EPAPER

Viral Post: ఇదెక్కడి విడ్డూరం.. ఇంటి అద్దె మాదిరి క్యాబ్ ఛార్జీలు వసూలు..

Viral Post: ఇదెక్కడి విడ్డూరం.. ఇంటి అద్దె మాదిరి క్యాబ్ ఛార్జీలు వసూలు..

Viral Post: మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న టెక్నాలజీతో పాటు సమాజంలో డబ్బు విలువ కూడా పెరుగుతుంది. డబ్బుకు ఉన్న డిమాండ్ చూస్తే బ్రతకడమే కష్టంగా మారుతుంది. ఏ వస్తువు కొనుగోలు చేయాలన్నా కూడా సామాన్యుడిని భయాందోళనకు గురిచేస్తోంది. టెక్నాలజీ పెరగడంతో పాటు సమాజంలో ప్రతీదాని రేటు, విలువ కూడా పెరిగిపోతుంది. ముఖ్యంగా రవాణా ఛార్జీలు అయితే విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందులో భాగంగా సిటీల్లో నివసించే ఉద్యోగులు, యువతకు అందుబాటులో క్యాబ్ లు ఉంటున్నాయి. వీటి ఛార్జీలు రోజు రోజుకూ ఓ ఇంటి అద్దె కట్టె మాదిరి పెరిగిపోతున్నాయి. అయితే తాజాగా క్యాబ్ ఛార్జీలకు సంబంధించిన ఓ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.


క్యాబ్ ఛార్జీలు ఏకంగా ఇంటి అద్దెకు సమానంగా ఛార్జ్ చేస్తున్నారని ఓ యువతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఘటన బెంగుళూరులో వెలుగుచూసింది. ఓ యువతి తనకు ఎదురైన అనుభవాన్ని నెటిజన్లతో పంచుకుంది. భారతదేశంలోని ప్రముఖ పట్టణాలలో బెంగుళూరు కూడా ఒకటి. బెంగుళూరులో ట్రాఫిక్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. విపరీతమైన ట్రాఫిక్ కారణంగా ఇక్కడ జనాలు తీవ్ర అవస్తలు పడుతుంటారు. ప్రస్తుతం సిటీల్లో క్యాబ్ లకు విపరీతమైన క్రేజ్ ఉంది. కిలో మీటరు దూరం వెళ్లాలన్నా కూడా క్యాబ్‌ను వాడుతున్నారు.

తాజాగా బెంగుళూరుకు చెందిన వన్షిత అనే ఓ ఎంప్లాయికి ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. తాను ఆఫీసుకు వెళ్లడానికి తరచూ క్యాబ్ ను ఉపయోగిస్తుంది. అయితే ఈ తరుణంలో రోజు ఛార్జీలను కలిపి లెక్క వేసింది. దీంతో ఒక్కసారిగా షాక్ అయింది. జూలై 1వ తేదీ నుంచి 25వ తేదీ వరకు 73 సార్లు ప్రయాణించింది. అయితే దీనికి కలిపి మొత్తం రూ. 16వేల ఛార్జీ అయింది. దీనిని వన్షిత సోషల్ మీడియాలో నెటిజన్లతో పంచుకుంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇది తన ఇంటి అద్దెలో సగం కంటే ఎక్కువే క్యాబ్ ఛార్జీలు ఉన్నాయని తెలిపింది. మరోవైపు ఇది హైదరాబాద్ లో క్యాబ్ ఛార్జీల కంటే ఎక్కువే అని చెప్పడంలో అసలు సంకోచించాల్సి అవసరం లేదని పేర్కొంది. దీంతో వన్షిత చేసిన పోస్టుపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.


Related News

Vande Bharat Express: వందేభారత్ రైలు వివాదం.. ఉద్యోగుల మధ్య ఘర్షణ

Viral Video: రాత్రిళ్లు ఆటో నడుపుతున్న 55 ఏళ్ల మహిళ కథ వింటే కన్నీరు ఆగదు..

Auto Driver Slap: ఓలా రైడ్ క్యాన్సిల్ చేసిందని యువతిపై దాడి.. వీడియో వైరల్

Viral Video: ఎంత దర్జాగా కూర్చున్నావ్ భయ్యా.. ట్రక్కులో ఈ వ్యక్తి హుందాతనం చూస్తే షాక్ అవుతారు

Viral Video: భోజనం చేసేందుకు రెడీ అయిన కపుల్స్.. ఒక్కసారిగా ఇంట్లోకి దూసుకువచ్చిన కారు

Sweeper Jobs: ఏంటండీ ఈ విడ్డూరం.. రోడ్లూడ్చే పనికి 46 వేల మంది గ్రాడ్యుయేట్ల పోటీ

70 Weds 25: విచిత్ర వివాహం.. 70 ఏళ్ల ముసలాడితో 25 ఏళ్ల యువతి పెళ్లి.. ఎలా కుదిరిందంటే?

Big Stories

×