EPAPER

Truck Driver Earns Lakhs: లారీ డ్రైవర్ నెల ఆదాయం రూ.10 లక్షలు.. ఎలా సంపాదిస్తున్నాడో తెలుసా?

Truck Driver Earns Lakhs: లారీ డ్రైవర్ నెల ఆదాయం రూ.10 లక్షలు.. ఎలా సంపాదిస్తున్నాడో తెలుసా?

Truck Driver Earns Lakhs| ఈ ప్రపంచంలో కష్టపడి జీవనం సాగించే వారు ఎందరో ఉంటారు. జీవితాంతం తమ కష్టార్జితం తోనే బతకడమే వారికి తెలుసు. కానీ కొంతమందికి ఆ భగవంతుడు అదృష్టం ప్రసాదిస్తాడు. ఏదో చిన్న పని అని చేసిన కార్యం కాస్తా వారికి జీవితంలో మహాసంపదను సృష్టించిపెడుతుంది. అలా అదృష్టవంతుడిగా మారిన ఓ లారీ డ్రైవర్ కథ ఇది. తను జీవితం మొత్తం లారీ డ్రైవర్ గా పనిచేశాడు.. చేస్తున్నాడు. కానీ దాంతో పాటే తన సరదా కోసం మరో పని కూడా చేసేవాడు. ఆ సరదా పని అతనికి ఇప్పుడు నెలకు రూ.4 లక్షల నుంచి రూ.10 లక్షలు సంపాదించిపెడుతోంది.


రాజేష్ రవానీ అనే లారీ డ్రైవర్ 20 ఏళ్లుగా హైవేలపై ట్రక్కు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన నెల ఆదాయం రూ.25000 నుంచి రూ.30000 మాత్రమే. ఆయన తన జీవితంలో చాలా కష్టాలు అనుభవించాడు. చిన్నతనంలో ఆయన తండ్రి కూడా ఒక లారీ డ్రైవర్ నెలకు రూ.500 మాత్రమే నెల జీతం. దాంతో ఇంట్లో అయిదు మందిని నెలంతా పోషించాలి. ఆదాయం సరిపోకపోవడంతో ఆయన తండ్రి ఊరంతా అప్పులు చేశారు. దీంతో రాజే ష్ రవానీ కూడా అతి తక్కువ వయసులోనే లారీ డ్రైవర్ గా మారాడు. అయినా రాజేష్ జీవితం అదే విధంగా ఇప్పుడు పిల్లలను మంచి స్కూల్ లో చదివించాలని ఆయన ఎక్కువ కష్టపడుతున్నాడు.

Also Read: 69 మందిని ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడిన హీరో ఇతనే.. ఇదంతా ఎలా చేశాడంటే..


ఈ క్రమంలో కొన్ని సంవత్సరాల క్రితమ ఒక యాక్సిడెంట్ లో ఆయన చేతికి తీవ్ర గాయకూడా అయింది. తనకంటూ సొంతంగా ఇల్లు ఉండాలని కలలు కనే రాజేష్ రవానీకి అనుకోకుండా అదృష్టం పట్టింది. రాజేష్ రవానీ లారీ లో సరుకుతీసుకొని వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంటారు. అయితే దారి మధ్యలో లారీ ఆపి వంటలు చేసుకోవడం.. భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకోవడం చేస్తూ ఉంటారు. ఇదే సమయంలో రాజేష్ రవానీ ఒక ఐడియా వచ్చింది. ఆయనక వంట చేయడమంటే చాలా ఇష్టం. అందుకే తన ఫోన్ ద్వారా దారిలో లారి ఆపి వంటలు చేస్తున్న సమయంలో వీడియోలు రికార్డ్ చేసేవాడు.

యూట్యూబ్ లో ‘R Rajesh Vlogs’ అనే పేరుతో ఆయన చానెల్ పెట్టారు. ఆ రికార్డ్ చేసిన వీడియోలను యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. అలా తన వంట చేసే నైపుణ్యంతో గత కొన్ని సంవత్సరాలుగా లారీ ట్రిప్ కు వెళ్లినప్పుడల్లా వంట చేస్తూ తీసని వీడియోలను యూట్యూబ్‌లో ఫేస్ బుక్ లో షేర్ చేసేవాడు. అలా రాజేష్ చానెల్ లో ఎక్కువ మంది సబ్స్ స్క్రైబర్స్ వచ్చి చేరారు. ఈ రోజు ఆయన యూట్యూబ్ చానెల్ కు 1.86 మిలియన్ సబ్స్ స్క్రైబర్స్ ఉన్నారు.

Also Read: డిగ్రీ చదవకుండానే సంవత్సరానికి రూ.5 కోట్లు సంపాదిస్తున్న యువతి.. ఎలాగంటే?..

రాజేష్ చేసే వీడియోలకు ఇప్పుడు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. యూట్యూబ్ ద్వారా ఆయనకు ప్రతినెలా రూ.4 నుంచి రూ.5 లక్షలు సంపాదిస్తున్నాడు. అత్యధికంగా ఒక నెలకు రూ.10 లక్షలు కూడా సంపాదించాడు. అయినా కూడా రాజేష్ తన వృత్తిని వదల్లేదు. ఇప్పటికీ లారీ డ్రైవర్ గా పనిచేస్తూనే ఉన్నాడు. ఇటీవల హిందీ ప్రముఖ పాడ్ కాస్ట్ చానెల్ సిద్ధార్ధ్ కన్నన్ లో ఆయన గెస్ట్ గా వచ్చి తన కథను అందరికీ చెప్పాడు. ఎలా ముందు కేవలం వాయి ఓవర్ వీడియోలు మాత్రమే చేశానని ఆ తరువాత ఒక రోజు తన కొడుకు తన ముఖం చూపిస్తూ తీసిన వీడియోకు ఒకేరోజులో 4 లక్షల వ్యూస్ వచ్చాయని తెలపాడు. ఇప్పుడు తన ఇల్లు నిర్మాణ జరగుతోందని.. ఊపిరి ఉన్నంత వరకు కష్టపడి పనిచేస్తూనే ఉంటానని ఆయన అన్నాడు.

Also Read: ముంబై రోడ్లపై టవల్‌తో తిరిగిన అమ్మాయి.. ఒక్కసారిగా టవల్ తీసేయడంతో..

Related News

Shocking Video: సన్యాసిగా మారిన పిల్లిని ఎప్పుడైనా చూశారా..! ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు

Mystery: చావు రహస్యం తేలిపోనుంది.. మరణం తర్వాత మూడో దశ!.. కన్ఫమ్ చేసిన సైంటిస్టులు

Flipkart: స్మార్ట్‌ఫోన్ పై 99 శాతం డిస్కౌంట్.. ఇదెక్కడి మోసమంటూ ఫ్లిప్‌కార్ట్‌పై కస్టమర్ల ఆగ్రహం

Viral Video: నూడుల్స్‌ని ఇష్టంగా లాగించేస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు

Amazon Delivery After 2 Years: రెండేళ్ల క్రితం అమెజాన్ ఆర్డర్ క్యాన్సిల్.. రీఫండ్ పూర్తి.. ఇప్పుడు డెలివరీ!

Viral Video: మీరేంట్రా ఇలా ఉన్నారు.. రూ. 10 జిలేబీ కోసం కొట్టుకుంటారా..

Urination: మూత్ర విసర్జన తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..

Big Stories

×