Viral Video: ప్రస్తుతం ఉన్న యువత ఏదో సాధించాలని ప్రయత్నించడంలో చురుకుగా ఉంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏది సాధించాలన్నా, అందరి దృష్టిని ఆకట్టుకోవాలన్నా కూడా సోషల్ మీడియా అనేది ఓ ఆయుధంగా మారింది. స్మార్ట్ ఫోన్లు లేని మనుషులే ఉన్న పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరి ఫోన్లో సోషల్ మీడియా అకౌంట్లు కూడా ఉంటున్నాయి. చిన్న పిల్లల నుంచి మొదలుకుని ముసలి వాళ్ల వరకు సోషల్ మీడియాలో వీడియోలు చేసేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. వీడియోలు చేసి ఫేమస్ అవ్వాలని, పేరు, డబ్బులు సంపాదించాలని తాపత్రయపడుతున్నారు. ఈ తరుణంలో కొన్ని సార్లు కొంత మంది చేసే పనులు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. ఏదో వినూత్నంగా ప్రయత్నించి ఫేమస్ అవ్వాలని చేసేవి వారిని ప్రమాదంలోకి నెట్టేస్తుంటాయి. అయితే తాజాగా ఓ యువకుడి చేసిన ఓ వెర్రి చేష్టలకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
సాధారణంగానే రైలు ఉండడమే ఎంతో పెద్దగా ఉంటుంది. ఆకారంలోనే కాదు, బరువులోను అసలు మనుషులు కూడా తోయలేనంత బరువుగా ఉంటుంది. అయితే ఓ యువకుడు మాత్రం రైలును కదిలించాలని ప్రయత్నించాడు. అది కూడా ఓ పెద్ద క్రెయిన్ సహాయంతోనో లేక ఓ 1000 మంది వ్యక్తుల సహాయంతోనో అనుకుంటే పొరపాటే. తన వద్ద ఉన్న బైక్ సహాయంతో రైలు ఇంజిన్ ను కదిలించాలని ప్రయత్నించాడు. అసలు ఈ మాట వింటేనే అందరికీ ఇదంతా వెర్రి తనమే అనిపిస్తుంది. కానీ ఆ యువకుడు మాత్రం అసలు ఎలా ఆలోచించి ఈ పని చేశాడో తెలియదు కానీ చేసి చూపించాడు.
ప్రస్తుం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో రైలు పట్టాలపై ఓ రైలు ఆగి ఉంది. అయితే రైలు ఆగి ఉండడం చూసిన ఓ యువకుడు ఓ పెద్ద సాహసం చేసి సోషల్ మీడియాలో ఓవర్ నైట్ స్టార్ అవ్వాలని ప్రయత్నించాడు. తన బైక్ ను తీసుకుని వచ్చి రైలు ఇంజిన్ కు ఓ తాడు కట్టి దానిని తన బండి వెనకాల కట్టాడు. ఇక బండి స్టార్ట్ చేసి రైలు ఇంజిన్ కదిలించాలని చూశాడు. అసలు రైలు ఇంజిన్ కదలడం కాదు కదా, తన బండి మాత్రం రివర్స్ లో కింద పడబోయింది. అయినా కూడా తన ప్రయత్నం మాత్రం ఆపలేదు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీడియోను చూసిన నెటిజన్లు అసలు నిజంగా ఓ వెర్రి తనమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
सहारनपुर
➡रेलवे ट्रैक पर खड़े इंजन को बाइक से खींचने की कोशिश
➡वायरल वीडियो में युवक अजीबोगरीब कारनामा करता दिखा
➡बाइक से युवक ट्रेन के इंजन को खींचने की कोशिश कर रहा
➡रील बनाने के लिए लोग कुछ भी कर गुजरने को तैयार हैं
➡बाइक से रेल का इंजन खींचने का वीडियो हो रहा… pic.twitter.com/wJL8krDTYY
— भारत समाचार | Bharat Samachar (@bstvlive) September 12, 2024