EPAPER

Wooden Citroen 2cv : రూ.1.85 కోట్లకు అమ్ముడుపోయిన చెక్క కారు.. ప్రత్యేకత ఏంటంటే..?

Wooden Citroen 2cv : రూ.1.85 కోట్లకు అమ్ముడుపోయిన చెక్క కారు.. ప్రత్యేకత ఏంటంటే..?

Wooden Citroen 2cv : మిగతా రంగాల్లోని కస్టమర్లతో పోలిస్తే ఆటోమొబైల్ రంగంలోని కస్టమర్లు మరింత నిర్దిష్టంగా ఉంటారు. తమకు కావాల్సిన వాహనం, డిజైన్.. ఇలా అన్ని విషయాలు పర్ఫెక్ట్‌గా ఉండాలని అనుకుంటారు. అందులో కొందరు కస్టమర్లు అయితే ఆటోమొబైల్ రంగానికే ఫ్యాన్స్ అయ్యింటారు. అందుకే ఇండస్ట్రీలో నిపుణులకు ఎంత అవగాహన ఉంటుందో.. వారికి కూడా అంతే అవగాహన ఉంటుంది. అలాంటి వారు ఒక్కొక్కసారి కొన్ని కోట్లు పెట్టి కారు కొనడానికి కూడా వెనకాడరు. దానికి ఇదే ఉదాహరణ.


ప్రస్తుతం ఆటోమొబైల్ రంగం కూడా ఎక్కువగా టెక్నాలజీ పైనే ఆధారపడుతోంది. కంపెనీల మధ్య పెరుగుతున్న పోటీని తట్టుకోవడానికి సంస్థలు ఇలా చేయాల్సి వస్తోంది. అందుకే కస్టమర్లలో అభిప్రాయాలు, అభిరుచుల్లో కూడా మార్పులు వచ్చాయి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ డిజైన్, మోడల్ కోసమే వారు ఎదురుచూస్తున్నారు. కానీ అందరు వాహన ప్రియులు అలా ఉండకపోవచ్చు. కొందరికి వెరైటీగా, డిఫరెంట్‌గా ఉండే వస్తువులు అంటే ఇష్టం. అంటే యాంటిక్ పీస్ అనమాట. అదే విధంగా వెరైటీ కార్లను ఇష్టపడే వారు ఉంటారు.

తాజాగా చెక్కతో తయారు చేసిన కారు ఒకటి వేలంలోకి వచ్చింది. ఆ చెక్క కారును దక్కించుకోవడం కోసం ఒక వ్యక్తి ఏ మాత్రం ఆలోచించకుండా కోట్లు కుమ్మరించాడు. ఫ్రాన్స్ కు చెందిన మిచెల్ రాబిలార్డ్ అనే వ్యక్తి చెక్కతో ఒక కారును తయారు చేశాడు. ఈ కారు పేరు సిట్రోయెన్ 2 సీవీ. తాజాగా ఈ కారు కోసం ఫ్రాన్స్ సెంట్రల్ సిటీ ఆఫ్ టూర్స్‌లో వేలంపాట నిర్వహించారు. ఈ వేలంలో కారు ధర 2.1 లక్షల యూరోలు పలికింది. అంటే ఏకంగా రూ.1.85 కోట్లు. ఈ కారు కోసం అంత ఖర్చు పెట్టిన వ్యక్తి పేరు జీన్ పాల్ ఫావాండ్.


ఈ కారులో అంత ప్రత్యేకత ఏముంది అంటే ఇది పూర్తిగా నాణ్యమైన చెక్కతో తయారు చేశారట. వివిధ రకాల చెట్ల కలపను తీసుకొని దీనిని తయారు చేసినట్టు తెలుస్తోంది. దీనిని తయారు చేసిన మిచెల్ రాబిలార్డ్.. దీనికోసం అయిదేళ్లు కష్టపడ్డాడు. ప్రస్తుతం ఈ కారును సొంతం చేసుకున్న జీన్ పాల్ ఫావాండ్.. పారిస్‌లోని మ్యూజియం ఆఫ్ వింటేజ్ పెయిర్ గ్రౌండ్ అట్రాక్షన్‌కు యజమాని. ఈ మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టడం కోసమే తను ఈ కారును దక్కించుకున్నట్టు సమాచారం. అంతే కాకుండా ఇదే విధంగా మరో కారును తయారు చేయాలని ఫావాండ్ భావిస్తున్నారట.

Related News

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Central Cabinet: కేంద్రమంత్రులుగా బండి సంజయ్, కిషన్ రెడ్డి..?

AP CID Raids: వాసుదేవరెడ్డి ఇంటిపై ఏపీ సీఐడీ సోదాలు.. లిస్టులో చాలామంది!

Virat Kohli: న్యూయార్క్‌లో ఐసీసీ అవార్డు అందుకున్న విరాట్ కోహ్లీ

Big Stories

×