EPAPER

Leave For Piles: ‘నీకు పైల్స్ ఉందని ఆధారం చూపించు’.. లీవ్ అడిగినందుకు బాస్ కండీషన్.. ఎంత పని చేశాడంటే?.

Leave For Piles: ‘నీకు పైల్స్ ఉందని ఆధారం చూపించు’.. లీవ్ అడిగినందుకు బాస్ కండీషన్.. ఎంత పని చేశాడంటే?.

Leave For Piles| ఒక ఉద్యోగి తనకు ఆరోగ్యం బాగోలేదని, ఒక రోజు సెలవు ఇవ్వాలని తన బాస్ కు చెప్పాడు. కానీ ఆ బాస్ అతడి మాటుల నమ్మలేదు. అప్పుడా ఉద్యోగి తాను నిజమే చెబుతున్ననని తన వల్ల నిలబడడం కూడా కావడం లేదని చెప్పాడు. కానీ ఆ బాస్ మాత్రం అనారోగ్యంగా ఉన్నట్ల ఆధారాలు చూపించమని అడిగాడు. దీంతో ఆ ఉద్యోగి వెంటనే అందరూ ఆశ్చర్యపోయే విధంగా పనిచేశాడు. దీని గురించి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ రెడ్డిట్ లో పోస్ట్ చేశాడు. కానీ చేసిందంతా చేసి బాధపడుతున్నాడు. తనపై కంపెనీ బాస్ పోలీసులకు ఫిర్యాదు చేస్తాడా? అని భయపడుతున్నాడు.


వివరాల్లోకి వెళితే.. ఒక కార్పొరేట్ కంపెనీలో పనిచేసే దిలీప్ (పేరు మార్చబడినది)కు పైల్స్ తో బాధపడుతున్నాడు. అతనికి కూర్చోవడం, నిలబడడం కూడా సమస్యగా మారింది. దీంతో అతను ఆఫీసుకు వెళ్లలేదు. తన మేనేజర్ కు ఫోన్ చేసి తనకు అనారోగ్యం చేసిందని.. ఒకరోజు సెలవు కావాలని అడిగాడు. కానీ దిలీప్ మేనేజర్ మాత్రం సెలవు ఇవ్వడానికి అంగీకరించలేదు. వెంటనే ఆఫీసుకు రావాలని చెప్పాడు. అయితే దిలీప్ విషయం స్పష్టంగా చెప్పాడు. తనకు పైల్స్ (మొలల సమస్య) ఉందని.. దీంతో తాను నిలబడలేక పోతున్నానని.. ఇలాంటి అవస్థలో ఆఫీసులో పనిచేయలేనని చెప్పాడు.

Also Read: ఇది మీ దేశం కాదు’.. ఆస్ట్రేలియా పార్లమెంటులో బ్రిటన్ రాజుకు ఘోర అవమానం


ఇదంతా విన్న మేనేజర్ అతడు నిజం చెబుతున్నాడో లేదో? ఆధారాలు చూపమని అడిగాడు. ఏదైనా డాక్టర్ వద్దక వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకొని ఆ రిపోర్ట్ చూపించాలని చెప్పాడు. కానీ దిలీప్ తన వద్ద వైద్య పరీక్షల రిపోర్ట్ లేదని.. అయితే ఆధారం మాత్రం ఉందని అన్నాడు. వెంటనే ఫోటోలు పంపుతున్నానని చెప్పి.. దిలీప్ తన నగ్న ఫొటోలు పంపించాడు. ఆ ఫొటోల్లో తనకు మొలలు ఉన్నట్లు తన మలద్వారం ఫొటోలు కూడా పంపించాడు. ఇదంతా చూసి షాక్ కు గురైన బాస్ నోరు మూసుకోవాల్సి వచ్చింది.

అయితే ఈ ఘటన తరువాత దిలీప్.. తన రెడ్డిట్ అకౌంట్ లో మరో పోస్ట్ చేశాడు. తాను ఫొటోలు పంపించిన తరువాత ఆ ఫొటోలు అశ్లీలంగా ఉన్నాయని తన మెనేజర్ హెచ్ ఆర్ విభాగానికి ఫిర్యాదు చేయడు కదా? కంపెనీ వాళ్లు తనపై పోలీస్ కేసు పెట్టరు కదా? అని భయపడుతున్నట్లు తన పోస్ట్ లో పేర్కొన్నాడు.

పైల్స్ (మొలలు) అనే సమస్యను మెడికల్ భాషలో హెమరాయిడ్స్ అని అంటారు. ఈ సమస్య వచ్చిన వారికి మలద్వారంలోని రక్తనాళాల్లో వాపు ఉండడంతో వారు తీవ్ర నొప్పి, మంటకు గురవుతారు. సమస్య తీవ్రమైతే మలవిసర్జన సమయంలో వారికి రక్తస్రావం కూడా అవుతుంది. ఈ సమస్యకు వైద్యులు ఉపశమసనం కోసం వేడినేటిలో కూర్చోవడం, వేడినీటితో స్నానం చేసి విశ్రాంతి తీసుకోవడంతో పాటు మాంసాహారం, కారం, మసాలా, నూనె కలిగిన ఆహారం తినకూడదని సూచిస్తారు. ఈ సమస్య ముఖ్యంగా శరీరంలో ఫైబర్ శాతం (పీచు పదార్థం) తగ్గడంతో కలుగుతుంది.

కూరగాయలు, పండ్లు తక్కువగా తినడం లేదా మాంసాహారం, మాసాలా ఫుడ్స్ అతిగా తినడం వల్ల వస్తుంది. జీర్ణశక్తి తగ్గిపోయి మలబద్ధకం, గ్యాస్, లాంటి సమస్యలతో మొదలై.. చివరికి మొలల సమస్య తలెత్తుతుంది.

Related News

Europe Techie Salary: ‘లండన్‌లో సాలరీ రూ.80 లక్షలు.. బెంగుళూరుకు వచ్చేయాలనుకుంటున్నాను’.. సోషల్ మీడియాలో భారత టెకీ వైరల్ పోస్ట్

God Of Marriage: దేవుడా!.. 4 భార్యలు, 2 గర్ల్‌ఫ్రెండ్స్, 10 మంది పిల్లలు.. భార్యల సంపాదనపై బతుకుతున్నాడు!

Viral Video: పాముకు CPR చేయడం ఏంటి బ్రో? నిజంగా నువ్ గ్రేట్ అబ్బా!

Viral Video: గెడ్డం గీసుకోండి.. ప్రేమలో పడండి, అమ్మాయిల కొత్త డిమాండ్.. ఏకంగా ర్యాలీ చేసేశారు

Elon Musk, Jeff Bezos As Bartenders: బార్‌టెండర్లుగా ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్.. రెస్టారెంట్ ప్రమోషన్ కోసం అవతారాలు!

Viral News: పాము కడుపులో 100 గ్రాముల ప్లాస్టిక్, ఒడియమ్మా బడువా.. దాన్నెలా తిన్నావే తల్లి?

Big Stories

×