EPAPER

Rs. 5000 for Reels on Animals: జంతువులపై రీల్స్ చేయండి.. రూ. 5,000 బహుమతి పొందండి!

Rs. 5000 for Reels on Animals: జంతువులపై రీల్స్ చేయండి.. రూ. 5,000 బహుమతి పొందండి!
Instagram Reels
Instagram Reels on Animals

Get Rs 5,000 to Make Instagram Reels on Animals in UP: ప్రస్తుతం సోషల్ మీడియా మేనియా నడుస్తోంది. ప్రపంచానికి మనం తెలియాలంటే అందరిలో తిరుగాలి అనేది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు ఫోన్ ఉండి అందులో ఒక సోషల్ మీడియా అకౌంట్ ఉంటే చాలు. ప్రపంచం మొత్తానికి మనం ఏంటో తెలిసేలా చేయొచ్చు. ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్, మోజో, స్నాప్ చాట్, టెలిగ్రామ్, థ్రెడ్స్, వంటి ఎన్నో సోషల్ మీడియా యాప్ లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఫేమస్ అవ్వడానికి మన టాలెంట్ చూపిస్తూ ఒక్క వీడియో పెడితే చాలు సోషల్ మీడియానే మనల్సి ఫేమస్ చేస్తుంది. ముఖ్యంగా యువత సంపాదించాలన్నా.. సోషల్ మీడియానే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ తరుణంలోనే ప్రభుత్వాలు కూడా సోషల్ మీడియాను వాడేస్తున్నాయి. ప్రజలను ఆకర్షించేందుకు వినూత్న దారులు ఎంచుకుంటున్నాయి. ఈ క్రమంలో వారి పద్ధతిలోనే ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా అన్ని ప్రకటనలను ఇస్తున్నాయి.


ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కాన్పూర్‌లో ఉన్న పురాతన జులాజికల్ పార్కు అధికారులు ఆసక్తికర ప్రకటన చేశారు. జంతువులపై ప్రజలకు ఆదరణ పెంచాలని నిర్ణయించుకున్నారు. వన్య ప్రాణులను రక్షించడం, వాటి రక్షణకు సహకరించడం వంటి చర్యల కోసం పార్కు అధికారులు సోషల్ మీడియా యూజర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. పార్కుకు పర్యాటకుల సంఖ్య పెరగాలని, పర్యాటక ప్రాంతాలను మరింత ప్రోత్సహించాలని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఫ్రీగా కాన్పూర్ పార్కును సందర్శించే అవకాశం కల్పించారు.

పార్కులకు ఆదరణ పెరగాలని, జంతువులపై ప్రజలు మమకారంగా ఉండాలని కోరుతూ ఓ ఆఫర్ ఇచ్చారు. పార్కులోని జంతువులపై స్పెషల్ రీల్స్ చేయాలని కోరారు. అంతేకాదు రీల్స్ చేసిన వారికి ఓ బహుమతిని కూడా ఇస్తామని ప్రకటించారు. రీల్స్ చేసిన వారిలో అత్యధిక వ్యూస్ వచ్చిన వారికి వివిధ బహుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ రీల్స్ లో అత్యధిక వ్యూస్ వచ్చిన వారికి రూ. 5,000 బహుమతి, ఆ తరువాత సెకండ్ వచ్చిన వారికి రూ. 3,000 నగదు బహుమతిని ప్రకటించారు.


Also Read: తెలివైనా కోడలు.. ఒకేసారి ఏకంగా నాలుగు చేసింది.. వీడియో వైరల్

ఈ కార్యక్రమానికి ఓ టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. కాన్పూర్ దర్శన్ పేరుతో ఈ ప్రోగ్రాం చేస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో డాక్టర్ షెఫీలీ రాజ్ మీడియాతో మాట్లాడారు. ఈ ప్రోగ్రాం ఉద్దేశ్యాన్ని ఆయన వివరించారు. దేశ వ్యాప్తంగా కాన్పూర్ జూ పార్క్ గురించి తెలియాలని, దేశ నలుమూలల నుంచి ప్రజలు కాన్పూర్ జూకు తరలి రావాలనేదే తమ ఉద్దేశ్యం అని అన్నారు. అందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.

Tags

Related News

Viral Video: మీరేంట్రా ఇలా ఉన్నారు.. రూ. 10 జిలేబీ కోసం కొట్టుకుంటారా..

Urination: మూత్ర విసర్జన తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..

Viral News: సమస్యపై స్పందించట్లేదని ఓలాపై యువతి వినూత్న నిరసన…

World’s Richest Dog: సింహాసనంపై శునకం.. రూ.3300 కోట్ల ఆస్తికి అధిపతి ఈ కుక్క.. ప్రైవేట్ ప్లేన్, బిఎండబ్ల్యూ కారు ఇంకా ఎన్నో..

Man Extracts 23 Teeth: ఒకేరోజు 23 పళ్లు తీయించుకున్నాడు.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు..!

Viral Video: వెర్రి వేశాలు కాకపోతే.. అసలు బైక్‌తో రైలు ఇంజిన్ ను లాగొచ్చా..

Shocking Video: ఎంతటి అద్భుతం.. గణేషుడికి నమస్కరించి మోదకం తీసుకున్న చిట్టెలుక..

Big Stories

×