EPAPER

Bus Driving : ఈ డ్రైవింగ్ చూస్తే షాక్ అవుతారు.. వైరల్ వీడియో!

Bus Driving : ఈ డ్రైవింగ్ చూస్తే షాక్ అవుతారు.. వైరల్ వీడియో!

viral videos


Bus Driver Holds Umbrella While Driving : ఆర్టీసీ అంటే ముందుగా గుర్తొచ్చేది భద్రత. ఆర్టీసీ బస్సుల్లో నిత్యం సామాన్య ప్రజలు ప్రయాణాలు చేస్తుంటారు. ప్రభుత్వ ఉద్యోగులతో మొదలు పెడితే… స్కూల్, కాలేజీల విద్యార్థులు, ప్రైవేట్ ఉద్యోగులు ఆర్టీసీలోనే ప్రయాణిస్తుంటారు. ఎందుకంటే ఆర్టీసీలో ప్రయాణం చాలా చౌకైనది. కానీ చాలా ఆర్టీసీ బస్సుల్లో సరైన సౌకర్యాలు ఉండవు. బస్సు ఎక్కమాంటే.. వీపరీతమైన శబ్ధం, పగిలిపోయిన అద్దాలు, చిరిగిపోయిన సీట్లు దర్శనిమిస్తాయి.

ఇవన్నీ పక్కనబెడితే తాజాగా ఆర్టీసీ బస్సులో జరిగిన ఘటన తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఎందుకంటే ఓ ఆర్టీసీ డ్రైవర్ గొడుగు పట్టుకొని డ్రైవింగ్ చేశాడు. అలా ఎందుకు జరిగింది అనుకుంటున్నారా? వర్షం పడుతుండగా.. కరెక్ట్‌గా డ్రైవిర్ సీట్‌పై బస్సుకు రంధ్రం పడింది. సమ్మర్‌లో వర్షం ఏంటి అనుకుంటున్నారా? ఈ ఘటన ఎలా జరిగిందో ఇప్పుడు చద్దాం..


Read More : ఓకే బైక్‌పై ఏడుగురు.. ఏందిరా ఇది..!

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో బస్సు డ్రైవర్‌పై ఉన్న రంధ్రం నుంచి నీరు.. డ్రైవర్‌పై పడుతోంది. దీంతో ఆ డ్రైవర్ బస్సును ఆపే సమయంలేక, వర్షపు నీళ్లకు తడవలేక.. వెంటనే ఓ గొడుగు తీసుకొని తనపై నీళ్లు పడకుండా ఒక చేత్తో గొడుగు పట్టుకొని డ్రైవ్ చేశాడు.

అయితే ఈ సంఘటన మొత్తాన్ని ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతానికి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ వీడియోస్ అనే అకౌంట్ నుంచి అప్లోడ్ అయింది. బస్సు డ్రైవర్ గొడుగు పట్టుకొని డ్రైవ్ చేయడంతో ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

వీడియోలో కనిపిస్తున్న ఆర్టీసీ బస్సు మహారాష్ట్రలోని అహేరి డిపోకు చెందినది. ఈ ఘటనపై రాజకీయ పార్టీలు మండిపడుతున్నారు. ఇది ప్రజల భద్రతను ఆందోళన కలిగించే అంశమని విమర్శిస్తున్నారు. నెటిజన్లు కూడా ఆ బస్సులో ప్రయాణించిన వారికి ఏదైనా జరిగి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదని అంటున్నారు.

Read More : రియల్ బాహుబలి.. కారును ఏం చేశాడో చూడండి

అయితే మనం చూసినట్లయతే ప్రభుత్వం నడుపుతున్న ఆర్టీసీ బస్సులు ప్రతి చోటా ఇదే దుస్థిలో ఉంటాయి. ప్రయాణిస్తున్న సమయంలో కొన్ని బస్సులు టైర్లు ఊడిన ఘటనలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ.. సామాన్య ప్రజలు ఆర్టీసీ ప్రయాణానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వాలు ఇటువంటి అంశాలు దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీలో ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన అవసరం ఉందని నెటిజెన్లు కోరుతున్నారు.

ప్రభుత్వాలు మాత్రం ఆర్టీసీ ప్రమాదాలు ఎన్ని జరిగినప్పటికీ సంస్థ అభివృద్ధికి సరైన చర్యలు తీసుకోవడం లేదని అంటున్నారు. ఇప్పటికి చాలా రాష్ట్రాల్లో ఆర్టీసీ పరిస్థితి ఇలానే కొనసాగుతోందని చెబుతున్నారు. దీనికి ముఖ్య కారణంగా సరైన రోడ్లు లేకపోవడమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Related News

Shocking Video: సన్యాసిగా మారిన పిల్లిని ఎప్పుడైనా చూశారా..! ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు

Mystery: చావు రహస్యం తేలిపోనుంది.. మరణం తర్వాత మూడో దశ!.. కన్ఫమ్ చేసిన సైంటిస్టులు

Flipkart: స్మార్ట్‌ఫోన్ పై 99 శాతం డిస్కౌంట్.. ఇదెక్కడి మోసమంటూ ఫ్లిప్‌కార్ట్‌పై కస్టమర్ల ఆగ్రహం

Viral Video: నూడుల్స్‌ని ఇష్టంగా లాగించేస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు

Amazon Delivery After 2 Years: రెండేళ్ల క్రితం అమెజాన్ ఆర్డర్ క్యాన్సిల్.. రీఫండ్ పూర్తి.. ఇప్పుడు డెలివరీ!

Viral Video: మీరేంట్రా ఇలా ఉన్నారు.. రూ. 10 జిలేబీ కోసం కొట్టుకుంటారా..

Urination: మూత్ర విసర్జన తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..

Big Stories

×