EPAPER

Ola Woman Driver: కుటుంబాన్ని పోషించడానికి ఆ పనిచేస్తున్న మహిళ.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజెన్లు!

Ola Woman Driver: కుటుంబాన్ని పోషించడానికి ఆ పనిచేస్తున్న మహిళ.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజెన్లు!

Ola Woman Driver| మీరెప్పుడైనా ఊబర్, ఓలా లాంటి యాప్ ద్వారా క్యాబ్ బుక్ చూస్తే.. సాధారణంగా పురుష డ్రైవర్లనే చూసి ఉంటారు. అలాగని మహిళలు క్యాబ్ డ్రైవర్లుగా ఉండరని కాదు. కానీ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక పోస్టులో ఆ యూజర్ క్యాబ్ నడిపే మహిళ గురించి రాశాడు. ఆ మహిళ జీవితం మనందరికీ ఆదర్శమని చెబుతూ ఆమె కథను వివరించాడు. ఆమె కథ కష్టాల్లో ఉన్న చాలామందికి ప్రేరణ లాంటిదని చెప్పాడు. ఆమె కథ విని మీరు కూడా నిజంగానే ఒక మహిళ ఇంత ధైర్యవంతురాలిగా ఉంటుందా? అని ఒకసారి ఆలోచిస్తారు.


వివరాల్లోకి వెళితే.. ఓజస్ దేశాయ్ అనే ఒక ఫేస్ బుక్ యూజర్ ఇటీవల గుజరాత్ లోని అహ్మదాబాద్ కు వెళ్లాడు. అహ్మదాబాద్ లో రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే ఓజస్ దేశాయ్ ఓలా యాప్ ద్వారా క్యాబ్ బుక్ చేశాడు. ఓజస్ ఫోన్ కి కన్‌ఫర్మేషన్ మెసేజ్ వచ్చింది. అందులో క్యాబ్ డ్రైవర్ పేరు అర్చనా పాటిల్ అని వచ్చింది. అది చూసిన ఓజస్‌కు డ్రైవర్ మహిళనా అనే అనుమానం కలిగింది.

ఇంతలోనే ఓజస్ ఎదురుగా ఒక క్యాబ్ వచ్చి నిలబడింది. అయితే ఆ క్యాబ్ లో ఒక మహిళా డ్రైవర్ ఉంది. ఆమె పేరు అర్చనా పాటిల్. ఓజస్ ని ఆమె చాలా నవ్వుతూ పలకరించింది.ఓజస్ ఆమె కారులో కూర్చొని బయలుదేరాడు. ఓజస్ వెళ్లాల్సిన దారిలో ట్రాఫిక్ విపరీతంగా ఉంది. అయినా అర్చన ఆ ట్రాఫిక్ లో నుంచి కారుని అటూ ఇటూ తిప్పుతూ చాలా ఈజీగా దాటేసింది. అర్చనా డ్రైవింగ్ చూసి ఓజస్ ఆమెను మెచ్చుకున్నాడు. ఒక మహిళ ఇంత అద్భుతంగా కారు నడపడం తను ఎక్కడా చూడలేదని ఓజస్ తన పోస్టులో రాశాడు. ఆ తరువాత మార్గంమధ్యలో అర్చన పాటిల్ తో ఓజస్ సరదాగా మాట కలిపాడు. ఆమె ఎన్నాళ్లుగా డ్రైవింగ్ చేస్తోంది? ఇంత బాగా ఎక్కడ డ్రైవింగ్ నేర్చుకుంది? అని అడిగాడు.


అప్పుడు అర్చన తనకు అసలు సైకిల్ కూడా నడపడం రాదని.. అలాంటిది కేవలం ఆరు నెలల్లో కారు డ్రైవింగ్ నేర్చుకున్నానని తెలిపింది. అది విన్న ఓజస్ ఆశ్చర్యంతో.. ”మీరు ఎందుకు ఈ పని చేయాలనుకున్నారు? సాధారణంగా మహిళలు క్యాబ్ డ్రైవర్ గా చేయరు కదా?” అని ప్రశ్నించాడు.

దానికి సమాధానంగా అర్చనా పాటిల్ చెబుతూ.. ”సార్ ఈ కారు నా భర్తది. పెద్ద లోన్ తీసుకొని కొన్నాము. ప్రతినెలా లోన్ ఈఎంఐ చెల్లించాలి. కానీ నా భర్తకు ఒక్కసారిగా ఆరోగ్య సమస్యలు వచ్చాయి. నాకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నేను ఇంట్లో పనిమనిషి ఉద్యోగం చేస్తుంటాను. అయితే నా భర్త ఆరోగ్యం బాగోలేక.. ఆయన క్యాబ్ నడపలేకపోయేవాడు. దీంతో ప్రతినెలా క్యాబ్ లోన్ చెల్లించాల్సి ఉంది. నా సంపాదన ఏ మాత్రం సరిపోయేది కాదు. అందుకే నేను ఒకటి నిర్ణయించుకున్నాను.

నాకు వచ్చిన కష్టాలు తీరాలంటే ఒక్కటే మార్గం.. నేనే క్యాబ్ నడపాలి అని అర్థమైంది. అందుకే వెంటనే కారు డ్రైవింగ్ చేయడం నేర్చుకునేందుకు.. డ్రైవింగ్ స్కూల్ వెళ్లాను.. చాలా కష్టాలు పడి ఆరు నెలల్లో కారు నడపడం నేర్చుకొన లైసెన్స్ సంపాదించాను. ఇప్పుడు నేను రోజుకు 12 నుంచి 14 గంటలు క్యాబ్ నడుపుతాను. ఆ తరువాత రెండు ఇళ్లలో పనిమనిషిగా చేస్తున్నాను.” అని తన జీవితం గురించి చెప్పింది.

అర్చనా పాటిల్ చెప్పింది విని ఓజస్ విస్తుపోయాడు. ప్రపంచంలో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? అని ఆశ్చర్యపోయాడు. తన వీడియోలో అర్చనా పాటిల్‌పై ప్రశంసలు కురిపిస్తూ మాట్లాడాడు. ఇప్పుడు ఓజస్ వీడియోకు బాగా లైక్స్ వస్తున్నాయి. కేవలం నాలుగు రోజుల్లోనే 20k లైక్స్ వచ్చాయి. చాలా మంది అర్చనా పాటిల్ ని మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read:  610 కేజీల బరువుతో చనిపోతాడనుకున్న బాలుడు బతికాడు.. అంతా ‘రాజు’గారి దయ..

”జీవితంలో కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించే వారందరినీ గౌరవభావంతో చూడాలి. అంతేకాని ఇతరుల వద్ద అడుక్కొని, అప్పులు చేసే వారిని కాదు.” అని ఒక యూజర్ రాశాడు. ఇంకొక యూజర్ అయితే.. ”జీవితంలో అన్ని కష్టాలున్నా.. ఆమె ఎలా నవ్వుతూ పనిచేసుకుంటోందో” అని కామెంట్ చేశాడు.

Also Read:  ‘నా ఇష్టం మీకేంటి?’.. 16 ఏళ్ల అబ్బాయిని డేట్ చేస్తున్న 21 ఏళ్ల భామ..

ఇంకో యూజర్.. “కష్టాల్లో ఉన్న ప్రతిఒక్కరూ అర్చనా పాటిల్ ని ఆదర్శంగా తీసుకొని జీవితంలో శ్రమించాలి. కష్టాలతో పోరాడాలి. ధైర్యంగా ముందడుగు వేస్తే కష్టాలు వెనుకడుగు వేస్తాయి.” అని రాశాడు.

Also Read:  వెబ్ సిరీస్ చూసి బాలుడి మర్డర్.. ప్రేమ కోసం హంతకురాలిగా మారిన ఎంబిబియస్ విద్యార్థిని

Related News

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Jani Master : కేసులో మరో ట్విస్ట్.. కూపీ లాగనున్న మహిళా కొరియోగ్రాఫర్..!

Bigg Boss 8 Day 18 Promo: హౌస్ లో పెద్ద డ్రామా నడుస్తోందే.. సోనియా కి ఝలక్ ఇచ్చిన నబీల్..!

Heroine Poorna: తల్లిని నిందించారు.. హేళన మాటలపై పూర్ణ ఎమోషనల్..!

NaniOdela2: ఫ్యాన్స్ గెట్ రెడీ.. మాస్ జాతరకు సిద్ధం కండమ్మా..!

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×