EPAPER

Lok Sabha Elections 2024: ఓటు వేయకుంటే రూ.350 జరిమానా! వాస్తవమెంత?

Lok Sabha Elections 2024: ఓటు వేయకుంటే రూ.350 జరిమానా! వాస్తవమెంత?
election
 

Lok Sabha Elections 2024 Viral News: వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయని వారి బ్యాంకు ఖాతాల నుంచి రూ.350 మినహాయించబడుతుందని ఆ పోస్టలోతెలిపారు. బ్యాంకు ఖాతాల్లో డబ్బు లేని ఓటర్లకు.. మొబైల్ రీఛార్జ్ సమయంలో వారి డబ్బును జరిమాన క్రింద మినహాయించబడుతుందని పోస్ట్‌లో క్లెయిమ్ చేస్తున్నారు. దీనిపై ఎన్నికల సంఘం స్పందించింది.


ఈ వాదన పూర్తిగా అవాస్తవమని, కమిషన్ అలాంటి నిర్ణయం తీసుకోలేదని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఎన్నికల సంఘం తెలిపింది. అదే సమయంలో, భారత ప్రభుత్వ ప్రెస్ ఏజెన్సీ అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) కూడా ఈ దావా నకిలీదని పేర్కొంది. ఇలాంటి తప్పుదోవ పట్టించే వార్తలను షేర్ చేయవద్దని పీఐబీ ప్రజలను కోరింది.

Also Read: ఒక్కసారిగా భారీ కుదుపు.. షాపింగ్ మాల్‌లో భయంకరమైన సీన్


గతేడాది మాదిరిగానే ఈసారి కూడా దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాలకు 7 దశల్లో పోలింగ్‌ జరగనుంది. ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్ జరగనుంది. రెండో దశకు ఏప్రిల్ 26న, మూడో దశకు మే 7న, నాలుగో దశకు మే 13న పోలింగ్ జరగనుంది. కాగా, ఐదో దశకు మే 20న, ఆరో దశకు 25న, ఏడో దశకు జూన్‌ 1న పోలింగ్‌ జరగనుంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4, 2024న ప్రకటించబడతాయి.

Related News

Viral Video: రాత్రిళ్లు ఆటో నడుపుతున్న 55 ఏళ్ల మహిళ కథ వింటే కన్నీరు ఆగదు..

Auto Driver Slap: ఓలా రైడ్ క్యాన్సిల్ చేసిందని యువతిపై దాడి.. వీడియో వైరల్

Viral Video: ఎంత దర్జాగా కూర్చున్నావ్ భయ్యా.. ట్రక్కులో ఈ వ్యక్తి హుందాతనం చూస్తే షాక్ అవుతారు

Viral Video: భోజనం చేసేందుకు రెడీ అయిన కపుల్స్.. ఒక్కసారిగా ఇంట్లోకి దూసుకువచ్చిన కారు

Sweeper Jobs: ఏంటండీ ఈ విడ్డూరం.. రోడ్లూడ్చే పనికి 46 వేల మంది గ్రాడ్యుయేట్ల పోటీ

70 Weds 25: విచిత్ర వివాహం.. 70 ఏళ్ల ముసలాడితో 25 ఏళ్ల యువతి పెళ్లి.. ఎలా కుదిరిందంటే?

Viral Video: మహిళా కస్టమర్ పట్ల దారుణం.. షాపులోనే బట్టలు విప్పించిన సిబ్బంది వీడియో వైరల్

Big Stories

×