంపెనీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ ఘటనపై సదరు కారు కంపెనీ ప్రతినిధులు విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.

Read Also: అబ్బాయిల కోసం ఎగబడుతున్న మేఘాలయ అమ్మాయిలు.. నిజంగా అంత కరువుతో ఉన్నారా?

Related News

Viral News: రూ.835 ఖర్చుకు.. రూ.1.2 కోట్లు, వారెవ్వా లక్కంటే ఈ గుమ్మడి కాయల వ్యాపారిదే

Animal Food Robber: సాలరీ రూ.20 లక్షలు.. కక్కుర్తిపడి జంతువుల ఆహారం దొంగతనం చేసేవాడు!

Viral Video: చాయ్ అమ్మే పిల్ల.. ఈమె వీడియోలు భలే వైరల్!

Viral Video: అయిదుగురు యువతులను ఒకేసారి పెళ్లి చేసుకున్న వరుడు.. వైరల్ వీడియో

Fact Check News: అబ్బాయిల కోసం ఎగబడుతున్న మేఘాలయ అమ్మాయిలు.. నిజంగా అంత కరువుతో ఉన్నారా?

Shocking Video: అమెరికాను వణికిస్తున్న మిల్టన్.. సుడిగాలిలో చిక్కుకున్న విమానం.. వీడియో వైరల్

Big Stories

×