Sting Energy Drink Tea: ప్రపంచంలోనే టీ అంటే నచ్చని వారెవరు ఉండరు. అంత ఫేమస్ టీ అంటే. ముఖ్యంగా భారతదేశంలో ప్రతీ ఇంట్లో టీ తాగని వ్యక్తులు ఎవరు ఉండరు. టీలో ఉండే రుచి, సువాసన కారణంగా చాలా ఇష్టంగా తాగుతుంటారు. అందువల్ల దేశంలోని ఏ షాపులో చూసినా కూడా టీ తాగే వారి సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. లెమన్ టీ, గ్రీన్ టీ, అల్లం టీ, ఇలాచీ టీ ఇలా ఎన్నో రకాల టీలు ఉంటాయి. అంతేకాదు కోల్డ్ టీ వంటివి కూడా ఉంటాయి. వీటి కోసం సెపరేట్‌గా షాపులు కూడా ఉంటాయి. అయితే తాజాగా ఓ వ్యక్తి విచిత్రంగా టీ తయారు చేశాడు. ఈ టీ చూస్తే టీ ప్రియులకు వాంతులు అవ్వడం ఖాయం అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి టీని తయారు చేశాడు. టీ తయారు చేసే క్రమంలో ముందుగా పాలు పోశాడు. అనంతరం పంచదార, టీ ఆకులు వేసి బాగా మరిగించి టీ తయారు చేశాడు. అయితే ఇంతటితో టీ తయారయిపోయింది అని అనుకుంటే పొరపాటే. చివరిగా ఆ టీలో ఎనర్జీ డ్రింక్ పోసి కొంతసేపు మరిగించాడు. దీంతో దానిని సర్వ్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే దీనికి సంబంధించిన దృశ్యాలను అక్కడే ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అసలు ఇటువంటి టీని ఎవరైనా తాగుతారా అనిపించేలా తయారు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. అసలు ఇలాంటి టీని ఎవరైనా తాగుతారా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇది టీ కాదని దీనిని తాగితే ప్రాణాలు పోతాయని అంటున్నారు. మరోవైపు టీ తాగాలంటేనే భయం పుట్టించేలా చేశారని మండిపడుతున్నారు.