EPAPER

Rapido Extra Fare: ఏంటి.. 21కిమి లకు రూ.1000లా?!.. రాపిడో నిలువు దోపిడీ

Rapido Extra Fare: ఏంటి.. 21కిమి లకు రూ.1000లా?!..  రాపిడో నిలువు దోపిడీ

Rapido Extra Fare| ఇటీవల ఎక్కడికైనా వెళ్లాలంటే అందరూ ఊబర్, రాపిడో ద్వారానే ఆటో, ట్యాక్సీ, బైక్ ట్యాక్సీ ద్వారానే బుక్ చేసుకుంటున్నారు. అలా కొన్ని రోజుల క్రితం ఒక వ్యక్తి రాపిడో బుక్ చేసుకుంటే అతనికి రాపిడో డ్రైవర్ చుక్కలు చూపించాడు. వెళ్లే దారిలో ఇబ్బందులు ఉన్నాయి. సమస్యలున్నాయని చెప్పి డబుల్ ఫేర్ రాబట్టాడు. కానీ తీరా అక్కడికెళ్లి చూస్తే.. అంత సీన్ లేదు. దీని గురించి ర్యాపిడోకి ఫిర్యాదు చేస్తే.. కంపెనీ ఏకంగా చాట్ విండో క్లోజ్ చేసింది. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. చెన్నై నగరానికి చెందిన ఎజె స్కిల్ డెవలప్మెంట్ అకాడమి వ్యవస్థాపకుడు, సిఈఓ అయిన అశోక్ రాజ్ రాజేంద్రన్ ఇటీవల మద్రాస్ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి తొరైపాక్కం వెళ్లడనాకి రాపిడో బుక్ చేసుకున్నాడు. రైల్వే స్టేషన్ నుంచి తొరైపాక్కమ్ మధ్య 21 కిలోమీటర్ల దూరం ఉంది. అందుకే రాపిడో యాప్ లో రూ.350 ఫేర్ చూపించింది. కానీ డ్రైవర్ అక్కడికి చేరుకొని అశోక్ రాజ్ తో మాట్లాడి ఎక్కడికెళ్లాలో తెలుసుకొని ఏకంగా రూ.1000 అవుతుందని చెప్పాడు.

Also Read: సహజీవనం చేసిన వ్యక్తిపై రేప్ కేసు పెట్టిన యువతి.. ఈజీగా బెయిల్ తెచ్చుకున్న నిందితుడు.. ఎలాగంటే?


ఇది విని అశోక్ రాజ్ ఆశ్చర్యపోయాడు. యాప్ లో రూ.350 చూపిస్తే.. రూ.1000 ఎక్స్‌ట్రా చార్జ్ ఎందుకివ్వాలని ప్రశ్నించాడు. దానికి ఆ డ్రైవర్ తొరైపాక్కమ్ వెళ్లే దారిలో అంతా వరదనీరు ఉందని.. అటు వైపు వెళ్లాలంటే చాలా కష్టమని చెప్పాడు. ఈ సమస్యలన్నీ యాప్ లో కనిపించవు.. తాను తొరైపాక్కమ్ వెళ్లాలంటే చాలా కష్టపడాలని చెప్పాడు. ఇదంతా విని అశోక్ రాజ్ అతను చెప్పేదంతా నిజమని నమ్మాడు. ఇక అక్కడే నిలబడి మరో ట్యాక్సీ కోసం ఎదురుచూడడం కంటే అతనితో వెళ్లడమే సరైదని నిర్ణయించుకున్నాడు. అందుకే బేరసారాలాడి రూ.1000 కి బదులు రూ.800 లు ఇస్తానని చెప్పాడు. అందుకు ఆ డ్రైవర్ అంగీకరించాడు. ఆ డ్రైవర్ ముందుగానే డబ్బులు తీసుకున్నాడు.

అలా ఆ రాపిడో డ్రైవర్ తో కలిసి తొరైపాక్కమ్ వెళ్లాడు. కానీ తీరా అక్కడికి వెళ్లాక చూస్తే.. వరద లాంటి పరిస్థితి ఏమీ లేదు. అశోక్ రాజ్ ఇది చూసి ఆ రాపిడో డ్రైవర్ తో తన డబ్బలు తిరిగి ఇవ్వాలని అడిగాడు. కానీ అతను ఇవ్వకుండా గొడవ చేసి వెళ్లిపోయాడు.

రాపిడో డ్రైవర్ తీరుతో అసహనంగా ఉన్న అశోక్ రాజ్.. ఈ విషయమై రాపిడో కస్టమర్ చాట్ లో ఫిర్యాదు చేశాడు. కానీ రాపిడో కస్టమర్ సర్వీస్ అతనికి సహకరించలేదు. అశోక్ రాజ్ చెప్పినదంతా విని.. రాపిడో కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అతనికి మరో కారణం చెప్పి చేతులు దులుపుకున్నాడు. తొరైపాక్కమ్ లో అశోక్ రాజ్ పెట్టిన అడ్రెస్ డెస్టినేషన్ కంటే 100 మీటర్లు ఎక్కువ ప్రయాణం జరిగిందని అందువల్ల డ్రైవర్ ఎక్స్‌ట్రా చార్జి తీసుకున్నాడని ఇందులో తాము చేయగలిగిందేమి లేదు. అని చెప్పేశాడు. దానికి అశోక్ రాజ్ 100 మీటర్లకు రెండింతల కంటే ఎక్కువ చార్జ్ చేస్తారా? అని అడిగాడు. దీంతో ఆ రాపిడో కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ వారి మధ్య జరిగిన చాట్ విండో క్లోజ్ చేసేశాడు.

Also Read: విచిత్ర వివాహం.. 70 ఏళ్ల ముసలాడితో 25 ఏళ్ల యువతి పెళ్లి.. ఎలా కుదిరిందంటే?

తనకు జరిగిన అన్యాయం గురించి అశోక్ రాజ్.. వివరంగా లింకిడ్ ఇన్ లో ఓ పోస్ట్ పెట్టాడు. రాపిడో తన డ్రైవర్లకు కస్టమర్ల వద్ద నుంచి ఎలా ఎక్స్‌స్ట్రా డబ్బులు చార్జ్ చేయాలో? నేర్పిస్తోందని.. కస్టమర్లకు మోసం రాపిడో మోసం చేస్తోందని తన కథ గురించి ఆ పోస్ట్‌లో వివరించాడు. తాను బుక్ చేసుకున్న యాప్ స్క్రీన్ షాట్‌లు, రాపిడో కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ తో చాట్ చేసిన చాట్ విండో స్క్రీన్ షాట్‌లు షేర్ చేశాడు.

అశోక్ రాజ్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీంతో రాపిడో యజమాన్యం చివరకు కిందికి దిగివచ్చింది. అశోక్ రాజ్ కు రాపిడో రీజినల్ మేనేజర్ ఫోన్ చేసి.. అతనికి జరిగిన అన్యాయం గురించి ఆరాతీశాడు. ఆ తరువాత అతని వద్ద తీసుకున్న ఎక్స్‌ట్రా రూ.350 వెనక్కు ఇచ్చేశారు. రాపిడో వాలెట్ లో ఆ డబ్బులు క్రెడిట్ చేశాడు. ఆ రాపిడో డ్రైవర్ కు రీ ట్రైనింగ్ కోసం పంపిస్తూ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపాడు.

Related News

Influencer Selfie Death: ‘లైఫ్ జాకెట్ వేసుకుంటే సెల్ఫీ చెడిపోతుంది’.. సముద్రంలో మునిగిపోయిన ఫేమస్ ఇన్‌ఫ్లుయెన్సర్లు

Viral video: రైల్వే ట్రాక్‌పై సెల్ఫీ.. వేగంగా దూసుకొచ్చిన రైలు, రెప్పపాటులో ఎగిరిపడ్డ యువకుడు

World’s fattest cat: ప్రపంచంలోనే అత్యంత బరువైన పిల్లి.. డైటింగ్ చేస్తూ మృతి!

Snake Species: ఈ పాములు తోటి పాములనే తింటాయి, ఎందుకో తెలుసా?

Coconuts In Flights: విమానాల్లో కొబ్బరి కాయలు తీసుకెళ్లకూడదు.. ఎందుకో తెలుసా?

Viral Video: పో*ర్న్ మూవీలో ఆఫర్.. సంతోషం తట్టుకోలేక తల్లికి చెప్పేసిన కొడుకు, ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Big Stories

×