EPAPER

World Cup 2023 rules: వరల్డ్ కప్ ఆటగాళ్లకు ఐసీసీ పెట్టిన మూడు నియమాలు

World Cup 2023 rules: వరల్డ్ కప్ ఆటగాళ్లకు ఐసీసీ పెట్టిన మూడు నియమాలు
ICC world cup 2023 latest news

ICC world cup 2023 latest news(Cricket news today telugu):

ఎప్పటినుంచో అందరూ ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న వన్డే ప్రపంచ కప్ 2020 మరొక రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. పైగా ఈసారి ఆతిథ్యం ఇవ్వనున్నది ఇండియా కావడం తో ఈసారి కప్పు ఎలాగైనా మనమే సొంతం చేసుకోవాలని క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు.



అక్టోబర్‌ 5 నుంచి నవంబర్‌ 19 వరకు జరిగే ఈ టోర్నీలకు ఐసీసీ కొత్త రూల్స్ తో ప్లేయర్లకు షాకింగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. జరగబోయే మ్యాచ్లకు గాను సరికొత్తగా మూడు నిబంధన లను ప్లేయర్ల కోసం సిద్ధం చేసింది.ఈ నిబంధనలు ఏమిటో ఓ లుక్కేద్దాం పదండి…

నో సాఫ్ట్‌ సిగ్నల్‌ రూల్‌


క్రికెట్ మ్యాచ్ రూల్స్ అన్నిటిలోనూ ఎంతో వివాదాస్పదంగా ఉన్నటువంటి ఈ నో సాఫ్ట్ సిగ్నల్ రూపికపై ఉండదు. అసలు నో సాఫ్ట్ సిగ్నల్ రూల్…అంటే ఆట సమయంలో ఏదైనా క్యాచ్ విషయంలో అంపైర్ డెసిషన్ పై అనుమానం వస్తే థర్డ్ ఎంపైర్ ను సంప్రదించినప్పటికీ అతను తిరిగి ఎంపైర్ తో మాట్లాడిన తర్వాతే అతని డిసిషన్ చెబుతాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ థర్డ్ ఎంపైర్ వికెట్ సరిగ్గా పరిశీలించ లేని పక్షంలో అంపైర్‌ దే తుది నిర్ణయం అవుతుంది. అయితే ముందు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వివాదాస్పదం కావడంతో.. దీన్ని రద్దు చేస్తూ , ఫుటేజ్‌ ఆధారంగా నిర్ణయం తీసుకునే విధంగా మార్పులు చేశారు.

బౌండరీ కౌంట్‌ రూల్‌.. ఔట్

2019 ప్రపంచకప్‌ లో ఈ బౌండరీ కౌంట్‌ రూల్‌ ఆధారంగా న్యూజిలాండ్ మరియు ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ను విజేతగా ప్రకటించడం జరిగింది. దీని ప్రకారం ఎప్పుడైనా మ్యాచ్ టై అయినప్పుడు సూపర్ ఓవర్ ఉంటుంది. ఒకవేళ సూపర్ ఓవర్ కూడా టై ఐన పక్షంలో.. బౌండరీ కౌంట్ ఆధారంగా విజేతను డిసైడ్ చేస్తారు.

అంటే బౌండరీ కౌంట్‌ రూల్‌ ప్రకారం మెయిన్ మ్యాచ్, సూపర్ ఓవర్ అన్నిటిలో కలుపుకొని ఏ జట్టు అయితే అత్యధిక బౌండరీలు తన ఖాతాలో వేసుకుంటూ ఆ జట్టును విజేతగా ప్రకటించడం జరుగుతుంది. అయితే జరగబోయే ప్రపంచ కప్ లో ఇక ఇలాంటి బౌండరీ కౌంటులకు చోటు లేదు… విన్నర్ ఎవరో డిసైడ్ అయ్యే వరకు సూపర్ ఓవర్లు ఆడక తప్పదు.

70 మీటర్ల బౌండరీ

ఐసీసీ ఈసారి జరగబోయే ప్రపంచ కప్ మ్యాచులకు గాను తొలిసారిగా స్టేడియంలోని బౌండరీ లెంగ్త్ పై దృష్టి సారించింది. ఐసీసీ కొత్త నిబంధన ప్రకారం స్టేడియం బౌండరీ పరిధి 70 మీటర్ల కంటే తగ్గకూడదు. బౌండరీ కొలతలను పెంచడంతోపాటు జరగబోయే ఈవెంట్ కోసం ఐసిసి పిచ్ పై ఎక్కువగా గడ్డిని కూడా వదిలించే విధంగా
పిచ్ క్యూరేటర్‌లకు ఆదేశాలు జారీ చేసింది. గత కొద్ది కాలంగా క్రికెట్ కేవలం బ్యాటర్ గేమ్ గా పేరు పొందుతుంది.. అందుకే జరగబోయే మ్యాచ్లలో బ్యాటింగ్ మరియు బౌలింగ్ మధ్య సమతుల్యతను మెయింటైన్ చేయడం కోసం ఐసిసి ఈ ప్రోటోకాల్ ను రూపొందించినట్లు తెలుస్తుంది. మొత్తానికి ఈ నియమం కారణంగా రాబోయే మ్యాచ్లు మరింత రంజుగా ఉంటాయి.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×