Optical Illusion IQ Test: పదసోపానాలు, పజిల్స్ నింపడం, పజిల్ క్యూబ్స్ సరిచేయడం, చిత్రాల్లోని తేడాలను గుర్తించడం లాంటి పనులు నిజ జీవితంలోనూ ఎంతగానో ఉపయోగపడుతాయి. మన ఆలోచనా శక్తిని, నైపుణ్యాన్ని పెంచుతాయి. సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో చూపిస్తాయి. సరికొత్త పరిష్కార మార్గాలు కనుగొనేందుకు మన బ్రెయిన్ ను సిద్ధం చేస్తాయి. పజిల్స్, ఆప్టికల్ ఇల్యూజన్స్ మెదడును మరింత చురుగ్గా మార్చుతాయి. ఆ సమస్యలను పరిష్కరించినప్పుడు చాలా సంతోషంగా ఫీలవుతాం. అంటే.. పజిల్స్ తో మెదడును యాక్టివ్ గా మార్చుకోవడంతో పాటు మానసిక ఆనందాన్ని పొందుతాం..
వయసుతో సంబంధం లేకుండా..
పజిల్స్ అనేవి వయసుతో సంబంధం లేకుండా ఆడుకోవచ్చు. చిన్న పిల్లల నుంచి మొదలుకొని, పెద్దవారి వరకు ఈ సమస్యలను పరిష్కరించవచ్చు. మానసిక సంతోషాన్ని పొందవవచ్చు. సమస్యల పరిష్కార నైపుణ్యాలను పెంచుకోవచ్చు. ఆప్టికల్ ఇల్యూషన్స్, పజిల్స్, టెస్టులు మెదడుకు సంబంధించిన పరిశీలన నైపుణ్యాలు, సమస్యను పరిష్కరించే నైపుణ్యాలను పెంచుతాయి. IQను మెరుగు పరచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బోలెడు అందుబాటులో ఉన్నాయి. చాలా మంది వాటిని ఆడుతూ, తమ ఆలోచన శక్తిని బయటపెట్టుకుంటున్నారు. అలాంటి ఓ ఫోటో గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ఈ గదిలో 3 చిప్స్ ప్యాకెట్స్ ఉన్నాయి గుర్తించండి!
ఇప్పుడు మనం ఆప్టికల్ ఇల్యూజన్స్ కు సంబంధించి ఓ పజిల్ ఆడుదాం. ఈ ఫోటో చూస్తే, మీకు ఏం అనిపిస్తుంది? గదిలోని వస్తువులు అన్ని చిందరవందరగా పడేసి ఉన్నాయి. గది నిండా రకరకాల వస్తువులు ఉన్నాయి. ఈ ఇంటి నిండా పడి ఉన్న వస్తువుల మధ్యలో మూడు చిప్స్ ప్యాకెట్లు ఉన్నాయి. అవి ఎక్కడ ఉన్నాయో గుర్తించడమే ఈ పజిల్ లక్ష్యం. ఈ పజిల్ కేవలం 10 సెకెన్లలో పూర్తి చేస్తే.. మీకు మంచి బ్రెయిన్ షార్ఫ్ నెస్ ఉన్నట్లు అర్థం. ఆప్టికల్ ఇల్యూజన్స్ లో పరిశీలన అనేది అత్యంత ముఖ్యమైనది. క్షణాల్లో ఆయా ఫోటోలను పూర్తిగా పరిశీలించాల్సి ఉంటుంది. అనుకున్న అబ్జెక్ట్ ను గుర్తించాలి. చిందరవందరగా ఉన్న ఈ గదిలో మూడు చిప్స్ ప్యాకెట్లను.. మీరు ఎంతసేపట్లో గుర్తించగలరో ప్రయత్నించండి.
చాలా సేపు ప్రయత్నించినా చిప్స్ ప్యాకెట్స్ గుర్తించలేకపోయారా? చివరిసారిగా మరోసారి ప్రయత్నించండి. అయినా గుర్తించలేకపోతే, ఇక మీ ప్రయత్నాన్ని ఆపేయండి. రెండు ఎరుపు రంగులో ఉన్న చిప్స్ ప్యాకెట్స్, ఒకటి గ్రీన్ కలర్ లో ఉన్న చిప్స్ ప్యాకెట్ ను మార్క్ చేశాం చూసేయండి!
వీలున్నప్పుడు ప్రయత్నించండి..
ఇలాంటి ఆప్టికల్ ఇల్యూజన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో బోలెడు ఉన్నాయి. వీలున్నప్పుడల్లా ప్రయత్నించండి. మీరే కాదు, మీ పిల్లలకు వీటిని నేర్పించండి. మీతో పాటు వారి బ్రెయిన్ ను కూడా యాక్టివ్ గా మార్చే ప్రయత్నం చేయండి.
Read Also: దేశంలో అత్యంత అందమైన రైల్వే ప్రయాణాలు.. లైఫ్ లో ఒక్కసారైనా ఈ జర్నీ చేయాల్సిందే!