EPAPER

Fact Check News: అబ్బాయిల కోసం ఎగబడుతున్న మేఘాలయ అమ్మాయిలు.. నిజంగా అంత కరువుతో ఉన్నారా?

Fact Check News:  అబ్బాయిల కోసం ఎగబడుతున్న మేఘాలయ అమ్మాయిలు.. నిజంగా అంత కరువుతో ఉన్నారా?

Meghalaya Fact Check News:  చుట్టూ అమ్మాయిలు.. ఒకే ఒక్క అబ్బాయి. నాకు కావాలంటే, నాకు కావాలంటూ అమ్మాయిల కొట్లాట. వీడియో చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. ఆ వీడియోకు ఇంట్రెస్టింగ్ క్యాప్షన్. “అబ్బాయి నాకు కావాలంటే నాకు కావాలి అని పోటీపడ్డ మహిళలు.. మేఘాలయలోని ఒక గ్రామంలో 100 మంది అమ్మాయిలకు 30 మంది మాత్రమే అబ్బాయిలు ఉన్నారు.  అబ్బాయి కోసం పోటీపడి ఎవరు గెలిస్తే వాళ్ళకి అతడిని ఇచ్చి పెళ్ళి చేస్తారు” అని రాశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ ఈ వీడియోకు, చెప్పిన మ్యాటర్ కు సంబంధం ఉందా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..


అసలు వాస్తవం ఏంటంటే?

మేఘాలయలో అబ్బాయిల కొరత అనే విషయంలో ఏమాత్రం వాస్తవం లేదు. 2024 నివేదికల ప్రకారం ఆ రాష్ట్రంలో అమ్మాయిల సంఖ్య కంటే అబ్బాయిల సంఖ్య ఎక్కువగా ఉంది. ఆ రాష్ట్ర మొత్తం జనాభాలో 100.296 మంది పురుషులకు 100 మంది స్త్రీలు ఉన్నారు.  మేఘాలయలో మొత్తం జనాభా 33 లక్షల 87 వేల మంది ఉండగా, అందులో పురుషులు 16.96 లక్షలు కాగా, స్త్రీలు 16.91 లక్షలు. ఈ లెక్కన చూస్తే అబ్బాయిల కోసం కొట్లాడాల్సిన అవసరం ఆ రాష్ట్ర మహిళలలకు లేకపోవచ్చని స్పష్టంగా అర్థం అవుతున్నాయి.


వీడియోను జాగ్రత్తగా పరిశీలిస్తే ఏం అర్థం అవుతోంది?

ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను చూస్తుంటే, అమ్మాయిలు అంతా ఓ కాల్వలో నిలబడి ఉన్నారు. ఒక అబ్బాయి బట్టలు విప్పి, నీళ్లలో ముంచాలి అనేది వారి ప్లాన్ గా అర్థం అవుతోంది. అంటే, వరుసైన యువకుడితో అక్కడి అమ్మాయిలు సరదాగా ఆడుతున్న ఆటగా అర్థం అవుతోంది. వారి నుంచి తప్పించుకుని పారిపోవడానికి ఆ కుర్రాడు ప్రయత్నిస్తున్నా, ఎక్కువ మంది అమ్మాయిలు ఉండటంతో ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో, ఈ వీడియోను బట్టి చూస్తే అబ్బాయి కోసం జరుగుతున్న కొట్లాట కాదు, కేవలం వాళ్లు సరదాగా ఆడుతున్న ఆట మాత్రమేనని తెలిసిపోతుంది.

అసలు నిజం ఏంటంటే?

సోషల్ మీడియాలో అబ్బాయి కోసం అమ్మాయిలు పోట్లాడుతున్నారు అంటూ జరిగే ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. అధికారిక లెక్కలు, వాస్తవ పరిస్థితులు కూడా అబ్బాయిల కొరత లేదనే చెప్తున్నాయి. ఒక వేళ ఒక గ్రామంలో అబ్బాయిల సంఖ్య తక్కువగా ఉన్నంత మాత్రాన అతడి కోసం అంత ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. చుట్టు పక్కల గ్రామాల్లో కూడా అబ్బాయిల కొరతేమీ ఉండదు కదా.? అలాంటప్పుడు పరిసర గ్రామాల కుర్రాళ్లను పెళ్లిచేసుకోవచ్చు. సో, మొత్తంగా సోషల్ మీడియాలో జరుగుతున్నట్లు అబ్బాయి కోసం అమ్మాయిల కొట్లాట అనే మాటలో ఏమాత్రం వాస్తవం లేదు. జస్ట్ అదంతా అబద్దం అని ఈజీగా చెప్పేయొచ్చు.

Read Also: కొండ మీద ఏనుగు, అమెరికా పోలీసుల రెస్క్యూ ఆపరేషన్.. ఇదీ అసలు సంగతి!

Related News

Shocking Video: అమెరికాను వణికిస్తున్న మిల్టన్.. సుడిగాలిలో చిక్కుకున్న విమానం.. వీడియో వైరల్

Fact Check: కొండ మీద ఏనుగు, అమెరికా పోలీసుల రెస్క్యూ ఆపరేషన్.. ఇదీ అసలు సంగతి!

Kashmiri Teen NEET: బ్రెడ్ అమ్ముతూ జీవనం సాగించాడు.. డాక్టర్ కావాలని కష్టపడి నీట్ టాప్ ర్యాంక్ సాధించాడు

UK Woman Job Offer: జాబ్ కోసం అప్లై చేసిన 48 ఏళ్లకు ఆఫర్ లెటర్, దురదృష్టం లాంటి అదృష్టం అంటే ఇదేనేమో?

Viral video: పులిపై సవారి.. ఏదో చేద్దాం అనుకున్నాడు, చివరికి..

Qantas flight: విమానం స్క్రీన్లలో ‘అలాంటి’ మూవీ, ప్రయాణీకులు షాక్.. ఇంతకీ ఏం జరిగిందంటే?

Big Stories

×