EPAPER

7 People in Bike Ride: ఓకే బైక్‌పై ఏడుగురు.. ఏందిరా ఇది..!

7 People in Bike Ride: ఓకే బైక్‌పై ఏడుగురు.. ఏందిరా ఇది..!

viral news


Bike Ride Seven Boys: సోషల్ మీడియా.. ఈ పేరు తెలియని వారుండరు. ఈ ఫ్లాట్‌ఫామ్స్‌ను ఉపయోగించని వారుండరు. ఈ టెక్నాలజీ యుగంలో ఫేమస్ అవడానికి యూత్ ఎంచుకుంటున్న ఫ్లాట్‌ఫామ్ సోషల్ మీడియా. ఓనమాలు తెలియని వారు కూడా సోషల్ మీడియా ద్వారా ఓవర్ నైట్‌లో స్టార్ అవుతున్నారు. దీంతో చాలా మంది యువత పాపులర్ అవ్వడానికి రకరకాల వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.

ఏళ్లుగా బయటకు రాని టాలెంట్‌లు సోషల్ మీడియా ద్వారా పరిచయం అవుతున్నాయి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి వాటిల్లో ఇటువంటి వీడియోస్ బోలెడు కనిపిస్తాయి. అయితే సోషల్ మీడియాను కొందరు వారి కెరియర్‌గా మలుచుకొని మంచి లైఫ్ లీడ్ చేస్తుంటే.. కొందరు మాత్రం లైక్‌, షేర్లు కోసం ప్రమాదకరమైన స్టంట్లుతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Read More: ఆనంద్‌ మహీంద్రా వీడియో షేర్‌, గ్రేట్ వర్క్ అంటూ కితాబ్

వీడియో చూసినట్లయితే ఏడుగురు వ్యక్తులు ఒకే బైక్‌పై ఒకరిపై మరొకరు కూర్చొని రైడ్ చేస్తున్నారు. బైక్ నంబర్ ప్లేట్, మోడల్ గమనించినట్లయితే.. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌ జిల్లా కతిఖేరా ప్రాంతంలో జరిగినట్లుగా గుర్తించారు. ఒకరిపై మరొకరుగా ఎక్కి ఏడుగురు నడిరోడ్డుపై బైక్‌తో స్టంట్లు వేస్తున్నారు. వారిలో ఓ యువకుడు అయితే ఏకంగా బైక్‌ నడుపుతున్న వ్యక్తి భుజాలపై కూర్చున్నాడు.

ఆ యువకులు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి ఈ స్టంట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఫీట్‌ను ఓ వ్యక్తి కారులో వెళ్తూ తన ఫోన్‌లో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీడియోను చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

Read More: ఏనుగును డిస్టర్బ్ చేసిన అమ్మాయి.. చివరకు ఊహించని ట్విస్ట్..!

పోతార్రా.. బతకాలని లేదా అని అంటున్నారు. పోయేకాలం దాపరిస్తే ఇటువంటి ఆలోచనలో వస్తాయని చెబుతున్నారు. పోలీసులు యువకులని పట్టుకొని బుద్ధి చెప్పాలని కామెంట్ చేస్తున్నారు. దీనిపై ఎక్స్ ఖాతాలో స్పందించిన పోలీస్ అధికారులు నంబర్ ప్లేట్ ఆధారంగా బైక్‌ యజమానికి రూ.16 వేల జరిమానా విధించినట్లు తెలిపారు.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటే తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ వీడియోను తన ఎక్స్ ఖాతాలో రీపోస్ట్ చేశారు. ఈ ఘటన గురించి ఆయన వివరిస్తూ.. ఇలాంటి ప్రయాణాలు ప్రమాదం అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు. 19 వేల వ్యూస్ ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇటువంటి రైడ్‌లపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.

Related News

Viral Video: రాత్రిళ్లు ఆటో నడుపుతున్న 55 ఏళ్ల మహిళ కథ వింటే కన్నీరు ఆగదు..

Auto Driver Slap: ఓలా రైడ్ క్యాన్సిల్ చేసిందని యువతిపై దాడి.. వీడియో వైరల్

Viral Video: ఎంత దర్జాగా కూర్చున్నావ్ భయ్యా.. ట్రక్కులో ఈ వ్యక్తి హుందాతనం చూస్తే షాక్ అవుతారు

Viral Video: భోజనం చేసేందుకు రెడీ అయిన కపుల్స్.. ఒక్కసారిగా ఇంట్లోకి దూసుకువచ్చిన కారు

Sweeper Jobs: ఏంటండీ ఈ విడ్డూరం.. రోడ్లూడ్చే పనికి 46 వేల మంది గ్రాడ్యుయేట్ల పోటీ

70 Weds 25: విచిత్ర వివాహం.. 70 ఏళ్ల ముసలాడితో 25 ఏళ్ల యువతి పెళ్లి.. ఎలా కుదిరిందంటే?

Viral Video: మహిళా కస్టమర్ పట్ల దారుణం.. షాపులోనే బట్టలు విప్పించిన సిబ్బంది వీడియో వైరల్

Big Stories

×