EPAPER

Viral News: ఇల్లు అగ్గి పెట్టె అంత.. అద్దె రూ.45 వేలు, ఎక్కడో తెలుసా?

Viral News: ఇల్లు అగ్గి పెట్టె అంత.. అద్దె రూ.45 వేలు, ఎక్కడో తెలుసా?

Mumbai House Rent: సింగిల్ బెడ్ రూమ్ రెంట్ ఎంత ఉంటుంది? పట్టణాల్లో అయితే, రూ. 5 వేల వరకు ఉంటుంది. నగరాల్లో అయితే, రూ. 10 నుంచి 15 వేలు ఉంటుంది. ఇంకాస్త క్లాస్ ఏరియాల్లో అయితే, రూ. 20 నుంచి 25 వేలు ఉంటుంది. కానీ, ముంబై మాతుంగాలో ఏకంగా రూ. 45 వేలు పలుకుతోంది. తాజాగా హృతిక్ సాల్వే అనే రెంట్ హౌస్ ల మీడియేటర్ షేర్ చేసి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు క్రేజీగా రియాక్ట్ అవుతున్నారు.


సోషల్ మీడియా ఆగ్రహం

ముంబై మాతుంగా ఈస్ట్ లో ఈ సింగిల్ బెడ్ రూమ్ అపార్ట్‌ మెంట్‌ ఉన్నది. ఇందులో సింపుల్ లివింగ్ రూమ్, ఓ ఇరుకు బెడ్ రూమ్, చిన్న కిచెన్, సబ్జా మీద ఇతర సామాన్లు పెట్టుకునేందుకు చిన్న మెట్లు ఉన్నాయి. ఈ వీడియోను హృతిక్ సాల్వే ఇన్ స్టాలో షేర్ చేస్తూ ‘ఓల్డ్ వైబ్ 1BHK రెంట్ జస్ట్ 45K‘ అనే క్యాప్షన్ తో షేర్ చేశాడు. 450 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంట్లో కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది. ఈ ఇల్లు రైల్వే స్టేషన్ సమీపంలో ఉందని రాసుకొచ్చాడు. ఆయన ఈ వీడియో షేర్ చేసిన కాసేపట్లోనే సోషల్ మీడియా ఓ రేంజిలో వైరల్ అయ్యింది.


ఇంత చిన్న ఇంటికి అంత రెంట్ వసూళు చేయడం పట్ల కొంత మంది నెటిజన్లు కొపంగా కామెంట్స్ పెడితే, మరికొంత మంది ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. “ఇంత చిన్ ఇంటికి రూ. 45 వేల రెంట్ అడగడానికి ఓనర్ కు సిగ్గుండాలి” అని కామెంట్స్ పెడుతున్నారు. “ఈ ఇంటికి రూ. 45 వేల రెంట్ అంటే చాలా తక్కువ. కనీస నెలకు రూ. 1 కోటి ఉంటే బాగుంటుంది” అంటూ మరొకరు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “ముంబైలో పెరుగుతున్న కాస్ట్ ఆఫ్ లింవింగ్ కు ఈ ఇంటి రెంట్ బెస్ట్ ఎగ్జాంఫుల్” అంటూ ఇంకొంత మంది కామెంట్స్ చేస్తున్నారు.

Read Also:ట్రైన్ ఫర్ సేల్.. సీరియస్ బయ్యర్స్ మాత్రమే ట్రై చేయండి- సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో!

 

View this post on Instagram

 

A post shared by Hritik Salve (@hritiksalve_2130)

ప్రైమ్ ఏరియాలో రెంట్లు కాస్త ఎక్కువే!

ముంబై నగరంలోని ప్రైమ్ ఏరియాల్లో కాస్త రెంట్లు ఎక్కువగానే ఉంటాయంటున్నారు రియల్ ఎస్టేట్ నిపుణులు. “పెరుగుతున్న సిటీ జనాభాకు అనుగుణంగా ఇంటి రెంట్లు కూడా పెరుగుతున్నాయి. అలాగే తక్కువ అద్దెకు దొరికే  ఇండ్లు కూడా ఉన్నాయి. మాతుంగాలో చాలా వరకు అపార్ట్ మెంట్ అద్దెలు ఎక్కువగానే ఉంటాయి.  ఇల్లు చిన్నగా ఉన్నది ఒక్కటే కాదు, అసలు ఆ ఇల్లు ఎక్కడ ఉందో గమనించడం ముఖ్యం. దేశంలోని ఇతర కాస్మోపాలిటన్ సిటీస్ తో పోల్చితే ముంబైలో ఆస్తుల విలువ విపరీతంగా పెరుగుతుంది. ఫలితంగా ఇండ్ల అద్దెలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి” అంటున్నారు.

Read Also: ‘బతుకు బండి‘ మీదే ప్రాణాలు విడిచి.. కంటతడి పెట్టిస్తున్న వైరల్ వీడియో!

Related News

Viral Video: ‘బతుకు బండి‘ మీదే ప్రాణాలు విడిచి.. కంటతడి పెట్టిస్తున్న వైరల్ వీడియో!

Viral News: ట్రైన్ ఫర్ సేల్.. సీరియస్ బయ్యర్స్ మాత్రమే ట్రై చేయండి- సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో!

Vegetable Buying Guide: ‘ఇంత బతుకు బతికి చివరికి ఈ పని చేయాలా!’.. వైరల్ అవుతున్నరిటైర్డ్ అధికారి ఫన్నీ పోస్ట్

Bus Train Crash Just Miss: బస్సును ఢీ కొట్టబోయిన రెండు రైళ్లు జస్ట్ మిస్.. అంతా గేట్ మెన్ నిర్వాకం..

Bengaluru Woman Sleep Internship : కేవలం నిద్రపోతూ రూ.9 లక్షలు సంపాదించిన యువతి!.. ఎలా చేసిందంటే?..

Viral News: 8 వేల డ్రోన్లతో కళ్లు చెదిరే లేజర్ షో.. గిన్నీస్ రికార్డులూ బద్దలు, అలా ఎలా చేశారయ్యా బాబు!

Big Stories

×