EPAPER

Earth Quake in Japan: హ్యాట్సాఫ్.. తమ ప్రాణాలను లెక్క చేయకుండా పిల్లల ప్రాణాలను కాపాడిన నర్సులు.. వీడియో వైరల్!

Earth Quake in Japan: హ్యాట్సాఫ్.. తమ ప్రాణాలను లెక్క చేయకుండా పిల్లల ప్రాణాలను కాపాడిన నర్సులు.. వీడియో వైరల్!


Nurses Saved Children During The Taiwan Earthquake: ఓ వైపు భూకంపం పెను ముప్పులా ముంచుకొస్తుంది. ప్రాణాలను రక్షించుకోవడానికి అందరు పరుగులు పెడుతున్నారు. హాస్పిటల్‌లో డాక్టర్లు సైతం పారిపోయారు. ఇక మిగిలింది పేషేంట్లు, నర్సులు మాత్రమే. పేషెంట్లు లేచి నెమ్మదిగా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలోనే నర్సులు మాత్రం తమ ప్రాణాలను అడ్డుపెట్టి మరి చిన్నారుల ప్రాణాలను కాపాడారు. అప్పుడే పుట్టిన పసి కందులు భూకంపం బారిన పడకుండా వారు ఉన్న ఉయ్యాలలను గట్టిగా పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తైవాన్ లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రత నమోదైంది. ఈ భూకంపం కారణంగా భారీగా ఆస్తి, ప్రాణ నష్టాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ భూకంపం కారణంగా జపాన్ లోని రెండు దీవుల్లో సునామి వచ్చింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందగా వందల మంది గాయాలపాలయ్యారు. భూకంపం దాటికి అతి పెద్ద పేక మేడల వలె నిర్మించిన భవనాలు కుప్పకూలిపోయాయి. కొన్ని వంగిపోయాయి. అయితే ఈ తరుణంలోనే ఓ ఆసక్తికర ఘటన వెలుగుచూసింది. ఓవైపు భారీ భూకంపం సంభవించినా మరోవైపు నర్సులు తమ ప్రాణాలను అడ్డుపెట్టి మరి చిన్నారుల ప్రాణాలను కాపాడారు.


Also Read: ఊళ్లోకి ప్రవేశించిన చిరుత.. దైర్యంగా ఎదురొడ్డి చేతులతో పట్టుకున్న ఫారెస్ట్ ఆఫీసర్

అప్పుడే పుట్టిన పిల్లలు అందరిని ఒకే గదిలో ఉంచారు. అయితే ఒక్కసారిగా భూకంపం సంభవించడంతో మెడలు కూలిపోయే స్థితికి వచ్చాయి. ఈ తరుణంలో రూమ్ లో ఉన్న పిల్లలు ఏమైపోతారో అనే భయంతో నర్సులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయలేదు. వెంటనే పిల్లలు ఉన్న గదుల్లోకి వెళ్లి వారి ఉయ్యాలలను గట్టిగా పట్టుకున్నారు. ఈ తరుణంలో ఇదంతా చూసిన మరో నర్సు కూడా వచ్చి వారికి సహాయపడింది. ఈ ఘటన అంతా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related News

Viral Video: మీరేంట్రా ఇలా ఉన్నారు.. రూ. 10 జిలేబీ కోసం కొట్టుకుంటారా..

Urination: మూత్ర విసర్జన తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..

Viral News: సమస్యపై స్పందించట్లేదని ఓలాపై యువతి వినూత్న నిరసన…

World’s Richest Dog: సింహాసనంపై శునకం.. రూ.3300 కోట్ల ఆస్తికి అధిపతి ఈ కుక్క.. ప్రైవేట్ ప్లేన్, బిఎండబ్ల్యూ కారు ఇంకా ఎన్నో..

Man Extracts 23 Teeth: ఒకేరోజు 23 పళ్లు తీయించుకున్నాడు.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు..!

Viral Video: వెర్రి వేశాలు కాకపోతే.. అసలు బైక్‌తో రైలు ఇంజిన్ ను లాగొచ్చా..

Shocking Video: ఎంతటి అద్భుతం.. గణేషుడికి నమస్కరించి మోదకం తీసుకున్న చిట్టెలుక..

Big Stories

×