EPAPER

Man Extracts 23 Teeth: ఒకేరోజు 23 పళ్లు తీయించుకున్నాడు.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు..!

Man Extracts 23 Teeth: ఒకేరోజు 23 పళ్లు తీయించుకున్నాడు.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు..!

China Man Extracts 23 Teeth in a day | ఒక దంత వైద్యుడు 24 గంటల వ్యవధిలో తన పేషెంంట్‌ నోటిలోని 23 పళ్లను తొలగించాడు. అయితే అంతటితో ఆగక అదే రోజు 12 ఇంప్లాట్ పళ్లు కూడ అమర్చాడు. ఇదంతా చేసి ఆ డెంటిస్ట్ డాక్టర్, పేషెంట్ ఒక కొత్త రికార్డ్ సృష్టించారు. కానీ వారి రికార్డ్ చివరికి దుఖాన్ని మిగిల్చింది. కొన్ని రోజుల తరువాత ఆ పేషేంట్ గుండె పోటుతో మరణించాడు. ఈ ఘటన చైనా దేశంలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వార్తా సంస్థ ప్రచురించిన కథనం ప్రకారం.. షు హుయాంగ్ అనే యువతి ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. చైనాలోని ఝేజియాంగ్ రాష్ట్రం జిన్‌హువా నగరానికి చెందిన ఆమె తండ్రి హుయాంగ్ (55) కు నోటిలో పళ్ల సమస్య ఉండడంతో దంత వైద్యులు వాటిని తొలగించాని గతంలో సూచించారు. అయితే హుయాంగ్ తన పళ్ల చికిత్స కోసం నగరానికి చెందిన యాంగ్‌కాంగ్ డీవే డెంటల్ హాస్పిటల్ లో చికిత్స చేయించుకుంటున్నాడు.

ఈ క్రమంలో ఆస్పత్రికి చెందిన ఒక యువ డాక్టర్ హుయాంగ్ ఒకేసారి అన్ని పళ్లు పీకేసి చికిత్స చేయాలని సూచించాడు. దీనికి హుయాంగ్ అంగీకరించడంతో ఆగస్టు 14 న హుయాంగ్ నోటిలోని మొత్తం 23 పళ్లను డాక్టర్ తొలగించాడు. పై గా వాటి స్థానంలో 12 ఇంప్లాంట్ పళ్లను కూడా ఫిక్స్ చేశాడు. అయితే ఆపరేషన్ తరువాత హుయాంగ్ ఇంటికి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అతనికి ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. అలా 13 రోజుల తరువాత సెప్టెంబర్ 3న హుయాంగ్ తన ఇంట్లో గుండె పోటుతో మరణించాడు.


Also Read: కుటుంబాన్ని పోషించడానికి ఆ పనిచేస్తున్న మహిళ.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజెన్లు!

హుయాంగ్ మరణానికి ఆ దంత వైద్యుడు, ఆస్పత్రి యజమాన్యమే కారణమని హుయాంగ్ కూతురు.. షూ హుయాంగ్ ఆరోపణలు చేసింది. ఆస్పత్రి యజమాన్యంపై కేసు వేసింది. కానీ పోలీసులు విచారణ చేస్తూ.. ఆపరేషన్ చేసిన 13 రోజుల తరువాత హుయాంగ్ మరణించడంతో అతని మృతిపై అనుమానాలు వ్యక్తి చేస్తున్నారు. అందుకే హుయాంగ్ మరణానికి గల సరైన కారణాల కోసం అతని పోస్టు మార్టం రిపోర్ట్, నిపుణుల అభిప్రాయం పై విచారణ అధారపడి ఉంది.

ఈ కేసు గురించి తెలిసిన తరువాత చైనాలో ని డాక్టర్లు స్పందించారు. వైద్య పరిభాషలో ఒక ఆపరేషన్ లో అన్ని పళ్లు తొలగించాలా? లేక గరిష్ట పరిమితి అంటూ ఏదీ లేదని తెలిపారు. అయితే సాధారణంగా ఒక మనిషి నోటి లో నుంచి పళ్లు తొలగిస్తే.. సాధారణంగా పది పళ్ల కంటే ఎక్కువ సంఖ్యలో తొలగించడం ఆరోగ్యకరం కాదని తెలిపారు. కానీ హుయాంగ్ కేసులో ఒకేసారి 23 పళ్లు తొలగించడమనేది చాలా ఆశ్చర్యకరమని తెలిపారు.

అయితే పంటి ఆపరేషన్ చేసినా దంతాలు తొలగించినా కొంతమందికి ఆందోళన వల్ల అధిక రక్త పోటు రావడం, ఆపరేషన్ సమయంలో ఆనెస్థిటిక్స్ (మత్తు మందు) మోతాదు మించిపోయినా, లేదా మెడిసిన్ రియాక్షన్, పేషెంట్ కు ఆపరేషన్ చేసిన చోట్ ఇన్‌ఫెక్షన్ తీవ్రంగా ఉండడం, లేదా ఇంతకుముందే పేషెంట్ కు గుండె సంబంధిత రోగాలేమైనా ఉంటే అయినా పేషెంట్ కు గుండె సమస్య వచ్చే ప్రమాదముందని నిపుణులు తెలిపారు.

సోషల్ మీడియాలో హు చేసిన పోస్ట్ తెగవైరల్ కావడంతో నెటిజెన్లు 23 పళ్లు పీకిన డాక్టర్ పై మండిపడుతున్నారు. అందులో ఒక డాక్టర్ యూజర్..”నేను స్వయంగా డాక్టర్ ని కానీ ఒక సారి నేను 3 పళ్లకు మించి తీయకూడదని సూచిస్తాను. పైగా ఆ డాక్టర్ ఆపరేషన్ చేశారా? లేకపోతే మనిషిపై ప్రయోగం చేశాడా? అనేది అర్థం కావడం లేదు”ని కామెంట్ చేశాడు.

Related News

Shocking Video: సన్యాసిగా మారిన పిల్లిని ఎప్పుడైనా చూశారా..! ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు

Mystery: చావు రహస్యం తేలిపోనుంది.. మరణం తర్వాత మూడో దశ!.. కన్ఫమ్ చేసిన సైంటిస్టులు

Flipkart: స్మార్ట్‌ఫోన్ పై 99 శాతం డిస్కౌంట్.. ఇదెక్కడి మోసమంటూ ఫ్లిప్‌కార్ట్‌పై కస్టమర్ల ఆగ్రహం

Viral Video: నూడుల్స్‌ని ఇష్టంగా లాగించేస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు

Amazon Delivery After 2 Years: రెండేళ్ల క్రితం అమెజాన్ ఆర్డర్ క్యాన్సిల్.. రీఫండ్ పూర్తి.. ఇప్పుడు డెలివరీ!

Viral Video: మీరేంట్రా ఇలా ఉన్నారు.. రూ. 10 జిలేబీ కోసం కొట్టుకుంటారా..

Urination: మూత్ర విసర్జన తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..

Big Stories

×