EPAPER

10 Storey Building in a Day: ఒక్క రోజులో 10 అంతస్తుల భవన నిర్మాణం పూర్తి.. అంతా చైనా మహిమ!

10 Storey Building in a Day: ఒక్క రోజులో 10 అంతస్తుల భవన నిర్మాణం పూర్తి.. అంతా చైనా మహిమ!

10 Storey Building in a Day| ఒక చిన్న ఇల్లు కట్టాలంటే దాని ప్లానింగ్ చేసి నిర్మించాలంటే చాలా సమయం పడుతుంది. కానీ చైనాలోని ఒక కంపెనీ 10 అంతస్తుల భవన నిర్మాణం మంచి ప్లానింగ్ తో దాదాపు ఒక రోజులోనే పూర్తి చేసింది. చైనా తన టెక్నాలజీ అతి తక్కువ ఖర్చులో అతి తక్కువ సమయంలో కొత్త వస్తువులు తయారు చేస్తుందని పేరు. తాజాగా అలాంటిదే మరో అద్భుతం చేసి చూపించారు చైనీయులు.


ప్రతిఒక్కరూ సొంతంగా ఇల్లు కట్టుకోవాలని కలలు కంటూ ఉంటారు. సాధారణంగా భారతదేశంలో ఒక ఇంటి పునాది వేయడానికే వారం రోజుల సమయం పడితే.. డ్రాగన్ దేశంలో మాత్రం 10 అంతస్తుల భవనాన్ని కేవలం దాదాపు 29 గంటల్లో పూర్తి చేసి చైనీయులు రికార్డ్ సాధించారు. ఇదంతా చైనాలోని కొత్త టెక్నాలజీతో సాధ్యమైంది. చైనాలోని బ్రాడ్ గ్రూప్ కంపెనీ.. కేవలం ఒక రోజు సమయంలో ఒక స్టీల్ బిల్డింగ్ తో ఒక పది అంతస్తుల అపార్ట్ మెంట్ ని విజయవంతంగా నిర్మించింది. ఈ బిల్డింగ్ కట్టడానికి లివింగ్ బిల్డింగ్ సిస్టమ్ పేరుతో బాగా ఫేమస్ అయిన బోల్డ్ అండ్ మాడ్యూలర్ పరికరాలు ఉపయోగించి ఈ రికార్డ్ సాధించారు. దీనికి సంబంధించన ఒక వీడియా కూడా కంపెనీ రిలీజ్ చేసింది.

Also Read: ముంబై రోడ్లపై టవల్‌తో తిరిగిన అమ్మాయి.. ఒక్కసారిగా టవల్ తీసేయడంతో..


బిల్డింగ్ నిర్మాణం ఎలా చేశారంటే
వీడియోలో తెలిపిన వివరాల ప్రకారం.. ప్రి ఫ్యాబికేటెడ్ కన్స్‌ట్రక్షన్ సిస్టమ్ టెక్నాలజీతో బ్రాడ్ గ్రూప్ కంపెనీ 28 గంటల, 45 నిమిషాల్లో 10 అంతస్తుల భవన నిర్మాణం పూర్తిచేసింది. ఈ నిర్మాణం చాలా సులువుగా జరిగిందని.. అంతా ఆన్‌సైట్ ఇన్స్‌టాలేషన్ తో పూర్తి చేశామని కంపెనీ తెలిపింది. ఇదంతా చేయడానికి కంపెనీ ముందుగానే రెడీమేడ్ కంటెయినర్స్ ఉపయోగించారు. ఇందులో చిన్న చిన్న సెల్ఫ్ కంటెండ్ మాడ్యూలార్ యూనిట్స్ ని అసెంబుల్ చేసి నిర్మాణం చేస్తారు. ఈ యూనిట్స్ అన్నీ ముందుగానే ఫ్యాక్టరీలో తయారు చేస్తారు.

ఫ్యాక్టరీలో ఇల్లు తయారీ ప్రారంభం
ఇలా త్వరగా ఇల్లు నిర్మించడానికి ముందుగా డిజైనింగ్ చేస్తారు. బిల్డింగ్ నిర్మాణంలో ఉపయోగించే మాడ్యులార్ యూనిట్స్‌ని బ్రాడ్ గ్రూప్ తన ఫ్యాక్టరీలో తయారు చేస్తుంది. ఆ తరువాత వాటిని పెద్ద పెద్ద కంటెయినర్లలో పెట్టి ట్రక్కుల ద్వారా నిర్మాణ స్థలానికి తరలిస్తుంది. సైట్ కు చేరుకున్నాక ఈ కంటెయినర్లను ఒకదానికి మరొకటి బోల్ట్ ల ద్వారా జోడిస్తారు. ఇలా చేస్తూ.. బిల్డింగ్ నిర్మాణం పూర్తవుతుంది. ఆ వెంటనే నీటి, కరెంటు కనెక్షన్ కూడా త్వరగా పూర్తి చేస్తారు.

Also Read: కారు సైలెన్సర్‌తో సిగరెట్‌కు నిప్పింటించిన యువకుడు.. దూల తీరిందిగా!

భూకంపం వచ్చినా చెక్కుచెదరని ఇల్లు
కంపెనీ రిపోర్ట్ ప్రకారం.. ఈ బిల్డిండ్ చాలా దృఢంగా ఉంటుంది. ఇందులో స్టీల్ స్లాబ్ వేయడంతో భవనం బలంగా ఉంటుంది. సాధారణ స్లాబ్ కంటే 100 రెట్లు బలంగా, 10 రెట్లు తేలికగా ఈ స్లాబ్ ఉంటుందని కంపెనీ చెబుతోంది. అందుకే భూకంపాలు వచ్చినా ఇల్లు అలాగే కదలకుండా నిలబడి ఉంటుంది. ఈ టెక్నాలజీ నిర్మాణ రంగంలో ఓ విప్లవమని నిపుణుల అభిప్రాయం.

19 రోజుల్లో 57 అంతస్తుల భవనం
అతి తక్కువ సమయంలో నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు పేరు గాంచిన చైనా కంపెనీ బ్రాడ్ గ్రూప్.. గతంలో కూడా డబుల్ క్విక్ వేగంతో 57 అంతస్తుల భవనం నిర్మించింది. 2015లో స్పీడ్ బిల్డ్ చాలెంజ్ లో భాగంగా లివింగ్ బిల్డింగ్ సిస్టమ్ పద్ధతిని అనుసరించి ఈ కంపెనీ 57 అంతస్తుల భవనాన్ని కేవలం 19 రోజుల్లో పూర్తిచేసింది.

Related News

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Jani Master : కేసులో మరో ట్విస్ట్.. కూపీ లాగనున్న మహిళా కొరియోగ్రాఫర్..!

Bigg Boss 8 Day 18 Promo: హౌస్ లో పెద్ద డ్రామా నడుస్తోందే.. సోనియా కి ఝలక్ ఇచ్చిన నబీల్..!

Heroine Poorna: తల్లిని నిందించారు.. హేళన మాటలపై పూర్ణ ఎమోషనల్..!

NaniOdela2: ఫ్యాన్స్ గెట్ రెడీ.. మాస్ జాతరకు సిద్ధం కండమ్మా..!

Big Stories

×