EPAPER

Fungus in beer bottle: బీర్ బాటిల్‌లో ఫంగస్.. వీడియో వైరల్

Fungus in beer bottle: బీర్ బాటిల్‌లో ఫంగస్.. వీడియో వైరల్

Fungus in Beer Bottle in Hanumakonda: హనుమకొండలో బీర్ బాటిల్‌లో ఫంగస్ కలకలం రేపుతోంది. జిల్లా కేంద్రంలోని ఓ వైన్స్ షాప్ వద్ద ఓ కస్టమర్ బీర్ బాటిల్ కొనుగోలు చేశాడు. అయితే ఈ బీర్ బాటిల్‌లో ఫంగస్ కనిపించింది. దీంతో అతడు ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. గత కొంతకాలంగా ఇదే వైన్స్ షాపు నుంచి బీర్లు కొనుగోలు చేసుకొని తాగుతున్నట్లు ఆ వినియోగదారుడు వాపోయాడు. ప్రస్తుతం దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.


వెంటనే అదే వైన్స్ షాపు దగ్గరకు వెళ్లి అడగగా..నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంత ఆ కస్టమర్ వైన్స్ షాప్ ఎదుట ఆందోళనకు దిగాడు. అక్కడ కాసేపు గందరగోళం నెలకొంది. ఆయనకు మద్దతుగా పలువురు వినియోగదారులు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అయితే సోషల్ మీడియాలో వైరలవుతున్న వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

బీర్ బాటిల్‌లో ఫంగస్ కనిపించడంతో అక్కడ ఉన్న కస్టమర్స్ షాపు నిర్వాహకులిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. ఇష్టానుసారంగా బీర్ తయారీదారులు వ్యవహరించడంతోనే ఇలా జరుగుతోందని వాపోతున్నారు.


Also Read: పాన్ దోశ అంట ఎప్పుడైనా తిన్నారా.. చూడండి ఎలా తయారు చేశాడో

గతంలో కూడా ఇలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయని చెప్పారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బీర్ తయారీ కేంద్రాలను సీజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గత కొంతకాలంగా ఇదే వైన్స్ షాపు నుంచి కొనుగోలు చేసిన కస్టమర్స్ ఆందోళన చెందుతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శలు చేస్తున్నారు.

Related News

Viral Video: డాక్టర్‌పై చెప్పులతో దాడి.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..

Shocking Video: సన్యాసిగా మారిన పిల్లిని ఎప్పుడైనా చూశారా..! ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు

Mystery: చావు రహస్యం తేలిపోనుంది.. మరణం తర్వాత మూడో దశ!.. కన్ఫమ్ చేసిన సైంటిస్టులు

Flipkart: స్మార్ట్‌ఫోన్ పై 99 శాతం డిస్కౌంట్.. ఇదెక్కడి మోసమంటూ ఫ్లిప్‌కార్ట్‌పై కస్టమర్ల ఆగ్రహం

Viral Video: నూడుల్స్‌ని ఇష్టంగా లాగించేస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు

Amazon Delivery After 2 Years: రెండేళ్ల క్రితం అమెజాన్ ఆర్డర్ క్యాన్సిల్.. రీఫండ్ పూర్తి.. ఇప్పుడు డెలివరీ!

Viral Video: మీరేంట్రా ఇలా ఉన్నారు.. రూ. 10 జిలేబీ కోసం కొట్టుకుంటారా..

Big Stories

×