EPAPER
Kirrak Couples Episode 1

Sea Robin: నడిచే చేపలను ఎప్పుడైనా చూశారా? లేదంటే ఇప్పుడు చూడండి!

Sea Robin: నడిచే చేపలను ఎప్పుడైనా చూశారా? లేదంటే ఇప్పుడు చూడండి!

Walking Fish Sea Robin: చేపలు నీళ్లలో ఎలా ప్రయాణిస్తాయి? చిన్న పిల్లాడిని ఈ ప్రశ్న అడిగినా రెక్కలతో ఈదుకుంటూ అని ఠక్కున చెప్పేస్తాడు. పిల్లలేంటి.. పెద్దలు కూడా అదే విషయాన్ని చెప్తారు. కానీ, తాజాగా పరిశోధకులు చేపలు ఈదడమే కాదు, నడుస్తాయని గుర్తించారు. వినడానికి కొత్తగా ఉన్నా, ముమ్మాటికీ ఇది నిజం. కావాలంటే ఈ వీడియో చూడండి అంటున్నారు హార్వర్డ్ యూనివర్శిటీ  పరిశోధకులు.


ల్యాబ్ లో చూసి సముద్రంలో అన్వేషణ

ఇప్పటి వరకు నడిచే  చేపల గురించి పుస్తకాల్లో చదవడమే గానీ, ఎవరూ చూడలేదు. తొలిసారి హార్వర్డ్ యూనివర్శిటీ  పోస్ట్‌ డాక్టోరల్ ఫెలో అయిన కోరీ అలార్డ్ బయటి ప్రపంచానికి నడిచే చేపల గురించి పరిచయం చేశారు. 2019లో ఆయన కేప్ కాడ్ మెరైన్ బయోలాజికల్ లాబొరేటరీకి వెళ్లారు. అక్కడ నడిచే చేపలను చూశాడు. సీ రాబిన్ గా పిలిచే ఈ చేపలు ఆయనకు ఆసక్తిని కలిగించాయి. ఈ చేప తన కాళ్లను ఎలా ఉపయోగిస్తుంది? ఇంతకీ వాటికి ఈ కాళ్లు ఎలా ఏర్పడ్డాయి? అనే విషయంపై పరిశోధన కొనసాగించాలి అనుకున్నారు. అనుకున్నదే ఆలస్యంగా తన బృందంతో కలిసి సముద్రంలోకి అడుగు పెట్టారు. చాలా కాలం పాటు ఈ చేపల కోసం గాలించాడు. చివరకు సముద్రపు అడుగు భాగంలో వాటిని కనిపెట్టాడు. ఈ చేపలు ఎలా నడుస్తున్నాయో తెలుసుకున్నాడు. వాటి నడకకు సంబంధించి విజువల్స్ ను షూట్  చేసి..  తాజాగా వాటిని బయటకు రిలీజ్ చేశాడు.


ఆరు కాళ్ల సీ రాబిన్ గుర్తింపు

సముద్ర గర్భంలో సీ రాబిన్స్ ఆరు కాళ్లను కలిగి ఉన్నాయి. ప్రతి వైపు మూడు చొప్పున ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే.. పీత మాదిరిగానే వీటికి కాళ్లు ఉన్నాయి. వెనుకాల సాధారణ చేపల మాదిరిగానే రెక్కలను కలిగి ఉన్నాయి. ఈ చేపల   కాళ్లలో చాలా ప్రత్యేకతలు కలిగి ఉన్నట్లు కోరీ టీమ్ గుర్తించింది. కాళ్ల చివరలో ఉండే మెత్తటి భాగం ఈ చేపలకు సెన్స్ ఆర్గాన్ లా పని చేస్తున్నట్లు తేల్చింది. సముద్రం అడుగు భాగంలో ఇసుక కింద ఉన్న ఆహారాన్ని కూడా ఈ చేపలు తమ కాళ్ల ద్వారా గుర్తిస్తాయని వెల్లడించింది. ఒకవేళ ఇసుక కింద తినదగిన ఆహారం ఉంటే తమ కాళ్లతో తవ్వి తీసుకుంటాయని కోరీ టీమ్ తెలిపింది.

సీ రాబిన్ గురించి ‘కరెంట్‌ బయోలజీ’లో కీలక విషయాలు వెల్లడి

కోరీ అలార్డ్  సీ రాబిన్ చేపల గురించి తెలుసుకున్న పూర్తి వివరాలను ‘కరెంట్ బయాలజీ’ జనరల్ ప్రచురించింది. సీ రాబిన్ లోని పాదాలు ఆహార గుర్తింపులో కీలక పాత్ర పోషిస్తాయని ఈ కథనంలో వెల్లడించారు. ఈ కాళ్లు ఆహారాన్ని గుర్తించమే కాదు, దాని రుచిని కూడా తెలుసుకుంటున్నాయని తెలిపారు. మనిషి నాలుక ఎలా పని చేస్తుందో ఈ చేపల కాళ్లు అలా పని చేస్తాయని వివరించారు. మొత్తంగా నడిచే చేపల గురించి కోరీ అలార్డ్ బయటపెట్టిన అంశాలు జీవశాస్త్రంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లు అయ్యింది.

Read Also:చెయ్యని తప్పుకు 46 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన ఖైదీ.. ఇన్నాళ్లకు నిర్దోషి అని తీర్పు

Related News

Viral News: ఈ ఊరిలో ఎవరూ ఇంట్లో వంట చేయరు, ఇప్పుడు వరల్డ్ ఫేమస్ అయ్యింది, ఎందుకో తెలుసా?

Cat Employees: పిల్లులకు ఉద్యోగం ఇచ్చిన కంపెనీ.. ఆఫీసులో దర్జాగా అవి ఏం చేస్తున్నాయంటే..!

Employee Fired For Not bring Food For Boss: టిఫిన్ తీసుకురాలేదని ఉద్యోగిని తొలగించిన బాస్.. ఆ తరువాత..

Employee Dies On Duty: సిక్ లీవ్ ఇవ్వడానికి నిరాకరించిన బాస్.. ఫ్యాక్టరీలో మరణించిన మహిళా కార్మికురాలు!

Viral Video: హిప్పోపోటమస్ దంతాలను ఎలా క్లీన్ చేస్తారో చూశారా.. వీడియో వైరల్

Viral News: చెయ్యని తప్పుకు 46 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన ఖైదీ.. ఇన్నాళ్లకు నిర్దోషి అని తీర్పు

Big Stories

×