EPAPER

Ganesh Chaturthi Laddoo: 500 కేజీల భారీ లడ్డూపై వినాయకుడు.. ఎక్కడ తయారు చేశారంటే..

Ganesh Chaturthi Laddoo: 500 కేజీల భారీ లడ్డూపై వినాయకుడు.. ఎక్కడ తయారు చేశారంటే..

Ganesh Chaturthi Laddoo| భారతీయ పండుగలలో వినాయక చవితికి ప్రత్యేక స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా ఈ పండుగను చాలా గ్రాండ్ గా చేసుకుంటారు. పైగా వినాయక విగ్రహాల విషయంలో పోటీ పడి మరీ భారీ ఆకారంలో ఉండే విగ్రహాలను ప్రతిష్టిస్తారు. సెప్టెంబర్ 7న వినాయక చవితి ఉత్సవాలు మొదలయ్యాయి. చవితి ఉత్సవాల కోసం అందరి ఆరాధ్య దైవం శ్రీ గణేశుడికి సమర్పించడానికి వెరైటీ స్వీట్లు తయారు చేస్తుంటారు. ముఖ్యంగా ఉత్తర భారత దేశంలోని గణేవ్ చతుర్థి సంబరాలు ఆకాశాన్ని మిన్నంటుతాయి.


చవితి ఉత్సవాల కోసం దక్షిణ భారత దేశంలో ఉండ్రాళ్లు ప్రత్యేకమైతే.. ఉత్తరాదిన మోదక్ స్వీట్ స్పెషల్. భక్తులందరికీ లడ్డూలు కూడా ప్రసాదంగా ఇస్తారు. చాలా చోట్ల భారీ లడ్డూలను తయారు చేసి వాటిని వేలం వేస్తారు. ఆ శ్రీ గణేశుని పరమ భక్తులు తమ భక్తిని చాటుకోవడానికి వేలంలో పెద్ద మొత్తం వెచ్చించి ఈ లడ్డూలను కొనుగోలు చేస్తారు.

అయితే ఉత్తర భారతదేశంలో కేవలం ఆ ఏకదంతుడి పట్ల తమ భక్తిని చాటుకోవడానికి ప్రత్యేక లడ్డూలు తయారు చేసి ఉత్సవం జరిగే రోజుల్లో ప్రత్యేక ఆకర్షణగా పెడుతుంటారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వినాయక చవితికి స్పెషల్ గా ఒక స్వీట్ షాపు ఓనర్ ఏకంగా 500 కేజీల లడ్డూని తయారు చేయించారు. ఈ లడ్డూకి అందంగా డెకరేట్ చేయడానికి భారీగా ఖర్చు కూడా చేశారు. 500 కేజీల భారీ లడ్డూ అది కూడా చాలా అందంగా తయారు చేయడంతో దాని వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.


పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలోని భవానీపూర్ ప్రాంతంలో ప్రియాంక మలిక్ అనే స్వీట్ షాపు ఓనర్ శ్రీ గణేశుడికి పరమ భక్తురాలు. అందుకే వినాయక చవితి స్పెషల్ తన షాపులో 500 కేజీల భారీ లడ్డూ తయారు చేయించి దానిపై బుల్లి గణేశుడి విగ్రహం పెట్టారు. లడ్డూను అలకరించేందుకు జీడి పప్పు, బాదం లాంటి డ్రై ఫ్రూట్స్ తో లడ్డూ చుట్టూ ఒక రింగ్ తయారు చేశారు. లడ్డుపై భాగంలో కాజు కత్లీ అనే మరో తీపి పదార్థంతో డెకరేట్ చేశారు.

Also Read: విచిత్ర వివాహం.. 70 ఏళ్ల ముసలాడితో 25 ఏళ్ల యువతి పెళ్లి.. ఎలా కుదిరిందంటే?

ఈ స్పెషల్ లడ్డూ గురించి ప్రియాంక మలిక్ మాట్లాడుతూ.. ” మా స్వీట్ షాపు 140 ఏళ్లు నుంచి ఈ ప్రాంతంలో ఉంది. గణేశ్ చతుర్థి శుభ సందర్భంగా ఏదైనా కొత్తగా తయారు చేయాలని భావించాను. పండుగకు ఆ విఘ్నేశ్వరుడికి సమర్పించేందుకు భక్తితో తయారు చేయించాను” అని చెప్పారు.

మరోవైపు ప్రతీ సంవత్సరం వినాయక చవితికి గుజరాత్ రాష్ట్రంలోని జామ్ నగర్ ప్రాంతంలో ‘లడ్డూ ఈటింగ్’ పోటీలు నిర్వహిస్తారు. ఓపెన్ సౌరాష్ట్ర లడ్డూ కాంపిటీషన్ పేరుతో నిర్వహించే ఈ పోటీల్లో శుద్ధమైన నేయి, పాలతో తయారు చేసిన 100 గ్రాముల లడ్డూలు తయారు చేస్తారు. ఈ పోటీల్లో ఈ సంవత్సరం 49 మంది పాల్గొన్నారని.. 33 మంది పురుషులు, 6 మంది మహిళలు, 10 మంది పిల్లలు వేగంగా అత్యధిక లడ్డూలు తినేందుకు పోటీ పడ్డారని నిర్వహకులు తెలిపారు.

Related News

Viral Video: డాక్టర్‌పై చెప్పులతో దాడి.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..

Shocking Video: సన్యాసిగా మారిన పిల్లిని ఎప్పుడైనా చూశారా..! ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు

Mystery: చావు రహస్యం తేలిపోనుంది.. మరణం తర్వాత మూడో దశ!.. కన్ఫమ్ చేసిన సైంటిస్టులు

Flipkart: స్మార్ట్‌ఫోన్ పై 99 శాతం డిస్కౌంట్.. ఇదెక్కడి మోసమంటూ ఫ్లిప్‌కార్ట్‌పై కస్టమర్ల ఆగ్రహం

Viral Video: నూడుల్స్‌ని ఇష్టంగా లాగించేస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు

Amazon Delivery After 2 Years: రెండేళ్ల క్రితం అమెజాన్ ఆర్డర్ క్యాన్సిల్.. రీఫండ్ పూర్తి.. ఇప్పుడు డెలివరీ!

Viral Video: మీరేంట్రా ఇలా ఉన్నారు.. రూ. 10 జిలేబీ కోసం కొట్టుకుంటారా..

Big Stories

×