EPAPER
Kirrak Couples Episode 1

70 Lakh Salary Not Enough: 70 లక్షల సాలరీ సరిపోవడం లేదంటున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. వైరల్ అయిన వీడియో

70 Lakh Salary Not Enough: 70 లక్షల సాలరీ సరిపోవడం లేదంటున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. వైరల్ అయిన వీడియో

70 Lakh Salary Not Enough| నిత్యం పెరుగుతున్న ధరలతో సామాన్యులు సతమతమవుతన్నారు. సంపాదన కంటే ఖర్చులు మించిపోతుండడంతో అప్పుల పాలవుతున్నారు. సాధారణంగా ఈ సమస్యలు సామాన్యులు, పేద ప్రజల ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఇటీవల ఒక సోషల్ మీడియా ఛానెల్ లో ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మాట్లాడుతూ.. తనకు రూ.70 లక్షలు జీతం వస్తోందని.. అయితే తనకు సంతృప్తగా లేదని చెప్పాడు. ఖర్చులు బాగా పెరిగిపోవడంతో జీతం సరిపోవడం లేదని తెలిపాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అయిన కొన్ని గంటల్లోనే వైరల్ అయిపోయింది.


వివరాల్లోకి వెళితే.. సాలరీ స్కేల్ అనే ఛానెల్ పలు రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ఇంటర్ వ్యూ చేస్తూ.. వారి సంపాదన గురించి వివరాలతో వీడియోలు చేస్తుంది. ఆ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్ లో పెడుతూ ఉంటుంది. ఇందులో భాగంగానే ఇటీవల కెనెడా దేశంలో పనిచేసే ఒక యువకుడితో మాట్లాడితే అతను సంవత్సరానికి 1,15,000 కెనెడా డాలర్లు సంపాదిస్తున్నట్లు చెప్పాడు. కానీ ఆ సాలరీ తనకు సరిపోవడం లేదని తెలిపాడు.

Also Read: పండుగ రోజు విషాదం.. ఇడ్లీ తిని వ్యక్తి మృతి.. అత్యాశకు పోయి


కెనెడాలోని టొరొంటో నగరంలో నివసిస్తున్న అతని కుటుంబంలో కేవలం ఓ చిన్న పిల్లాడు, ఒక భార్యతో మాత్రమే ఉన్నారు. అయినా అతనికి రూ.70 లక్షలు సరిపోవడం లేదట. ఇన్ఫోసిస్ కంపెనీలో SAP specialist గా ఉద్యోగం చేస్తున్న ఆ యువకుడు మాట్లాడుతూ.. ”టొరొంటో నగరంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ (ఖర్చులు) బాగా పెరిగిపోయింది. నేను నెలకు ఇంటి అద్దె 4000 కెనడా డాలర్లు చెల్లిస్తున్నాను. సంపాదన ఏ మాత్రం సరిపోవడం లేదు.” అని చెప్పాడు.

అతని మాటలను వీడియోగా రికార్డ్ చేసి సాలరీ స్కేల్ ఛానెల్ దానికి కాప్షన్ గా ”లక్ష డాలర్లు సరిపోవట. టొరొంటోలో SAP specialist గా పనిచేస్తున్నఈ సోదరుడు ఏడాదికి 1,15,000 డాలర్లు సంవత్సరానికి సంపాదిస్తున్న సంతృప్తి లేదట” అని పెట్టారు.

ఇన్‌స్టాగ్రామ్ లో ఈ వీడియో క్లిప్ షేర్ చేసిన కొన్ని గంటల్లోనే వైరల్ అయిపోయింది. దీనికి లక్షల్లో వ్యూస్ వేయికి పైగా లైక్స్ వున్నాయి. అయితే ఈ వీడియో టాపిక్ పై నెటిజెన్లు డిబేట్ మొదలుపెట్టారు.

ఒక యూజర్ అయితే.. ”అతను ఒకే కంపెనీలో ఉండకుండా కంపెనీలు మారితే ఎక్కువ జీతం వస్తుంది. అమెరికా లేదా కెనడాలో ఒకే కంపెనీలో సంవత్సరాల తరబడి ఉండిపోతే మంచి సాలరీ లభించదు.” అని కామెంట్ పెట్టాడు.

Also Read: బర్త్‌డే పార్టీకి వెళ్లిన యువతి.. ఆమెను జ్యూస్ తాపించి మరో యువతి ఏం చేసిందంటే

ఇంకొక యూజర్ కామెంట్ చేస్తూ.. ”మానవజాతికి ధనం ఎంత ఉన్నా సంతృప్తి ఉండదు. కెనడా లైఫ్ ని ఎంజాయ్ చేయాలి. ఇండియా కంటే 20 రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో అది చాలా బెటర్” అని రాశాడు.

మరో యూజర్ అతను చెప్పిన కారణాలతో ఏకీభవించాడు. ”నెలకు 3000 డాలర్లు అంటే చాలా ఎక్కువ. నేను కూడా ఇన్ఫోసిస్ కంపెనీలో SAP లైఫ్ సైన్స్ స్పెషలిస్ట్ పనిచేశాను. నన్ను అమెరికా పంపించాలనుకున్నారు. నా స్నేహితులలో చాలామంది అక్కడికి టాన్స్‌ఫర్ అయి ఆ తరువాత కంపెనీ మారిపోయారు” అని కామెంట్ లో తెలిపాడు.

అంతకుముందు మరో వీడియోలో కెనెడాలోనే ఒక ఇండియన్ దంపతులు ఇంటర్‌వ్యూలో పాల్గొన్నారు. వారిద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. సంవత్సరానికి ఇద్దరి ఆదాయం కలిపి 2 లక్షల డాలర్లు (1.2 కోట్లు). వారిద్దరూ కెనెడాలో జీవితం ఎలా ఉంటుంది. మంచి ఉద్యోగం ఎలా సంపాదించాలి అనే విషయాలపై సలహా ఇచ్చారు. భర్త ఒక స్కిల్ ప్రొగ్రామర్ కాగా, అతని భార్య ఒక సపోర్ట్ స్పెషలిస్ట్. ఉద్యోగం చేస్తునే కొత్త టెక్నాలజీ గురించి నేర్చుకుంటూ ఉండాలని అదే వారి హై సాలరీకి రహస్యమని తెలిపారు. హడూప్, క్లౌడ్, సర్టిఫైడ్ స్క్రమ్ మాస్టర్, ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ ప్రొఫెషనల్ లాంటి కోర్సులు చేసిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని సూచించారు.

Related News

Viral Video: నీ ఐడియా అదుర్స్ గురు.. రైలులో సీట్ లేకపోయినా ఎలా పడుకున్నాడో చూస్తే షాక్ అవుతారు

Viral News: ఈ ఊరిలో ఎవరూ ఇంట్లో వంట చేయరు, ఇప్పుడు వరల్డ్ ఫేమస్ అయ్యింది, ఎందుకో తెలుసా?

Sea Robin: నడిచే చేపలను ఎప్పుడైనా చూశారా? లేదంటే ఇప్పుడు చూడండి!

Cat Employees: పిల్లులకు ఉద్యోగం ఇచ్చిన కంపెనీ.. ఆఫీసులో దర్జాగా అవి ఏం చేస్తున్నాయంటే..!

Employee Fired For Not bring Food For Boss: టిఫిన్ తీసుకురాలేదని ఉద్యోగిని తొలగించిన బాస్.. ఆ తరువాత..

Employee Dies On Duty: సిక్ లీవ్ ఇవ్వడానికి నిరాకరించిన బాస్.. ఫ్యాక్టరీలో మరణించిన మహిళా కార్మికురాలు!

Big Stories

×