EPAPER

Charging: ఫోన్ లేదా ల్యాప్‌టాప్ చార్జింగ్ పెట్టుకోవడానికి పబ్లిక్ పోర్టులు సేఫేనా?

Charging: ఫోన్ లేదా ల్యాప్‌టాప్ చార్జింగ్ పెట్టుకోవడానికి పబ్లిక్ పోర్టులు సేఫేనా?

Power Bank: అనుకోని ప్రయాణాలు చేసినప్పుడో.. ఎమర్జెన్సీ పని మీద వేరే చోటుకు వెళ్లినప్పుడు వెంట చార్జింగ్ కేబుల్ మరిచిపోవడమో.. లేక వెంట తీసుకెళ్లిన పరికరాల్లో
చార్జింగ్ అయిపోవడం సాధారణంగా అందరికీ ఎదురయ్యే అనుభవమే. అప్పుడు మొబైల్ ఫోన్ చార్జింగ్ అయిపోతే.. వేరే వారి చార్జర్ అడిగి.. అందుబాటులో ఉన్న పవర్ పోర్టును
వెతకడమో చేస్తుంటాం. ట్రైన్ జర్నీలో ఉంటే.. రైలులో ఉండే పోర్టుల కోసం.. వెయిట్ చేస్తుంటే రైల్వే స్టేషన్ లేదా.. ఇతర పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు స్టేషన్‌లలో పోర్టుల కోసం చూస్తాం. పవర్ పోర్టు
కనిపిస్తే.. ల్యాప్‌టాప్ చార్జింగ్ కూడా పెట్టేసుకుంటాం. ఇతర పబ్లిక్ స్టేషన్‌లలోనూ ఇలా చేసుకుని అవసరానికి సరిపడా చార్జింగ్ పెట్టుకుని ఇష్యూ క్లియర్ చేసుకుంటాం. కానీ, ఇలా
చేయడం మంచిదేనా? మన ఎలక్ట్రానిక్ డివైజ్‌లు, మన డేటా సురక్షితంగానే ఉంటుందా? ఇది చాలా మందిని తొలిచే ప్రశ్న.


ఇలా పబ్లిక్ పోర్టుల్లో ఎలక్ట్రానిక్ పరికరాలను చార్జ్ చేసుకోవడం ముప్పును కొనితెచ్చుకోవడమేనని, హ్యాకర్లు ఆ డివైజ్‌లోని మీ డేటాను చోరీ చేయవచ్చని ఇది వరకే చాలా చర్చ
జరిగింది. సోషల్ మీడియాలోనూ పోస్టులు పెట్టారు. ఆ పోర్టుల్లో ప్రమాదకర సాఫ్ట్‌వేర్లు ఉండొచ్చని, వాటి ద్వారా సున్నితమైన సమాచారాన్ని ముఖ్యంగా పాస్‌వర్డులు, క్రెడిట్ కార్డు
వివరాలు, పర్సనల్ ఫొటోలు.. ఇలా ఆ చార్జింగ్ పెట్టిన డివైజ్ నుంచి దొంగిలించే ముప్పు ఉంటుంది. అలాగే, మీ ఎలక్ట్రానిక్ డివైజ్‌లను ఇతర చార్జింగ్ కేబుల్‌తో చార్జ్ చేసుకోవడం కూడా
మంచిది కాదు. ఒక వేళ ఆ చార్జింగ్ కేబుల్ అంత నాణ్యమైనది కాకపోతే అది మీ డివైజ్‌ను దెబ్బతీసే ముప్పు ఉంది. అలాగే.. ఆ పబ్లిక్ పోర్టుల్లో అన్‌స్టేబుల్ పవర్ సప్లై గనుక ఉంటే.. అది
మీ డివైజ్‌ను డ్యామేజీ చేస్తుంది. అందుకే వెంట సొంత చార్జింగ్ కేబుల్.. పవర్ బ్యాంక్ తీసుకెళ్లడం బెటర్.

రీసెంట్‌గా ఇదే టాపిక్ మీద రెడ్డిట్‌లో ఓ ఆసక్తికర డిస్కషన్ జరిగింది. ఫోన్‌లకు ఉద్దేశించిన ఓ చార్జింగ్ స్టేషన్‌ ఫొటో తీసి.. ఇక్కడ తన ల్యాప్ టాప్‌ను చార్జ్ చేస్తే ఏమైనా ప్రాబ్లమా?
అంటూ ఓ యూజర్ అడిగాడు. ఎవరైనా ఎలక్ట్రిక్ డిగ్రీ పట్టాదారు వివరించగలరని విజ్ఞప్తి చేశాడు. దీనికి మరో యూజర్ సమాధానం ఇచ్చాడు. ఆ పోర్టు ఓ ట్రైన్‌లోనిది.


Also Read: Telangana Politics: ఉప ఎన్నికలకు సిద్ధమా? : కౌశిక్ రెడ్డి

ఇక్కడ మీ ల్యాప్‌టాప్ చార్జింగ్ పెట్టుకోవడం మంచిది కాదు. అలా చేస్తే ట్రైన్ పేలిపోతుందని చెప్పడం లేదు, కానీ, అలాంటి హై డీసీ కరెంట్ అనేది మీ డివైజ్‌కు మంచిది కాదు.
ల్యాప్‌టాప్‌ను 100 నుంచి 230 వోల్టుల ఏసీ కరెంట్‌తో చార్జింగ్ చేసుకోవాలి. మన ఇంటిలో ఇంతే సప్లై ఉంటుంది. ఒక వేళ అయినా.. మీరు మీ ల్యాప్‌టాప్‌ను అక్కడ చార్జింగ్
పెట్టుకుంటే.. మీ ల్యాప్ టాప్ చార్జింగ్ అడాప్టర్‌కు గుడ్ బై చెప్పాల్సిందే. కొన్ని సార్లు మీ ల్యాప్ టాప్ చార్జర్ కూడా పాడైపోతుంది’ అని వివరించారు. ఈ త్రెడ్‌లో చాలా మంది ఫన్నీ
కామెంట్లు కూడా చేశారు. ఈ కామెంట్‌తో చాలా మంది ఏకీభవించారు. కాబట్టి, పబ్లిక్ పోర్టుల్లో వేరే వారి.. ముఖ్యంగా తక్కువ నాణ్యమైన చార్జింగ్ కేబుల్‌ను ఉపయోగించి చార్జింగ్
పెట్టుకుంటే నష్టాన్ని కొనితెచ్చుకున్నట్టే. కాబట్టి, బీ కేర్ ఫుల్. మీ వెంటే మీ సొంత చార్జర్, పవర్ బ్యాంక్‌ను తీసుకెళ్లండి.

Related News

Viral Video: డాక్టర్‌పై చెప్పులతో దాడి.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..

Shocking Video: సన్యాసిగా మారిన పిల్లిని ఎప్పుడైనా చూశారా..! ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు

Mystery: చావు రహస్యం తేలిపోనుంది.. మరణం తర్వాత మూడో దశ!.. కన్ఫమ్ చేసిన సైంటిస్టులు

Flipkart: స్మార్ట్‌ఫోన్ పై 99 శాతం డిస్కౌంట్.. ఇదెక్కడి మోసమంటూ ఫ్లిప్‌కార్ట్‌పై కస్టమర్ల ఆగ్రహం

Viral Video: నూడుల్స్‌ని ఇష్టంగా లాగించేస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు

Amazon Delivery After 2 Years: రెండేళ్ల క్రితం అమెజాన్ ఆర్డర్ క్యాన్సిల్.. రీఫండ్ పూర్తి.. ఇప్పుడు డెలివరీ!

Viral Video: మీరేంట్రా ఇలా ఉన్నారు.. రూ. 10 జిలేబీ కోసం కొట్టుకుంటారా..

Big Stories

×