EPAPER

Viral: బ్యాంకర్ నుంచి యూట్యూబర్‌గా కెరీర్ షిఫ్ట్.. ఏడాది సంపాదన తెలిస్తే షాకే

Viral: బ్యాంకర్ నుంచి యూట్యూబర్‌గా కెరీర్ షిఫ్ట్.. ఏడాది సంపాదన తెలిస్తే షాకే

Youtuber: పదేళ్లపాటు కార్పొరేట్ ప్రపంచంలో కెరీర్ కొనసాగించింది. వార్షిక వేతనాన్ని లక్షల నుంచి కోట్ల రూపాయాలకు పెంచుకుంది. లండన్‌లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా సెటిలైంది. మీటింగ్‌లు, స్ట్రాటజీలు, పెట్టుబడులపై వ్యూహాలు అన్నింటా మంచి అనుభవంతో ముందుకు దూసుకెళ్లింది. కానీ, మనసులో ఏదో మూలన కొంత అసంతృప్తి. మంచి ఉద్యోగం, ఆశించిన సంపాదన అంతా బాగానే ఉన్నా.. సంతృప్తి మాత్రం దొరకలేదు. అది తనకు అర్థవంతమైన కెరీర్ అనిపించలేదు. ఇతరులకు సహాయపడుతూ సంపాదించాలని అనుకుంది. అంతే.. ఆమె తీసుకున్న నిర్ణయం కుటుంబ సభ్యులనే కాదు.. తోటి ఉద్యోగులనూ షాక్‌కు గురి చేసింది. ఆమె హైపేయింగ్ జాబ్‌ను వదిలిపెట్టి ఖాళీ చేతులతో యూట్యూబ్ చానెల్ ప్రారంభించింది. యూట్యూబర్‌గా కొత్త కెరీర్ మొదలు పెట్టింది. ఆ తర్వాత ఏం జరిగింది?


లండన్‌లో కార్పొరేట్ వరల్డ్‌లో నిషా షా తనదైన ముద్ర వేసుకుంది. క్రెడిట్ అగ్రికోల్‌లో అసోసియేట్ డైరెక్టర్‌గా రాణించింది. యేడాదికి సుమారు రూ. 2 కోట్లు ఆర్జించింది. కానీ, ఆ జాబ్ తనకు చాలెంజింగ్‌గా మెదడకు పదును పెట్టేదిగా అనిపించలేదు. ఈ ఫీల్డ్‌లో తొమ్మిదేళ్ల అనుభవం. ఇవేమీ ఆమె ఆలోచించలేదు. మనసు చెప్పినట్టు విన్నది. జాబ్‌ను వదిలేసింది. ‘ఇతరులకు సహాయం చేస్తూ డబ్బు సంపాదించాలని అనుకున్నా. కానీ, బ్యాంకింగ్‌లో నేను చేసేదల్లా కార్పొరేట్లకు, ప్రభుత్వాలకు పని చేస్తున్నా’ అని సీఎన్‌బీసీకి నిషా చెప్పింది.

2023 జనవరిలో ఆమె తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి పూర్తిస్థాయి యూట్యూబర్‌గా కెరీర్ ప్రారంభించింది. పర్సనల్ ఫైనాన్స్ పై ఫోకస్ పెట్టి వీడియోలు తీసింది. కోర్సులు సేల్ చేసింది, కార్పొరేట్ ముచ్చట్లు, బ్రాండ్‌లతో భాగస్వామ్యం వంటివి రకరకాల పనులు చేసింది. మే 2023 నుంచి మే 2024 మధ్య ఆమె చేసిన పనికి ఫలితం దక్కింది. ఈ ఏడాదిలో ఆమె సుమారు రూ. 8 కోట్లు సంపాదించింది. ‘వాస్తవానికి నేను బ్యాంకింగ్‌లో ఉన్నప్పటి కంటే ఎక్కువ పని చేస్తున్నాను. డబ్బుల వెంబడి పరుగెట్టట్లేదు, నా ప్యాషన్ ఫాలో అవుతున్నా. నాకు ఎందులో నైపుణ్యం ఉన్నదో వాటిని ఎక్స్‌ప్లోర్ చేస్తున్నా. ఇదంతా చాలా ఎంజాయ్ చేస్తున్నా’ అని నిషా చెప్పుకొచ్చింది.


నిషా షా తన యూట్యూబ్ చానెల్ ప్రారంభించినప్పుడు తొమ్మిది నెలలు ఎమర్జెన్సీ ఫండ్‌ను ఏర్పాటు చేసుకుంది. ఇది జీవితంలో ఒకసారి చేసే రిస్క్ అని, ఇది తనకోసం చేసుకుంటున్న రిస్క్ అని భావించినట్టు నిషా చెప్పింది. డబ్బులు సమకూర్చుకున్నాక.. తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని వివరించింది. 11 నెలలు కష్టపడితే వెయ్యి మంది సబ్‌స్క్రైబర్లు వచ్చారని, 2022 సెప్టెంబర్‌లో టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా తన జీవితాన్ని వివరిస్తూ ఓ వీడియో తీసింది. ఇది వైరల్ అయింది. ఆ తర్వాత ఆమె పర్సనల్ ఫైనాన్స్ గురించి చాలా వీడియోలు తీసింది. అవి పది మిలియన్ల నుంచి 9 మిలియన్ల మధ్య వ్యూస్ సంపాదించాయి.

Tags

Related News

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Big Stories

×