EPAPER

Ghost Tunnel: టన్నెల్ లో తిరుగుతున్న ఆత్మ.. కేవలం అలాంటి వారితో మాత్రమే మాట్లాడుతుంది

Ghost Tunnel: టన్నెల్ లో తిరుగుతున్న ఆత్మ.. కేవలం అలాంటి వారితో మాత్రమే మాట్లాడుతుంది

Ghost Tunnel| మనమంతా చాలా సార్లు దెయ్యాలు, ప్రేతాత్మల కథలు వినే ఉంటారు. అయితే కొందరు దెయ్యాలున్నాయని నమ్ముతారు. కొందరు ఇదంతా కేవలం ఊహ మాత్రమే నిజం కాదు అని కొట్టిపారేస్తారు. అయితే ఈ భూమిపై కొన్ని రహస్యాలు ఉన్నాయి. వాటిని ఎవరూ పరిష్కరించలేకపోయారు. అందుకే వాటి జోలికి ఎవరూ పోరు. అలాంటి ఒక రహస్యమే ఒక టన్నెల్ లో ఉంది. ఆ టన్నెల్ లో ఒక వ్యక్తి కొందరికి మాత్రమే కనిపిస్తాడు. టన్నెల్ ప్రారంభంలో వారికి కనిపిస్తాడు, మాట్లాడుతాడు.. టన్నెల్ చివరి వరకూ వారందరితో ప్రయాణిస్తాడు కూడా. అయితే టన్నెల్ చివర్లో అనుకోకుండా మాయమైపోతాడు. ఆ వ్యక్తి ఎవరో, ఎక్కడి నుంచి వస్తున్నాడో, ఇంతవరకూ ఎవరూ చెప్పలేకపోయారు.


వివరాల్లోకి వెళితే.. లండన్ మహానగరంలో బ్లాక్ వాల్ టన్నెల్ ఉంది. థేమ్స్ నది కింద ఈ టన్నెల్ ని నిర్మించారు. ఈ టన్నెల్ కు ఒకవైపు లండన్ బరో ఆఫ్ టవర్ హామ్ లెట్స్ ఉంటే మరో చివర రాయల్ బరో ఆఫ్ గ్రీన్ విచ్ ఉంది. బ్లాక్ వాల్ టన్నెల్ చాలా బిజీగా ఉంటుంది. 50 ఏళ్లుగా ఈ టన్నెల్ ఉపయోగం విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఈ టన్నెల్ కేవలం థేమ్స్ నది వల్లనో లేక రాజధాని లో ఉన్నందుకు గానో ఫేమస్ కాలేదు. టన్నెల్ లో ఒక విచిత్ర వ్యక్తి ఉన్నాడని అతడు అప్పుడప్పుడూ కనిపిస్తాడు. . ఆ తరువాత మాయమైపోతాడని చాలా మంది చూసిన వాళ్లు చెబుతున్నారు. ఆ చూసిన వాళ్లు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉండడం గమనించాల్సిన విషయం.

లండన్ మీడియా ప్రకారం.. టన్నెల్ నుంచి ప్రయాణించే వాహనాలను ఓ వ్యక్తి గమినిస్తూ ఉంటాడని.. అయితే ఆ వ్యక్తి కేవలం బైక్ పై వెళ్లే వారికి మాత్రమే కనిపిస్తాడు. అది కూడా ఒంటరిగా వెళుతున్న బైకర్లను పిలుస్తాడు. వారిని టన్నెల్ చివరి వరకు లిఫ్ట ఇవ్వమని సహాయం అడుగుతాడు. కేవలం ఒకటిన్నర కిలోమీటర్ పొడవున్న ఆ టన్నెల్ లో లండన్ బరో ఆఫ్ టవర్ హామ్ లెట్స్ వైపు నిలబడుకొని బైకర్స్ ని పిలుస్తూ ఉంటాడు.


Also Read: Man Marries sister: వధువు చేయి చూసి పెళ్లి ఆపేసిన వరుడి తల్లి.. ఏం జరిగిందంటే..

అయితే ఎవరైనా అతనికి లిఫ్ట్ ఇవ్వగానే వారి బైక్ పై కూర్చొని వారితో సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. అయితే టన్నెల్ చివరికి రాగానే ఎక్కడ దిగాలి అని బైకర్ అడిగితే మాట్లాడడు. ఆ బైక్ నడిపై వ్యక్తి వెనక్కి తిరిగి చూస్తే.. వెనుక ఎవరూ ఉండరు. ఇలా ఆ టన్నెల్ లో ఒంటరిగా ప్రయాణించే బైకర్లందరికీ అనుభవం ఎదురైంది. చాలా మంది బైకర్లు తాము టన్నెల్ లోపల ఓ యువకుడిని చూశామని చెబుతున్నారు. అయితే ఆ యువకుడెవరో ఓ బైకర్ దాదాపు తెలుసుకున్నాడు.

Also Read:  ‘నా ఇష్టం మీకేంటి?’.. 16 ఏళ్ల అబ్బాయిని డేట్ చేస్తున్న 21 ఏళ్ల భామ..

1897లో బ్లాక్ వాల్ టన్నెల్ నిర్మాణం జరిగింది. ఈ టన్నెల్ ద్వారా నదికి అటు నుంచి ఇటువైపు వెళ్లేందుకు కొత్త మార్గం ఏర్పాటు చేశారు. అయితే ఈ టన్నెల్ నిర్మాణ సమయంలో 800 మంది కూలీలు పనిచేశారు. టన్నెల్ నిర్మాణ సమయంలో ఒక ప్రమాదం జరిగి ఏడుగురు కూలీలు చనిపోయారు. దీంతో టన్నెల్ కొన్ని సంవత్సరాలు మూసివేశారు. ఆ తరువాత పూర్తి స్థాయిలో ప్రారంభించారు. మళ్లీ 1970వ దశకంలో ఈ టన్నెల్ లో చాలా ప్రమాదాలు జరిగాయి. దీంతో టన్నెల్ ని రెండింతలు వెడల్పు చేశారు.

Also Read: ఫోన్లో ప్రియుడితో మాట్లాడుతుండగా పట్టుబడిన కొత్త పెళ్లికూతురు.. భర్త ఏం చేశాడంటే?

ఆ తరువాత నుంచే టన్నెల్ లోపల ఒక యువకుడు అందరికీ కనిపిస్తున్నాడు. ఒక రోజు రాత్రి ఓ యువకుడు బైక్ పై ఒంటరిగా టన్నెల్ మీదుగా ప్రయాణిస్తుండగా.. ఒక విచిత్ర వ్యక్తి.. కనిపించాడు. పక్క నుంచి కార్లు వెళుతున్నా.. బైకర్ ని మాత్రమే లిఫ్ట్ ఇవ్వమని అడిగాడు. అలా ఆ బైకర్ ఆ విచిత్ర వ్యక్తి లిఫ్ట్ ఇచ్చాడు. మార్గమధ్యలో ఎక్కడికి వెళ్లాలి అని అడిగితే నేరుగా వెళ్లాలి అని సమాధానమిచ్చాడు. ఆ బైకర్ చాలా సరదాగా మాట్లాడుతూ.. మీదే ఊరు, ఇక్కడి వారిలా అనిపించడం లేదు. అని అడిగాడు. అప్పుడా ఆత్మ అతనికి ఒక అడ్రస్ చెప్పి మాయమైపోయింది. అది చూసిన బైకర్ షాకైపోయాడు. తనకు ఎదురైన వింత ఘటన గురించి ఎవరికి చెప్పినా నమ్మలేదు.

Also Read: ‘రైల్వే ఉద్యోగం కావాలా? రూ.20 లక్షలు ఖర్చు అవుతుంది!’.. యువతిని మోసం చేసిన ‘అమిత్ షా సెక్రటరీ

దీంతో ఆ బైకర్ కు ఒక ఐడియా వచ్చింది. ఆ ఆత్మతో మాట్లాడుతున్నప్పుడు ఒక అడ్రస్ తెలసింది కదా.. అక్కడికి వెళదామని. ఆ బైకర్ అదే పనిగా ఆ ఆత్మ చెప్పిన అడ్రస్ కు వెళ్లాడు. అక్కడ ఒక ఇల్లు ఉంది. అందులో ఒక 60 ఏళ్ల మహిళ నివసిస్తోంది. ఆమెను ఆ బైకర్ కలిసి.. వివరాలు అడిగాడు. ఆ మహిళకు సంబంధించిన వారెవరైనా లండన్ లో ఉన్నారా.. ముఖ్యంగా లండన్ సమీపంలోని బ్లాక్ వాల్ టన్నెల్ వద్దకు వెళ్లారా? అని ప్రశ్నించాడు. అప్పుడా మహిళ ఆ రహస్యాన్ని విప్పింది. ఆ మహిళ మరెవరో కాదు ఆ ఆత్మగా కనిపిస్తున్ వ్యక్తి భార్య. తన భర్త 1970 దశకంలో టన్నెల్ మీదుగా బైక్ పై వెళుతూ ప్రమాదంలో మరణించాడని ఆమె తెలపింది. అయితే ఇప్పటికే చాలామంది ఇది కట్టు కథ అని నమ్మరు. కానీ కళ్లారా చూసిన వారు దీన్ని కాదనలేరు.

Also Read: ఫారిన్‌లో ఉద్యోగం చేస్తున్న యువకుడు.. పెళ్లికి ముందు యువతిని ఎలా మోసం చేశాడంటే..

Related News

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Jani Master : కేసులో మరో ట్విస్ట్.. కూపీ లాగనున్న మహిళా కొరియోగ్రాఫర్..!

Bigg Boss 8 Day 18 Promo: హౌస్ లో పెద్ద డ్రామా నడుస్తోందే.. సోనియా కి ఝలక్ ఇచ్చిన నబీల్..!

Heroine Poorna: తల్లిని నిందించారు.. హేళన మాటలపై పూర్ణ ఎమోషనల్..!

Big Stories

×