EPAPER

Pregnant Woman Cleaning: ‘చనిపోయిన నీ భర్త రక్తం అది.. నీవే శుభ్రం చేయాలి’.. దళిత గర్భవతికి ఆస్పత్రిలో అవమానం

Pregnant Woman Cleaning: ‘చనిపోయిన నీ భర్త రక్తం అది.. నీవే శుభ్రం చేయాలి’.. దళిత గర్భవతికి ఆస్పత్రిలో అవమానం

Pregnant Woman Cleaning| మనదేశంలో ఇంకా కులం పేరుతో అవమానాలు, అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి. మనిషి మేధస్సుని మించిపోయే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఉండే ఈ యుగంలో కూడా ఇంకా రాతి యుగం మూఢనమ్మకాలదే కొన్ని చోట్ల పై చేయి. సాటి మనిషిపై జాలి కనికరం కంటే తక్కువ కులం, జాత్యాహంకారం భావనలు ప్రాధాన్యం ఇచ్చే మనుషులు మన సమాజంలో ఇంకా ఉన్నారు. భర్త చనిపోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న ఒక ఆదివాసీ మహిళ, అది కూడా గర్భవతి చేత ఆస్పత్రి సిబ్బంది పనిచేయించింది. కేవలం ఆమె ఆదివాసీ అని.. తక్కువ జాతి అని అలా చేసింది. ఈ ఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. ఇంటర్నెట్ లో ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో ఒక మహిళను ఆస్పత్రిలో పనిచేసే నర్సు.. పేషెంట్ ని పడుకోబెట్టే స్ట్రెచర్ ని శుభ్రం చేయమని ఆదేశిస్తోంది. ఆ నర్సు చెప్పినట్లు ఆ మహిళ ఒక వస్త్రంతో ఆ స్ట్రెచర్ ని శుభ్రం చేస్తోంది. అయినా ఆ నర్సు బాగా శుభ్రం చేయి.. ఎక్కడా కొంచెం కూడా రక్తపు మరకలు ఉండకూడదు. చనిపోయిన నీ భర్త రక్తం అది.. నీవే శుభ్రం చేయాలని చెబుతున్నట్లు వినిపిస్తోంది. ఈ వైరల్ వీడియోని చూసిన నెటిజెన్లు మండిపడుతున్నారు. ఆస్పత్రిలో ఇంత అమానుషమా అని ఆశ్చర్యపోతున్నారు. ఇంకా బాధాకరమైన విషయమేమిటంటే ఆ మహిళ ఒక గర్భవతి.. ఆమె అయిదు నెలల గర్భంతో ఉంది. ఇలాంటి స్థితిలో ఉన్న మహిళ.. పైగా ఆమె భర్త అప్పుడే మరణించాడు. అయినా వారు ఆదివాసీలని చులకన భావంతో ఆ ఆస్పత్రి సిబ్బంది ప్రవర్తించింది.

Also Read: భార్యాబాధితుడు.. పిల్లలతో సహా ఆత్మహత్య.. ఏడుస్తూ వీడియో


భర్తపోయిన దు:ఖంలో దీనస్థితిలో ఉన్న ఆ మహిళను మనిషి పుట్టుక పుట్టిన వారెవరికైనా జాలి వేస్తుంది. ఆమెను దయా భావంతో సానుభూతి చూపించాలి. కానీ అందుకు భిన్నంగా ఆమె చేత ఆస్పత్రి శుభ్రం చేయిస్తున్నారు.

హత్యకు గురైన భర్త
ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు విచారణ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్ లోని దిన్‌డోరి జిల్లాకు చెందిన లాల్ పూర్ గ్రామానికి చెందిన శివరాజ్, అతని ఇద్దరు సోదరులు, అతని తండ్రిని కొందరు భూ వివాదంలో దాడి చేశారు. ఆ దాడిలో శివరాజ్ తండ్రి, ఒక సోదరుడు అక్కడే మరణించాడు. శివరాజ్, అతని మరో సోదరుడు రామ్ రాజ్ కు తీవ్ర గాయాలు కావడంతో గ్రామానికి సమీపంలో ఉన్న గడసరాయి ఆరోగ్య కేంద్రానికి శివరాజ్ కుటుంబం తీసుకువచ్చింది.

అయితే ఆరోగ్య కేంద్రంలో శివరాజ్ చికిత్స పొందుతూ మరణించాడు. శివరాజ్ చనిపోవడంతో అతని భార్య, పిల్లలు పట్టరాని దు:ఖంలో మునిగిపోయారు. అయితే గడసరాయి పోలీసులు శివరాజ్ మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం తీసుకెళ్లారు. ఆ తరువాత శివరాజ్ భార్య కూడా అక్కడి నుంచి వెళ్లిపోతుండగా.. ఆస్పత్రి నర్సు ఆమెను ఆపేసింది. చనిపోయిన శివరాజ్ ఒక ఆదివాసి, దళితుడు దీంతో ఆ తక్కువ కులం వ్యక్తి రక్తం ఉన్న స్ట్రెచర్ ని అతని భార్యే శుభ్రం చేయాలని చెప్పింది.

ఇది విన్న శివరాజ్ భార్య తాను గర్భవతి అని చెప్పింది. కానీ ఆ నర్సు మాత్రం కేవలం వస్త్రం తీసుకొని స్ట్రెచర్ తుడవడంతో ఏమీ కాదని.. శుభ్రం చేసి వెళ్లాలని అడిగింది. దీంతో అవమానాలకు అలవాటు పడ్డ ఆ ఆదివాసీ మహిళ నర్సు చెప్పినట్లు తన భర్త ప్రాణాలు వదిలిన ఆ స్ట్రెచర్ ని శుభ్రం చేసింది. అయితే ఇదంతా జరుగుతుండగా.. అక్కడ పక్కనే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో ఆ వీడియో వైరల్ అయిపోయింది.

వీడియోపై స్పందిస్తూ.. పోలీసులు ఆస్పత్రిలో విచారణ చేయగా.. ఆస్పత్రి యజమాన్యం తమవరకు ఎటువంటి ఫిర్యాదులు రాలేదని.. ఒకవేళ ఆ ఆదివాసీ మహిళ తమకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Related News

Viral Video: రెండు బెర్తుల నడుమ స్పెషల్ సీట్, ఎలా వస్తాయ్ బ్రో ఇలాంటి ఐడియాలు!

Air Hostess Earnings: ఏడాది సంపాదన ఒక్కనెలలోనే.. అందాలతో వ్యాపారం చేసే ఎయిర్ హోస్టెస్!

Optical Illusion: వస్తువులన్నీ చిందర వందరగా ఉన్న ఈ గదిలో 3 చిప్స్ ప్యాకెట్స్ ఉన్నాయి.. కనుక్కోండి చూద్దాం!

Viral Video: రైలు కింద పడి రెండు ముక్కలైన యువకుడు, బంగ్లాదేశ్ లో ఘోరం

Viral video: బాబూ! అది స్లీపర్ బెర్త్ కాదు, మెట్రో రైల్- మరీ అలా పడుకుంటే ఎలా?

Kurnool: క‌ర్నూలులో వింత ఆచారం..కానీ పాటిస్తే ఆ స‌మ‌స్య‌లు దూరం!

Big Stories

×