EPAPER
Kirrak Couples Episode 1

Employee Fired For Not bring Food For Boss: టిఫిన్ తీసుకురాలేదని ఉద్యోగిని తొలగించిన బాస్.. ఆ తరువాత..

Employee Fired For Not bring Food For Boss: టిఫిన్ తీసుకురాలేదని ఉద్యోగిని తొలగించిన బాస్.. ఆ తరువాత..

Employee Fired For Not bring food for Boss| ఆఫీసులో ఉద్యోగులు వేధింపులు ఎదుర్కోవడం గురించి అప్పుడప్పుడూ వార్తల్లో చదువుతూనే ఉంటాం. మహిళలైతే లైంగిక వేధింపులకు గురైన సందర్భాలు అనేకం. కానీ చిన్న విషయానికే ఉద్యోగిని తొలగించేసింది ఓ కంపెనీ. కొత్తగా ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే కేవలం తన బాస్ కు ఉదయం టిఫిన్ తీసుకురాలేదని ఒక మహిళా ఉద్యోగిని తొలగించేశారు. అయితే ఆ తరువాత ఆమెకు జరిగిన అన్యాయం గురించి సోషల్ మీడియా అంతా వ్యాపించడంతో కంపెనీ పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదుర్కొంది. ఫలితంగా కంపెనీ యజమాన్యం తలవంచాల్సి వచ్చింది. ఈ ఘటన చైనా దేశంలో జరిగింది.


ప్రముఖ చైనా మీడియా సంస్థ సౌత్ చైనా మార్నింగ్ పోస్టులో ఇటీవల ఒక కథనం ప్రచురితమైంది. ఆ కథనం ప్రకారం.. లవు అనే యువతి నెల రోజుల క్రితం ఆఫీసులో సెక్రటరీగా ఉద్యోగంలో చేరింది. అయితే లవు సూపర్ వైజర్ ‘లియు’ ఆమె చేత తన పర్సనల్ పనులు చేయించేవాడు. ఆఫీసు పనులతో పాటు అతని వ్యక్తిగత పనులు చేయడం లవుకు అసలు ఇష్టం ఉండేది.

Also Read:  సిక్ లీవ్ ఇవ్వడానికి నిరాకరించిన బాస్.. ఫ్యాక్టరీలో మరణించిన మహిళా కార్మికురాలు!


ప్రతిరోజు ఉదయం సూపర్ వైజర్ లియు కోసం టిఫిన్ లో ఒక అమెరికానో కాఫీ, ఉడికిన గుడ్లు, వేడి నీరు తీసుకొని రావాలి. అయితే లవు కొన్ని రోజుల పాటు తనకు ఇష్టంలేకపోయినా ఈ పనులు చేసింది. కానీ ఆ తరువాత ఒకరోజు కాపీ, గుడ్లు మాత్రమే తీసుకొని వచ్చింది. వేరి నీరు మరిచిపోయింది. దీంతో సూపర్ వైజర్ లియుకు ఆమెతో చాలా కోపంగా మాట్లాడాడు. దీంతో మనస్తాపం చెందిన లవు.. ఇక తాను ప్రతిరోజు టిఫిన్ తీసుకురాలేనని ఎదురు చెప్పింది. కానీ సూపర్ వైజర్ లియు మాత్రం తాను చెప్పినట్లు ఆమె చేయాల్సిందేనని బెదిరించి వెళ్లిపోయాడు. మరుసటి రోజు లవు చెప్పినట్లే తన బాస్ కోసం టిఫిన్ తీసుకురాలేదు. ఇది తెలిసిన లియు ఆమెకు ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు చెప్పాడు.

ఈ విషయం గురించి హెచ్ ఆర్ విభాగానికి ఫిర్యాదు చేసింది లవు. తనను అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించారని, తన సూపర్ వైజర్ తన చేత వ్యక్తి గత పనులు చేయిస్తున్నాడని, ఆఫీసుల డ్యూటీ తప్ప ఆ పనులు చేయడం తన బాధ్యత కాదని లవు వాదించింది. అయితే హెచ్ ఆర్ ఆఫీసర్లు ఆమె ఫిర్యాదుపై లియుతో మాట్లాడింది. కానీ ఫలితం లేదు. చివరికి లవుని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు లెటర్ ఇచ్చి ఇంటికి పంపించేసింది.

Also Read: 7 ఏళ్ల బాలుడు కిడ్నాప్.. కిడ్నాపర్లపై పగతో ఆ పిల్లాడు ఎంత పనిచేశాడంటే..

ఈ ఘటనతో లవు మనస్తాపం చెంది, డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. తనకు జరిగిన అన్యాయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆమె పోస్ట్ చదివిన వారంతా కంపెనీ తీరును తప్పుపట్టారు. క్రమంగా లవు పోస్ట్ వైరల్ కావడంతో విషయం లేబర్ మినస్ట్రీకి వరకు చేరింది. దీంతో లవుకు కంపెనీ పిలిచి మరీ ఉద్యోగం కట్టబెట్టింది. అంతేకాకుండా ఆమెను వేధించిన సూపర్‌వైజర్ లియుని ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ విషయం గురించి కంపెనీ బహిరంగంగా ప్రకటన జారీ చేసింది.

Related News

Employee Dies On Duty: సిక్ లీవ్ ఇవ్వడానికి నిరాకరించిన బాస్.. ఫ్యాక్టరీలో మరణించిన మహిళా కార్మికురాలు!

Viral Video: హిప్పోపోటమస్ దంతాలను ఎలా క్లీన్ చేస్తారో చూశారా.. వీడియో వైరల్

Viral News: చెయ్యని తప్పుకు 46 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన ఖైదీ.. ఇన్నాళ్లకు నిర్దోషి అని తీర్పు

Viral News: బికినీ వేసుకుంటానన్న భార్య.. ఆమె కోసం ఏకంగా ఐలాండే కొనేసిన భర్త

Viral Video: యజమాని పిల్లలను కాపాడేందుకు కింగ్ కోబ్రాతోనే ఫైటింగ్ చేసిన శునకం

Viral News: ఆటో డ్రైవర్ ఆ మజాకా.. ! డ్రైవర్ సీటు చూస్తే షాక్ అవుతారు

Big Stories

×