EPAPER

Viral Video: కారును హెలికాప్టర్ గా మార్చిన బ్రదర్స్.. ఊహించని షాక్ ఇచ్చిన పోలీసులు..

Viral Video: కారును హెలికాప్టర్ గా మార్చిన బ్రదర్స్.. ఊహించని షాక్ ఇచ్చిన పోలీసులు..

Viral VideoCar Modifies Into Chopper Video Goes Viral: ఇటీవల కాలంలో యువత తమ అభిరుచులకు తగ్గట్టుగా రకరకాల మోడల్స్ లో బైక్స్, కార్లు కొనుగోలు చేస్తున్నారు. మరి కొందరు అయితే వాటిని తమకు నచ్చిన విధంగా కంపెనీలోనే డిజైన్ చేయించుకున్నారు. ఇంకొందరు మెకానిక్ దగ్గరకు వెళ్లి రకరకాల మార్పులు చేసుకుంటారు. అయితే యూపీకి చెందిన్న ఇద్దరు అన్నదమ్ములు మాత్రం సరికొత్తగా ఆలోచించి.. తమ కారును ఏకంగా హెలికాప్టర్ గా మార్చారు. ఈ హెలికాప్టర్ తో కారుతో వారు ఎంచక్కా రోడ్లపై విజిల్ వేసుకుంటా సికార్లు చేస్తుండగా వారిని పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.


ఉత్తర ప్రదేశ్ లోని అంబేడ్కర్ నగర్ లో ఈశ్వర్ అనే యువకుడు, అతని సోదరడు కలిసి వినూత్నంగా ఆలోచించారు. వీరిద్దరూ తమకు ఉన్న మారుతీ కారును హెలికాప్టర్ మాదిరిగా కనిపించేలా తయారు చేశారు. దీనికోసం వీరు ఏకంగా రూ.2.50 లక్షలు ఖర్చు చేశారు. ఈ అన్నదమ్ములు పెళ్లిళ్ల సమయంలో వధూవరులను ఊరేగించడానికి వినూత్నంగా ఉంటుందని తమ కారును హెలికాప్టర్ ను తలపించేలా తయారు చేశారు. ఇలా చేయడం ద్వారా తమకు మంచి గిరాకీతో పాటుగా ధర కూడా దొరుకుతుందని భావించారు. హెలికాప్టర్ మాదిరిగా కారు వెనుక భాగంలో తోక, పైన రెక్కలు ఉన్నందున కొద్ది రోజుల్లోనే వీరికీ బాగా డిమాండ్ పెరిగింది.

ఈ హెలికాప్టర్ కారుకు ప్రజల నుంచి అనుహ్య స్పందన రావడంతో పెళ్లిళ్లలో ప్రధాన ఆకర్షణగా నిలిచేది. దీంతో ఈ సరికొత్త కారును చూసిన కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియోలు పోలీసులు కంట పడ్డాయి. దీంతో వారు వాహనాల నింబంధనలకు విరుద్ధంగా ఉందంటూ వీరిపై చర్యలకు ఉపక్రమించారు. వెంటనే ఆ అన్నదమ్ములు తన రీమోడల్ కారుపై రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో కారును ఆపారు. నిబంధనలు విరుద్ధంగా ఉందని భద్రతాపరమైన కొన్ని కారణాలు చేత కారు వెనుకభాగంలో ఉండే దాన్ని వెంటనే తొలగించాలని ఆదేశించారు. దీంతో పాటుగా రూ.2,000 జరిమానా కూడా విధించారు. కారును సీజ్ చేసిన పోలీసులు అదనంగా ఉండే రెక్కలు, తోక భాగాలను తొలగించారు. ప్రస్తుతం దీనికి సబంధించి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.


Also Read: QR Code T-Shirt: ఏం ఐడియా గురూ.. గర్ల్‌ఫ్రెండ్ కోసం ఏకంగా టీషర్ట్‌పై క్యూఆర్ పెట్టేసావ్ గా..!

పోలీసులు చేసిన ఈ చర్యతో తాము తీవ్రంగా నష్ట పోయాయని ఆ అన్నదమ్ములు వెల్లడించారు. ఈ కారు కారణంగానే పెళ్లిళ్ల సమయంలో తమకు డిమాండ్ ఏర్పడిందని.. దాని సాయంతోనే తమ కుటుంబం బతుకుతుందని తమ బాధను వెల్లడించారు. పగలు, రాత్రి కష్ట పడి రూ. 2.50 లక్షలు ఖర్చు చేసి కారును హెలికాప్టర్ మాదిరిగా తయారు చేసినట్లు ఈశ్వర్ తెలిపారు. అయితే కారు రెక్కలు, తోకను పోలీసులు తొలగిస్తున్న వీడియోను చూసిన నెటిజన్లు పోలీసులు ప్రవర్తించిన తీరుపై మండిపడుతున్నారు. స్వదేశంలో ఇలాంటి టేలెంట్ ఉన్న వారికి గుర్తింపు లేకుండా పోతుందని కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Viral Video: మీరేంట్రా ఇలా ఉన్నారు.. రూ. 10 జిలేబీ కోసం కొట్టుకుంటారా..

Urination: మూత్ర విసర్జన తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..

Viral News: సమస్యపై స్పందించట్లేదని ఓలాపై యువతి వినూత్న నిరసన…

World’s Richest Dog: సింహాసనంపై శునకం.. రూ.3300 కోట్ల ఆస్తికి అధిపతి ఈ కుక్క.. ప్రైవేట్ ప్లేన్, బిఎండబ్ల్యూ కారు ఇంకా ఎన్నో..

Man Extracts 23 Teeth: ఒకేరోజు 23 పళ్లు తీయించుకున్నాడు.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు..!

Viral Video: వెర్రి వేశాలు కాకపోతే.. అసలు బైక్‌తో రైలు ఇంజిన్ ను లాగొచ్చా..

Shocking Video: ఎంతటి అద్భుతం.. గణేషుడికి నమస్కరించి మోదకం తీసుకున్న చిట్టెలుక..

Big Stories

×