EPAPER

Viral Video: పిల్లో కవర్ లో వింత కదలికలు, ఓపెన్ చేస్తే.. వామ్మో వెన్నులో వణుకు పుట్టాల్సిందే!

Viral Video: పిల్లో కవర్ లో వింత కదలికలు, ఓపెన్ చేస్తే.. వామ్మో వెన్నులో వణుకు పుట్టాల్సిందే!

Cobra In Pillow Cover: పాములు తరచుగా ఇళ్లలోకి వస్తుంటాయి. గార్డెన్ లోని చెట్ల పొదల్లో పడుకుంటాయి. కొన్నిసార్లు కిచెన్ లోకి చొరబడుతుంటాయి. మరికొన్నిసార్లు కార్లు, బైకులలో నక్కి పడుకుంటాయి. ఒక్కోసారి షూలలో చేరిన ఘటనలూ చూశాం. పాముల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రాణాలే ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా త్రాచుపాము, రక్త పింజర, కట్ల పాము అత్యంత విషపూరితమైనవి. ఇవి కరిస్తే ఒక్కోసారి ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. తాజాగా ఓ త్రాచు పాము ఏకంగా సోఫా పిల్లోకవర్ లో పడుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


పిల్లో కవర్ లో వింత శబ్దాలు

తాజాగా ఓ ఇంట్లోకి ప్రమాదకరమైన త్రాచు పాము చొరబడింది. నెమ్మదిగా సోఫా మీదికి ఎక్కింది. పిల్లో కవర్ లోకి వెళ్లి పడుకుంది. అయితే, పిల్లో నుంచి వింత శబ్దాలు రావడంతో పాటు కదిలినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. ఆ సౌండ్ అచ్చం పాము శబ్దం మాదిరిగా ఉండటంతో భయపడ్డారు. వెంటనే పాములు పట్టే వ్యక్తిని పిలిపించారు. ఇంటికి వచ్చిన స్నేక్ క్యాచర్.. నెమ్మదిగా పిల్లో కవర్ ను ఓపెన్ చేశాడు. బయంకరమైన త్రాచు పాము పిల్లో నుంచి బుసలు కొడుతూ పడగ విప్పింది. ఆ పామును చూడనే అందరిలో వణుకు పెట్టింది. స్నేక్ క్యాచర్ వెంటనే ఆ పామును పట్టి తీసుకెళ్లి దగ్గర్లో ఉన్న అడవిలో వదిలిపెట్టాడు.


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పాము వీడియో

ఈ వీడియోను అభిషేక్ సంధు అనే వ్యక్తి ఇన్ స్టాలో ఫేర్ చేశాడు. ఇప్పటి వరకు ఏకంగా 165 మిలియన్ వ్యూస్ అందుకుంది. సుమారు లక్షా 40 వేల లైక్స్ పొందింది. 5 లక్ష లమంది ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోను చూసి నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. “ఈ వీడియో చూస్తుంటే సోఫాలో కూర్చోవాలి. దిండు పట్టుకోవాలి అనే ఆలోచన వచ్చినా భయంతో వణికిపోయేలా ఉంది” అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. “నాకు పాములు అంటేనే భయంగా ఉంటుంది. ఈ వీడియో చూశాక ఆ భయం మరింత పెరిగింది” అని మరో నెటిజన్ చెప్పుకొచ్చాడు. “నేను ఈ వీడియో చూస్తున్న సమయంలో నా ఒడిలో దిండు ఉంది. ఒక్కసారిగా ఉలిక్కిపడి దిండును ఓపెన్ చేసి చూశాను. కానీ, ఇందులో పాము లేదు” అని ఇంకో నెటిజన్ వెల్లడించాడు. “పాములు ఇళ్లలోకి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి” అని మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దోమలు, ఈగలతో పాటు పాములు ఇంట్లోకి రాకుండా మెష్ డోర్లు పెట్టుకోవాలని ఇంకోందరు సలహా ఇస్తున్నారు.

Read Also: హిమాలయాల్లోని అరుదైన పాముకు ఆ రొమాంటిక్ హీరో పేరు పెట్టిన పరిశోధకులు.. అది అంత స్పెషలా?

Related News

Human Eating: బాబోయ్.. వీళ్లు సొంత కుటుంబ సభ్యులనే తినేస్తారట, ప్రపంచంలో ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా?

Viral Video: డ్రైనేజీ నీళ్లు, రోడ్డు మీద బురద, బిగ్ బాస్ కంటెస్టెంట్ ను బండ బూతులు తిడుతున్న నెటిజన్లు

Minahil Malik: పాకిస్థాన్ బ్యూటీ ప్రైవేట్ వీడియో లీక్, ఆ పని చేసింది ఎవరంటే?

Roma Michael Bikini: ‘ఈ మహిళ నరకానికే వెళుతుంది’.. బికినీలో పాకిస్తాన్ మోడల్!

Kiss Allergy: ‘నన్ను ముద్దు పెట్టుకోవాలంటే షరతులు వర్తిస్తాయి’.. బాయ్‌ఫ్రెండ్స్‌కు యువతి కండీషన్స్ వైరల్

Fake Court In Gujarat: నిన్న ఫేక్ పోలీస్ స్టేషన్, నేడు ఫేక్ కోర్టు- చీటర్లు మరీ రాటుదేలుతున్నారు భయ్యా!

Big Stories

×