EPAPER

Brain Surgery Jr NTR movie: 2.5 గంటల పాటు బ్రెయిన్ సర్జరీ.. ఆపరేషన్ జరుగుతుండగా ఎన్టీఆర్ సినిమా చూసిన పేషెంట్

Brain Surgery Jr NTR movie: 2.5 గంటల పాటు బ్రెయిన్ సర్జరీ.. ఆపరేషన్ జరుగుతుండగా ఎన్టీఆర్ సినిమా చూసిన పేషెంట్

Brain Surgery Jr NTR movie| వైద్య రంగంలో అరుదైన ఆపరేషన్లు డాక్టర్లు విజయవంతంగా పూర్తి చేస్తున్న ఘటనలు అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం. తాజాగా ఇలాంటిదే ఒక ఆపరేషన్ ని ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లు చేసి చూపించారు. పేషెంట్ మెలుకువలో ఉండగానే ఆమె తలని తెరిచి అందులో మెదుడు ఆపరేషన్ చేశారు. పైగా ఆపరేషన్ జరుగుతున్న సమయంలో ఆ మహిళా పేషెంట్ తనకు ఇష్టమైన హీరో సినిమా చూడడం విశేషం.


వివరాల్లోకి వెళితే.. అనంతలక్ష్మి అనే 55 ఏళ్ల మహిళ కొంతకాలంగా తరుచూ తలనొప్పి వచ్చేది. ఆమె చేతులు, కాళ్ల అప్పుడప్పుడూ పనిచేసేవి కావు. దీంతో ఆమె డాక్టర్లను సంప్రదించింది. డాక్టర్లు ఆమెకు పరీక్షలు చేయగా.. ఆమె మెదడులోని ఎడమ భాగంలో ట్యూమర్ (కణితి) ఏర్పడిందని తెలిసింది. ఆ ట్యూమర్ ఆకారం 3.3 * 2.7 2. సెంటిమీటర్లుగా ఉందని పరీక్షలో తేలింది.

Also Read: రెండేళ్ల క్రితం అమెజాన్ ఆర్డర్ క్యాన్సిల్.. రీఫండ్ పూర్తి.. ఇప్పుడు డెలివరీ!


అనంతలక్ష్మికి వెంటనే ఆపరేషన్ చేసి మెదడులో ఏర్పడిన కణితిని తొలగించాలిన వైద్య నిపుణలు సూచించారు. దీంతో అనంతలక్ష్మి అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల డాక్టర్లకు చూపించారు. వారంతా ఆపేషన్ కు చాలా ఎక్కువగా ఖర్చు అవుతుందని తెలిపారు. ఏం చేయాలో తెలియక అనంతలక్ష్మి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ లో డాక్టర్లు ఆమెకు ఆపరేషన్ చేసేందుకు ముందుకువచ్చారు. అయితే ఆమె మెదుడుకు ఆపరేషన్ చేసేందుకు క్రెనియోటమీ అనే పద్థితిని ఎంచుకున్నారు.

ఈ క్రెనియోటమీ పద్థితిలో మెదడుకు ఆపరేషన్ జరుగుతున్న సమయంలో పేషెంట్ స్పృషలోనే ఉండాలి. అలా చేయడం వల్ల డాక్టర్లకు మెదడుకు ఆపరేషన్ చేస్తుండగా.. పేషెంట్ మతిస్థిమితం కోల్పోకుండా జాగ్రత్త పడగలరు. కానీ ఆపరేషన్ కు రెండు గంటల కంటే ఎక్కువ సమయం పడుతుందని డాక్టర్లు అంచనా వేసి.. అంతసేపు పేషెంట్ నిద్రపోకుండా ఉండేందుకు ఆమెను తనకు ఇష్టమైన ఏదైనా సినిమా చూసేందుకు అనుమతించారు.

ఈ క్రమంలో అనంతలక్ష్మికి మెదడు సర్జరీ జరుగుతున్న సమయంలో ఆమె తనకు ఇష్టమైన అదుర్స్ సినిమా చూశారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఈ సినిమా అద్యంతం కామెడీ సీన్లతో సాగుతుంది. దీంతో అనంతలక్ష్మి ఆపరేషన్ జరుగుతున్నంతసేపు సినిమా చూస్తూ.. హాయిగా నవ్వుకుంటూ గడిపింది. దీనికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది.

ఇలాంటి ఆపరేషన్ మరొకటి గత వారం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. అక్కడ కల్యాణ్ సింగ్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఆస్పత్రిలో 56 ఏళ్ల వ్యక్తి మెదుడుకి ఆపరేషన్ చేసి డాక్టర్లు ట్యూమర్ తొలగించారు.

Also Read: విచిత్ర వివాహం.. 70 ఏళ్ల ముసలాడితో 25 ఏళ్ల యువతి పెళ్లి.. ఎలా కుదిరిందంటే?

జనవరి 2024లో కూడా దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో 5 ఏళ్ల పాపకు మెదడులో నుంచి ట్యూమర్ ని తొలగించారు. ఆపరేషన్ జరిగినంత సేపు ఆ పాప మెలుకువలోనే ఉంది. డాక్టర్లతో మాట్లాడుతూ ప్రదాన మంత్రి నరేంద్ర మోదీని గుర్తించింది.

Related News

Viral Video: ఇంత కక్కుర్తిలో ఉన్నావేంట్రా.. నేలపై పారుతున్న మద్యాన్ని ఎలా తాగేశాడో చూడండి

Viral Video: డాక్టర్‌పై చెప్పులతో దాడి.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..

Shocking Video: సన్యాసిగా మారిన పిల్లిని ఎప్పుడైనా చూశారా..! ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు

Mystery: చావు రహస్యం తేలిపోనుంది.. మరణం తర్వాత మూడో దశ!.. కన్ఫమ్ చేసిన సైంటిస్టులు

Flipkart: స్మార్ట్‌ఫోన్ పై 99 శాతం డిస్కౌంట్.. ఇదెక్కడి మోసమంటూ ఫ్లిప్‌కార్ట్‌పై కస్టమర్ల ఆగ్రహం

Viral Video: నూడుల్స్‌ని ఇష్టంగా లాగించేస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు

Big Stories

×