EPAPER

Gold:- బంగారాన్ని బంగారంగానే కొనక్కర్లేదు.. ఈ రూట్లోనూ కొనొచ్చు.. ఏంటా ఆప్షన్స్

Gold:- బంగారాన్ని బంగారంగానే కొనక్కర్లేదు.. ఈ రూట్లోనూ కొనొచ్చు.. ఏంటా ఆప్షన్స్


Gold:- పేపర్ గోల్డ్ తెలుసా. చాలా ఫేమస్ అండ్ సేఫ్. ఈ విధానంలో బంగారం కొంటాం. కానీ, ఫిజికల్ బంగారం కాదు. పేపర్‌లో మాత్రమే బంగారం కొంటాం.. కానీ, దాన్ని మన చేతికి ఇవ్వరు. కాకపోతే, దానిపై వచ్చే రిటర్న్స్ మాత్రం తీసుకోవచ్చు. అదే పేపర్ గోల్డ్.

ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్స్ ఇష్యూ చేస్తుంటుంది. వీటిలో ఇన్వెస్ట్ చేయడం చాలా సేఫ్. బెటర్ రిటర్న్స్ కూడా. బయట షాపుల్లో బంగారం కొంటే.. మంచి బంగారమో కాదో అన్న అనుమానాలు ఉంటాయి. పైగా ఎక్కడ దాచిపెట్టుకోవాలనే భయాలు కూడా. దానికి సొల్యూషన్.. ఈ పసిడి బాండ్స్. ఇందులో పెట్టుబడి పెడితే.. ఏటా 2.5శాతం వడ్డీని  ఆరు నెలలకోసారి చెల్లిస్తారు. టైం పిరియడ్ 8 ఏళ్లు అయినా.. అవసరాన్ని బట్టి ఐదేళ్ల తర్వాత కూడా తీసేసుకోవచ్చు. పైగా వీటిపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కూడా ఉండవు.


ఇక సెకండ్ ఆప్షన్.. గోల్డ్‌ ఎక్స్ఛేంజీ ట్రేడెడ్‌ ఫండ్స్. స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో అందుబాటులో ఉండే వీటిని.. ట్రేడింగ్‌ రోజుల్లో యూనిట్ల వారీగా కొనుక్కోవచ్చు. బంగారానికి మంచి ధర ఉన్నప్పుడు అమ్ముకోవచ్చు. గోల్డ్‌మన్‌శాక్స్‌, క్వాంటమ్‌, హెచ్‌డీఎఫ్‌సీ వంటి సంస్థలు గోల్డ్‌ ఈటీఎఫ్‌ ఫండ్స్ ఆఫర్ చేస్తున్నాయి.

డిజిటల్‌ గోల్డ్‌ అనేది మరో ఆప్షన్. ఈ డిజిటల్ గోల్డ్‌లో పది గ్రాముల బంగారం కొంటారు. కాని, అది డిజిటల్‌గా. మీరు బంగారాన్ని కొన్నట్టు, మీ దగ్గర 10 గ్రాముల బంగారం ఉన్నట్టు వర్చువల్ అకౌంట్లో చూపిస్తుంది. ఇందులో గ్రాముల చొప్పునే బంగారం కొనక్కర్లేదు. సపోజ్ మీ దగ్గర 10వేల రూపాయలు ఉన్నా.. ఆ మొత్తానికి తగ్గ గోల్డ్ మీ అకౌంట్లో వేస్తారు. చివరికి వంద రూపాయలతోనూ గోల్డ్ కొనుక్కోవచ్చు. ఎప్పుడైనా మీ డబ్బును గోల్డ్‌గా మార్చుకోవాలనుకుంటే.. నిజమైన, స్వచ్ఛమైన బంగారాన్ని పంపిస్తారు. వీటికి ఇన్సూరెన్స్ ఉంటుంది.. అవసరమైతే డిజిటల్‌ గోల్డ్‌ ద్వారా లోన్లు కూడా తీసుకోవచ్చు. 

Related News

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Central Cabinet: కేంద్రమంత్రులుగా బండి సంజయ్, కిషన్ రెడ్డి..?

AP CID Raids: వాసుదేవరెడ్డి ఇంటిపై ఏపీ సీఐడీ సోదాలు.. లిస్టులో చాలామంది!

Virat Kohli: న్యూయార్క్‌లో ఐసీసీ అవార్డు అందుకున్న విరాట్ కోహ్లీ

Big Stories

×