EPAPER

Urination: మూత్ర విసర్జన తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..

Urination: మూత్ర విసర్జన తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..

Urination: సాధారణంగా వచ్చే అనారోగ్య సమస్యల్లో మూత్ర విసర్జన ఒకటి. మూత్రం పోసే సమయంలో లేదా ఆ తర్వాత మంట రావడం, లేదా దురద రావడం వంటివి జరుగుతుంటాయి. ఇలా జరగడాన్ని చాలా మంది నిర్లక్ష్యంగా తీసుకుంటారు. కానీ ఇది ప్రాణాంతకర వ్యాధిలా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య ఒక వేళ పదే పదే వచ్చినా కూడా అస్సలు అజాగ్రత్తగా ఉండకూడదని అంటున్నారు. అయితే అసలు మూత్ర విసర్జన సమయంలో ఎటువంటి లక్షణాలు ఏర్పడతాయి, అలాగే దానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు..

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ :


మూత్రం పోసే సమయంలో సాధారణంగా మంట వంటి సమస్యలు ఎదురైతే దీనికి యూరీనరి ట్రాక్ట్ ఇన్పెక్షన్ కారణం అని నిపుణులు చెబుతున్నారు. ఇది ఇన్ఫెక్షన్ మాదిరిగా ఏర్పడుతుంది. అయితే మూత్ర వ్యవస్థలో అంటే మూత్రాశయం, మూత్ర పిండాలు, మూత్ర నాళంలో ఈ సమస్యలు సంభవించే అవకాశం ఉంది. అయితే ఈ సమస్య పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. యూటీఐ వచ్చిన సమయంలో మూత్రంలో దుర్వాసన, పొత్తి కడుపులో నొప్పి వంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది.

కిడ్నీలో స్టోన్స్:

మూత్రం మంటగా అనిపిస్తే కిడ్నీలో రాళ్లు కూడా ఏర్పడ్డాయని సంకేతం. కిడ్నీలో రాళ్లు అంటే ఉప్పు, వ్యర్థ ఖనిజాలు వంటివి మూత్ర పిండలాలో పేరుకుపోయి ఇబ్బందులు ఏర్పడతాయి. అంతేకాదు కిడ్నీలో రాళ్లు వస్తే మూత్ర నాళం కూడా మూసుకుపోతుంది. అంతేకాదు మూత్ర విసర్జన సమయంలో నొప్పి, మంట వంటివి కూడా ఏర్పడతాయి. అంతేకాదు వీపు దిగువన కూడా తీవ్ర నొప్పి కూడా ఏర్పడుతుంది.

లైంగికంగా సంక్రమించే వ్యాధులు :

లైంగికంగా సంక్రమించే వ్యాధుల కారణంగా కూడా మూత్ర విసర్జన చేసే సమయంలో మంట ఏర్పడుతుంది. మరోవైపు క్లామిడియా, గోనేరియా వంటి సమస్యలు ఏర్పడినప్పుడు కూడా మంట ఏర్పడుతుంది. అంతేకాకుండా ప్రైవేట్ పార్ట్స్ వద్ద కూడా మంట, దురద కూడా వస్తుంది. ఇటువంటి సమస్యలు ఉన్న వారు వెంటనే వైద్యులను సంప్రదించాలి.

ఇతర కారణాలు:

డయాబెటీస్ : షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎక్కువగా యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది.

మూత్రాశయంలో వాపు: మూత్రాశయం ఉబ్బిపోవడం వంటి లక్షణాలు ఏర్పడతాయి.

(గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.)

Related News

Shocking Video: సన్యాసిగా మారిన పిల్లిని ఎప్పుడైనా చూశారా..! ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు

Mystery: చావు రహస్యం తేలిపోనుంది.. మరణం తర్వాత మూడో దశ!.. కన్ఫమ్ చేసిన సైంటిస్టులు

Flipkart: స్మార్ట్‌ఫోన్ పై 99 శాతం డిస్కౌంట్.. ఇదెక్కడి మోసమంటూ ఫ్లిప్‌కార్ట్‌పై కస్టమర్ల ఆగ్రహం

Viral Video: నూడుల్స్‌ని ఇష్టంగా లాగించేస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు

Amazon Delivery After 2 Years: రెండేళ్ల క్రితం అమెజాన్ ఆర్డర్ క్యాన్సిల్.. రీఫండ్ పూర్తి.. ఇప్పుడు డెలివరీ!

Viral Video: మీరేంట్రా ఇలా ఉన్నారు.. రూ. 10 జిలేబీ కోసం కొట్టుకుంటారా..

Big Stories

×