2 Men Fight in Metro: ఢిల్లీ మెట్రో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఢిల్లీ పేరు వింటేనే తొలుత అందరికి మైండ్లో మెట్రో గురించే మొదటి ఆలోచన వస్తుంది. అంత ఫేమస్ మరి ఢిల్లీ మెట్రో. కొట్లాటలు, గొడవలు, అసభ్యకరమైన ప్రవర్తన, ష్యాషన్ షో, రొమాన్స్, రీల్స్, వంటి చాలా రకాల సంఘటనలకు ఈ మెట్రో కేరాఫ్ అడ్రస్ అనే అంటారు ఎవరైనా. అయితే ఢిల్లీ మెట్రోలో ఇలాంటి ఘటనలు తరచూ నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి. ఓ ఘటన మరువకముందే మరో ఘటన నెట్టింట హల్ చల్ చేస్తుంది. అయితే తాజాగా బెంగుళూరు మెట్రోలో ఓ ఆసక్తికర ఘటన వెలుగుచూసింది.
తాజాగా బెంగుళూరు మెట్రోకు సంబంధించిన ఓ ఘటన నెట్టింట వైరల్ అవుతోంది. సాధారణంగా ఎక్కడైనా ఆడవాళ్లు కొట్టుకోవడం చూస్తుంటాం. కానీ ఈసారి మెట్రోలో మగాళ్ల మధ్య ఘర్షణ తలెత్తింది. మగాళ్లు ప్రయాణిస్తున్న మెట్రో కంపార్ట్మెంట్ లో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇద్దరు మగవాళ్లు కొట్టుకోవడంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. మెట్రోలో వీరు ఎందుకు కొట్టుకుంటున్నారో కూడా తెలియకుండా ఇష్టం వచ్చినట్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
మెట్రోలో అందరు మగాళ్లు ఉండగానే ఇద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలను అక్కడే ఉన్న మిగతా మగాళ్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీడియోను చూసిన నెటిజన్లు ఢిల్లీ మెట్రో మాదిరి బెంగుళూరు మెట్రో కూడా తయారవుతుందని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Sting Energy Drink Tea: యాక్.. టీలో ఎనర్జీ డ్రింక్.. చూస్తే టీ మీదే విరక్తి పుడుతుంది..
A fight broke out between two passengers inside an overcrowded Metro train in Bengaluru.
BMRCL is reviewing the video & investigating further details@OfficialBMRCL pic.twitter.com/x7uwMVqAfs
— ChristinMathewPhilip (@ChristinMP_) July 9, 2024