EPAPER
Kirrak Couples Episode 1

Cat Employees: పిల్లులకు ఉద్యోగం ఇచ్చిన కంపెనీ.. ఆఫీసులో దర్జాగా అవి ఏం చేస్తున్నాయంటే..!

Cat Employees: పిల్లులకు ఉద్యోగం ఇచ్చిన కంపెనీ.. ఆఫీసులో దర్జాగా అవి ఏం చేస్తున్నాయంటే..!

Cat Employees| ఆఫీసులో ఎంతో కష్టపడి పనిచేసే ఉద్యోగులు మానసికంగా ప్రశాంతంగా ఉండాలని కోరుకునే ఓనర్లు చాలా అరుదు. ఉద్యోగులు పని టెన్షన్, ఇంట్లో టెన్షన్ తో సతమవుతుంటే వారు ఉల్లాసంగా ఉండాలని భావించిన ఒక యజమానికి వింత ఆలోచన వచ్చింది. ఆఫీసులో పెంపుడు జంతువులుంటే వాటితో ఆడుకుంటూ ఉద్యోగలు.. పని ఒత్తిడిని మరిచిపోయి సరదాగా పనిచేసుకుంటారని ఆ ఓనర్ భావించాడు. అయితే పెంపుడు జంతువుల్లో కేవలం పిల్లిని మాత్రమే ఆఫీసులో తెచ్చుకోవాలని నిర్ణయించాడు. అయితే ఈ పిల్లులకు పెంపుడు జంతువులుగా కాకుండా కంపెనీలో ఉద్యోగులుగా పదవులు కూడా కట్టబెట్టాడు. ఇందులో ఒ పిల్లికైతే కంపెనీ ఓనర్ కన్నా ఎక్కువ అధికారాలున్నాయి.


వివరాల్లోకి వెళితే.. జపాన్ దేశంలోని ‘క్యూ నోట్’ అనే కంపెనీ ఓనర్ నోబుయూకి సురాటా తన ఉద్యోగులకు ఆఫీసులో పని ఒత్తిడి ఉండకూడదని వారికి కాలక్షేపం కోసం పిల్లులను పెంచుతున్నాడు. అయితే వాటిని పెంపుడు జంతువులుగా చూడకుండా కంపెనీలో వాటికీ ఉద్యోగులుగా పెట్టుకున్నాడు.

Also Read: టిఫిన్ తీసుకురాలేదని ఉద్యోగిని తొలగించిన బాస్.. ఆ తరువాత..


ఇదంతా 2004లో మొదలైంది. అప్పుడు క్యూ నోట్ కంపెనీ చిన్న ఆఫీసుగా ఉండేది. ఆ సమయంలో ఓనర్ నోబుయూకి సురాటా ఒక రోజు బిజినెస్ ఒత్తడి వల్ల డిప్రెషన్ లో ఉండగా.. ఒకరోజు సూషీ తినడానికి ఒక రెస్టారెంట్ వెళ్లాడు. అక్కడ ఓ పిల్లి చాలా ముద్దుగా అనిపించింది. ఆ పిల్లి సురాటోకు వద్దకు వచ్చి స్నేహంగా ఆడుకుంది. సురాటో ఆ కాసేపు మానసిక ప్రశాంతతను అనుభవించాడు. ఆ పిల్లిని దత్తత తీసుకొని దాన్ని తనతో నిత్యం సమయం గడిపేవాడు. ఆఫీసుకు కూడా తీసుకెళ్లే వాడు. ఆ పిల్లకి ‘ఫుతాబా’ అని పేరు పెట్టాడు.

ఆ తరువాత క్రమంగా ఆఫీసులో అందరూ ఆ పిల్లితో ఆడుకునే వాడు. ఇది చూసిన కంపెనీ ఓనర్ సురాటో ఆఫీసులో పిల్లులు పెంచాలని నిర్ణియించుకున్నాడు. అలా 2020 సంవత్సరం వచ్చే సరికి క్యూనోట్ కంపెనీలో మొత్తం 10 పిల్లులు తెచ్చిపెట్టకున్నాడు. వాటిలో ఆరు ఫుతాబాకు జన్మించిన పిల్లలు కాగా.. మిగతా వాటిలో ఒకటి రోడ్డుపై యాక్సిడెంట్ జరిగితే ఆ పిల్లిని ఓ ఉద్యోగి కాపాడి తెచ్చి పెంచుకుంటున్నాడు. అలాగే మరొక ఉద్యోగి కూడా ఒక పిల్లిని పెట్ షాపు నుంచి కొని తెచ్చుకున్నాడు. మిగతా రెండులో ఒకటి స్ట్రే క్యాట్ కాగా మరొక దాన్ని ఇంకో ఉద్యోగి దత్తత తీసుకున్నాడు.

Also Read:  సిక్ లీవ్ ఇవ్వడానికి నిరాకరించిన బాస్.. ఫ్యాక్టరీలో మరణించిన మహిళా కార్మికురాలు!

తాజాగా క్యూ నోట్ కంపెనీ బిజినెస్ అభివృద్ధి చెందడంతో ఓనర్ సురాటో ఒక నాలుగు అంతస్తుల భవనంలో కొత్త ఆఫీసు తీసుకున్నాడు. ఆ కొత్త ఆఫీసులో పిల్లలకు ప్రత్యేకంగా బాత్ రూమ్ లు కట్టించాడు. పిల్లులు గోడలకు తమ గోళ్లతో గీకుతూ ఉంటాయి.. అందుకోసం ప్రత్యేకంగా స్క్రాచ్ ఫ్రూఫ్ పెయింట్ వేయించాడు. పిల్లులు విశ్రాంతి తీసుకునేలా వారికోసం ప్రత్యేకంగా గదులు కూడా నిర్మిచాడు.

క్యూనోట్ కంపెనీ ఆఫీసులో మొత్తం 32 ఉద్యోగులుండగా వారితో జీతంతో సమానంగా పిల్లులకు ఖర్చు పెడుతున్నాడు ఓనర్ సురాటో. పైగా నాలుగు పిల్లులకు ఉద్యోగ హోదా కూడా కల్పించాడు.

ఒక పిల్లికి మేనేజర్ , మరొక పిల్లికి ఆడిటర్, ఇంకో పిల్లికి చీఫ్ క్లర్క్ హోదా కల్పిచాడు. అన్నింటి కంటే పెద్ద పిల్లి ఫుతాబాకి ‘చెయిర్ క్యాట్’ అంటే కంపెనీ చైర్మన్ హోదా కల్పించాడు. అంటే ఫుతాబాకు కంపెనీలో సురాటో కంటే ఎక్కువ అధికారాలున్నాయి.

Also Read: 7 ఏళ్ల బాలుడు కిడ్నాప్.. కిడ్నాపర్లపై పగతో ఆ పిల్లాడు ఎంత పనిచేశాడంటే..

2022లో కంపెనీ మొత్తం 11 పిల్లులుండగా వాటిలో ఒకటి చనిపోయింది. మిగతా వాటిలో 8 ఆఫీసులో నివసిస్తున్నాయి. రెండు పిల్లులు ఒక ఉద్యోగి తనతో ఇంటికి తీసుకెళతాడు. అంతేకాదు కంపెనీలో ఉద్యోగం కోసం వచ్చే వారికి ఓనర్ సురాటో ఒక కండీషన్ విధించాడు.

పిల్లులంతే ఇష్టం ఉన్నవాళ్లు మాత్రమే ఉద్యోగంలోకి చేరాలని నిబంధన పెట్టాడు సురాటో.

Related News

Employee Fired For Not bring Food For Boss: టిఫిన్ తీసుకురాలేదని ఉద్యోగిని తొలగించిన బాస్.. ఆ తరువాత..

Employee Dies On Duty: సిక్ లీవ్ ఇవ్వడానికి నిరాకరించిన బాస్.. ఫ్యాక్టరీలో మరణించిన మహిళా కార్మికురాలు!

Viral Video: హిప్పోపోటమస్ దంతాలను ఎలా క్లీన్ చేస్తారో చూశారా.. వీడియో వైరల్

Viral News: చెయ్యని తప్పుకు 46 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన ఖైదీ.. ఇన్నాళ్లకు నిర్దోషి అని తీర్పు

Viral News: బికినీ వేసుకుంటానన్న భార్య.. ఆమె కోసం ఏకంగా ఐలాండే కొనేసిన భర్త

Viral Video: యజమాని పిల్లలను కాపాడేందుకు కింగ్ కోబ్రాతోనే ఫైటింగ్ చేసిన శునకం

Big Stories

×