EPAPER

Viral Video: దారుణం.. రీల్స్ పిచ్చితో ఏనుగు చేతిలో ప్రాణాలు కోల్పోయాడు

Viral Video: దారుణం.. రీల్స్ పిచ్చితో ఏనుగు చేతిలో ప్రాణాలు కోల్పోయాడు

Viral Video: పెంపుడు జంతువులతో ఆటలు ఆడినా, వాటిపై ప్రేమ చూపించినా కూడా అవి మనపై తిరిగి ప్రేమను చూపిస్తాయి. అయితే సాధారణంగా అడవిలో ఉండే జంతువులు మాత్రం మనుషులను చూడగానే భయపడి పారిపోవడం లేక దాడి చేయడం వంటివి చేస్తుంటాయి. ముఖ్యంగా అడవిలో ఏనుగులు అయితే వాటికి కోపం తెప్పిస్తే ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తాయి. మనుషులపైకి కోపంతో ఘీంకారాలు చేస్తూ దూసుకువస్తాయి. అయితే తాజాగా ఓ ఏనుగుతో ఆటలాడాలని ప్రయత్నించిన ఓ వ్యక్తిని దారుణంగా తొక్కి చంపేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో చోటుచేసుకుంది. అడవి నుంచి ఓ ఏనుగు గ్రామాల్లోకి ప్రవేశించింది. ఉదయం వేళ హబీబావాలా గ్రామంలోకి దూసుకువచ్చింది. దీంతో ఒక్కసారిగా గ్రామస్తులు ఏనుగులను చూసేందుకు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ తరుణంలో ఓ 30 సంవత్సరాల ముర్సాలీన్ అనే యువకుడు రీల్స్ పిచ్చితో ఏనుగుతోనే ఆటలాడేందుకు ప్రయత్నించాడు. ఏనుగును భయపెట్టాలని చూసిన తరుణంలో అది ఒక్కసారిగా అతడిపైకి దూసుకెళ్లింది. ఎంత దూరం పరుగులు తీసినా కూడా వెంటాడింది. ఈ తరుణంలో జనాలు కూడా పరుగులు తీశారు. ముర్సాలీన్ ను ఏనుగు తొక్కి చంపింది. తొండంతో ఏకంగా 25 అడుగుల ఎత్తుకు విసిరిపారేసింది.

ఏనుగు దాడిలో ముర్సాలీన్ తీవ్రంగా గాయాలపాలయ్యాడు. దీంతో ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రీల్స్ పిచ్చితో ఏనుగుతో ఆటలాడితే ఇలాగే ఉంటుంది అని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.


Related News

Viral Video: ఇంత కక్కుర్తిలో ఉన్నావేంట్రా.. నేలపై పారుతున్న మద్యాన్ని ఎలా తాగేశాడో చూడండి

Viral Video: డాక్టర్‌పై చెప్పులతో దాడి.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..

Shocking Video: సన్యాసిగా మారిన పిల్లిని ఎప్పుడైనా చూశారా..! ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు

Mystery: చావు రహస్యం తేలిపోనుంది.. మరణం తర్వాత మూడో దశ!.. కన్ఫమ్ చేసిన సైంటిస్టులు

Flipkart: స్మార్ట్‌ఫోన్ పై 99 శాతం డిస్కౌంట్.. ఇదెక్కడి మోసమంటూ ఫ్లిప్‌కార్ట్‌పై కస్టమర్ల ఆగ్రహం

Viral Video: నూడుల్స్‌ని ఇష్టంగా లాగించేస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు

Amazon Delivery After 2 Years: రెండేళ్ల క్రితం అమెజాన్ ఆర్డర్ క్యాన్సిల్.. రీఫండ్ పూర్తి.. ఇప్పుడు డెలివరీ!

Big Stories

×