EPAPER

Reopen closed theater: మూతబడిన థియేటర్‌ని మల్టీఫ్లెక్స్ థియేటర్‌గా మార్చనున్న హీరో

Reopen closed theater: మూతబడిన థియేటర్‌ని మల్టీఫ్లెక్స్ థియేటర్‌గా మార్చనున్న హీరో

Hero to reopen closed theater


Hero is going to convert a closed theater into a multiplex theater: కొన్నేళ్ల ముందు వరకు అంటే.. కరోనా రాకముందు తమ అభిమాన నటుడి సినిమాలు చూడాలంటే ఎవరైనా సరే ఖచ్చితంగా థియేటర్లకు వెళ్లి చూడాల్సిన పరిస్థితి. అవి కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్లే. ఇక మల్టీప్లెక్స్‌ థియేటర్లు అంటే పెద్ద పెద్ద మెట్రో నగరాల్లో మాత్రమే ఉండేవి అప్పట్లో. ఇక హైదరాబాద్ విషయానికొస్తే..ట్యాంక్‌ బండ్ దగ్గరలోని ప్రసాద్ ఐమ్యాక్స్ థియేటర్ ఉండేది. అదొక్కటే మూడు పువ్వులు, ఆరుకాయల్లాగా అప్పట్లో ఆడియెన్స్‌తో కళకళలాడేది.

ఎందుకంటే అందులోనే అన్నిరకాల వస్తువులు, పిల్లల కోసం గేమింగ్, షాపింగ్‌ చేయడానికి షాపింగ్ మాళ్లు ఉండేవి కాబట్టి. అందులో ఏసీ, రెండు మూడు తెరలు ఉండే సరికి వాటిని చూడటానికే ప్రేక్షకులు ఎక్కువ సంఖ్యలో ఇంట్రెస్ట్‌ చూపించేవారు.దీంతో సింగిల్ థియేటర్ల యజమానులు కూడా తమ థియేటర్లను మల్టీప్లెక్స్‌ థియేటర్లుగా మార్చుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లోనూ మల్టీప్లెక్స్‌ థియేటర్లు అక్కడక్కడ ముఖ్యమైన కూడలిలో వెలుస్తున్నాయి.


Read More:ఇంత చిన్న వయసులో పెళ్లి ఏంట్రా..? వైరల్ అవుతున్న వీడియో

మల్టీప్లెక్స్‌లు ఎక్కువ అయిన తరువాత మెయింటైన్స్‌లు తట్టుకోలేక చాలా సింగిల్‌ తెర థియేటర్లు మూతపడ్డాయి. కొన్ని రైస్ మిల్లులకు అప్పగించారు. మరికొన్ని అలాగే మూతపడిపోయి నిర్మానుష్యంగా తయారయ్యాయి. అయితే తాజాగా సూపర్‌స్టార్ మహేశ్‌బాబు మూతపడిన ఓ థియేటర్‌ని మళ్లీ తెరవనున్నాడని..దానిని మల్టీప్లెక్స్‌ థియేటర్‌గా చేస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయమై ఆయన ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. త్వరలో దీనిపై క్లారిటీ ఇస్తాడని అందరూ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

ఇక హైదరాబాద్‌ మహానగరం విషయానికి వస్తే దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రతి శుక్రవారం వచ్చిందంటే చాలు ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సినీ అభిమానులకు పండగనే చెప్పాలి. అక్కడ ఉన్న దేవి, సుదర్శన్‌, సంధ్య థియేటర్స్‌ అయితే హీరోల కటౌట్‌ లు, బ్యానర్లు, పూలదండలతో ఖాళీ లేకుండా రోడ్లన్నీ సందడిగా ఉంటాయి. అలాంటి ఆ ఏరియాలో చాలాకాలంగా మూతపడిన ఓ థియేటర్‌ను మహేష్‌ బాబు మల్టీప్లెక్స్‌ థియేటర్‌గా మార్చాలని చూస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది.

Read More:ఇండిగో ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ లో బొద్దింకలు వీడియో వైరల్

దీంతో ఈ విషయం తెలుసుకున్న మహేశ్ అభిమానులకు పండగే అయింది. ఈ ప్రాంతంలో గతంలో సుదర్శన్‌ 70 ఎంఎం థియేటర్ ఒకటి ఉండేది. దానిని 2010లో మూసివేశారు. ఇప్పుడు ఆ థియేటర్‌ను మహేష్‌ లీజుకు తీసుకుని దానిని ఏషియన్‌ సినిమాస్‌తో కలిసి ఏఎంబీ క్లాసిక్‌ అనే కొత్త పేరుతో 7 స్క్రీన్లు ఉండే విధంగా ఓ పెద్ద మల్లీప్లెక్స్‌ కట్టబోతున్నారని సమాచారం. అయితే ఇదే విషయంపై మహేష్‌ మాత్రం ఇంకా ఏ విషయం క్లారిటీ ఇవ్వలేదు. దీని గురించి పూర్తి సమాచారం రావాలంటే మాత్రం ఇంకా కొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే అంటున్నాయి సినీవర్గాలు.

Tags

Related News

Viral Video: మీరేంట్రా ఇలా ఉన్నారు.. రూ. 10 జిలేబీ కోసం కొట్టుకుంటారా..

Urination: మూత్ర విసర్జన తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..

Viral News: సమస్యపై స్పందించట్లేదని ఓలాపై యువతి వినూత్న నిరసన…

World’s Richest Dog: సింహాసనంపై శునకం.. రూ.3300 కోట్ల ఆస్తికి అధిపతి ఈ కుక్క.. ప్రైవేట్ ప్లేన్, బిఎండబ్ల్యూ కారు ఇంకా ఎన్నో..

Man Extracts 23 Teeth: ఒకేరోజు 23 పళ్లు తీయించుకున్నాడు.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు..!

Viral Video: వెర్రి వేశాలు కాకపోతే.. అసలు బైక్‌తో రైలు ఇంజిన్ ను లాగొచ్చా..

Shocking Video: ఎంతటి అద్భుతం.. గణేషుడికి నమస్కరించి మోదకం తీసుకున్న చిట్టెలుక..

Big Stories

×