EPAPER

Viral News: ఔనా, నిజమా.. ఇద్దరు వ్యక్తులు కలలో కమ్యునికేట్ చేసుకోవచ్చా? ఇవిగో ఆధారాలు

Viral News: ఔనా, నిజమా.. ఇద్దరు వ్యక్తులు కలలో కమ్యునికేట్ చేసుకోవచ్చా? ఇవిగో ఆధారాలు

Two People Communicated In Their Dreams: ఫోన్లలో మనం ఎలా మాట్లాడుకుంటామో.. కలలో కూడా అలాగే కబుర్లు చెప్పుకోవచ్చట. అదెలా సాధ్యం అని ఆశ్చర్యపోతున్నారా? కలలో ఇద్దరు మనుషులు.. కమ్యునికేట్ చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు.. ఇందుకు ఆధారాలు కూడా ఉన్నాయంటూ కొన్ని పరిశోధనలు గురించి చెప్పుకొచ్చారు. ఇంతకీ వారు ఏం కనిపెట్టారో   తెలుసుకుందాం..


ఇద్దరు వ్యక్తులు.. ఒకే కల..

మనలో చాలా మందికి నిద్రపోయినప్పుడు కలలు వస్తుంటాయి. కలలో జరిగేవన్నీ నిజంగా జరుగుతున్నట్లుగానే ఫీలవుతాము. ఒక్కోసారి నిద్రలో ఇతరులతో మాట్లాడుతుంటాం. ఎక్కడికో ప్రయాణం చేస్తుంటాం. నిజ జీవితంలో చేసే పనులు, చెయ్యలేని పనులు కూడా కలలో చేసేస్తుంటాం. నిజ జీవితంలో లాగే కలలోనూ ఇద్దరు వ్యక్తులు కమ్యునికేట్ చేసుకోవడం సాధ్యం అవుతుందని కాలిఫోర్నియాలోని రెమ్ స్పేస్ కంపెనీ నిరూపించింది. ఇద్దరు వ్యక్తులు కలలో ఒకరితో మరొకరు మాట్లాడుకునే ప్రయోగాన్ని సక్సెస్ ఫుల్ గా నిర్వహించింది. ఇద్దరు వ్యక్తులు కలలో ఓ కామన్ విషయాన్ని షేర్ చేసుకునేలా చేశారు. ఇందుకోసం ప్రత్యేకమైన పరికరాలతో పాటు టెక్నిక్స్ ఉపయోగించారు.


 ప్రయోగం ఎలా నిర్వహించారంటే?

ఇద్దరు వ్యక్తుల మీద పరిశోధకులు ఈ ప్రయోగం నిర్వహించారు. ఇద్దరు వేర్వేరు ప్రదేశాల్లో పడుకున్నారు. వారి మెదడు తరంగాలను రిమోట్ ఆపరేట్స్ ద్వారా ట్రాక్ చేశారు. బయోలాజికల్ సిగ్నల్స్ పర్యవేక్షించడానికి ఓ స్పెషల్ డివైజన్ ను ఉపయోగించారు. ఈ డివైజన్ ను సర్వర్ కు కనెకట్ట్ చేశారు. ఆ డేటాను సర్వర్ లో స్టోర్ చేశారు. సర్వర్ లో ఓ వ్యక్తి కలలోకి వెళ్లినట్లు గుర్తించారు. ప్రత్యేకమైన భాషను ఉపయోగించి కలలో ఉన్న వ్యక్తికి ‘జిలక్’ అనే పదాన్ని ఇయర్ బడ్ ద్వారా వినిపించారు. ఆయన కలలో అదే పదాన్ని రిపీట్ చేశారు. కొద్ది సేపటి తర్వాత మరో వ్యక్తి కలలోకి ప్రవేశించాడు. మొదటి వ్యక్తి నుంచి స్టోర్ చేసిన డేటాను సర్వర్ ద్వారా రెండో వ్యక్తికి పంపించారు. రెండో వ్యక్తి కూడా సేమ్ పదాన్ని రిపీట్ చేశాడు. సో, ఇద్దరు వ్యక్తులు ఒకేలా కలగనేలా చెయ్యొచ్చని పరిశోధకులు తెలిపారు.

డ్రీమ్స్ కమ్యూనికేషన్ ద్వారా లాభం ఏంటి?

ప్రస్తుతం డ్రీమ్స్ కమ్యూనికేషన్ ప్రయోగదశలో ఉన్నది. ఇంకా పూర్తి స్థాయిలో డెవలప్ చేయాల్సిన అవసరం ఉందని రెమ్ స్పేస్ కంపెనీ వెల్లడించింది. ఈ ప్రయోగం మున్ముందు చాలా ఉపయోగపడే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు. మానసిక సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు వాడవచ్చని భావిస్తున్నారు. నిద్రలోనే కొత్త విషయాలను తెలుసుకునే అవకాశం ఉంటుందంటున్నారు.

కలలను కంట్రోల్ చేసుకోవచ్చు!

డ్రీమ్స్ కమ్యూనికేషన్ గురించి రెమ్ స్పేస్ అధినేత మైఖేల్ కీలక విషయాలు వెల్లడించారు. “ఇది ప్రస్తుతం సైన్స్ ఫిక్షన్ లా అనిపించవచ్చు. కానీ, భవిష్యత్ లో కామన్ అవుతుంది. సొంత కలలను కంట్రోల్ చేసుకునేందుకు జనాలు ప్రయత్నించే అవకాశం ఉంటుంది. నిద్రకు సంబంధించిన పరిశోధనల్లో కీలక మైలురాయిగా మారుతుంది. మానసిక, నైపుణ్యల శిక్షణలో ఎంతో సాయపడే అవకాశం ఉంటుంది. మున్ముందు ఇదో ఇండస్ట్రీగా మారే అవకాశం ఉంటుంది” అని ఆయన వెల్లడించారు.

Read Also: మొబైల్ నెట్‌వర్క్‌ లేని భూలోక స్వర్గం.. ప్రశాంతంగా ఉండాలనుకుంటే అక్కడికి వెళ్లాల్సిందే!

Related News

Chinese Aquarium Whale Shark: నకిలీ వేల్ షార్క్ చూపించి కోట్లు సంపాదించిన చైనా కంపెనీ.. ఎలా గుర్తుపట్టారంటే

UP Train Incident: రైలు కిటికీ నుంచి జారిపడ్డ‌ చిన్నారి.. చిమ్మ చీకట్లో 16 కి. మీ.. సీన్ కట్ చేస్తే..

Funny Resignation Letter: ‘మంచి భవిష్యత్తు కోసం మరో ఉద్యోగంలో చేరుతున్నా.. నచ్చకపోతే తిరిగి వస్తా’.. వింత రాజీనామా వైరల్

Viral Video: ఇది జర్నీయా? లేక సైన్స్ ఫిక్షన్ మూవీనా? నెట్టింట వైరల్ అవుతున్న చైనీస్ యువకుడి వీడియో!

Ratan Tata’s Pet Dog: అయ్యో పాపం.. రతన్ టాటా పెంపుడు కుక్క చనిపోయిందా?

మొబైల్ నెట్‌వర్క్‌ లేని భూలోక స్వర్గం.. ప్రశాంతంగా ఉండాలనుకుంటే అక్కడికి వెళ్లాల్సిందే!

Big Stories

×