EPAPER

Types of Shares : ఆ షేర్లతో లాభాలే లాభాలు..!

Types of Shares : ఆ షేర్లతో లాభాలే లాభాలు..!

Types of Shares : షేర్లు కొనాలనే ఆసక్తి చాలామందికి ఉంటుంది. కానీ.. అవగాహన లేక మానేసేవారు కొందరైతే.. పరిమిత జ్ఞానంతో షేర్లు కొని లాస్ అయ్యే వారూ ఉంటారు. ఇలాంటి వారి కోసం.. మార్కెట్ నిపుణులు చెబుతున్న కొన్ని సూత్రాలు.. మీకోసం.


రూల్ 1: కొన్న షేరును ఎక్కువకాలం అమ్మకుండా ఉంచాలి. అలాగే మార్కెట్ పడిపోయినప్పుడు.. చౌకగా వచ్చిన మంచి కంపెనీల షేర్లు టక్కున కొనే ఒడుపుండాలి. మంచి కంపెనీల షేర్ విలువ ఈ రోజు కాకున్నా.. రేపటికైనా పెరిగే అవకాశం ఉంటుంది.

రూల్ 2: కంపెనీ లాభాన్ని వాటాదారులకు సమానంగా పంచితే ఒక్కో షేరుకు వచ్చే మొత్తాన్నే.. ఈపీఎస్ అంటారు. షేర్ ఈపీఎస్ పదేళ్లలో ఎంత పెరిగిందో చూసి, వృద్ధి నిలకడగా ఉన్న షేర్లు కొనాలి.


రూల్ 3: మార్కెట్లో ఇటీవలే లిస్ట్ అయిన గొప్ప చరిత్ర ఉన్న కంపెనీల్లోనూ ఓనర్స్ ఎక్కువ పెట్టుబడి పెట్టరు. కనుక ఇలాంటివి ఓ 5 ఏళ్ల తర్వాతే కొనటం మంచిది.

రూల్ 4: పోటీ లేని, మార్కెట్‌ను శాసించే షేర్లను ధైర్యంగా కొనొచ్చు. ఇవి రిస్క్‌ను తట్టుకోగలవు.

రూల్ 5: కొత్తగా మార్కెట్లోకి వచ్చిన పండ్లరసాల సంస్థ షేర్ల కంటే ఐటీసీ వంటి మార్కెట్ దిగ్గజాల షేర్లు మంచివి. ఐటీసీకి సిగరెట్లతోబాటు కిరాణా, దుస్తులు పలు వ్యాపారాలున్నాయి. అంటే.. రోజూ ఆదాయం ఉన్న, చరిత్ర ఉన్న కంపెనీ కనుక రిస్క్ ఛాన్స్ తక్కువ.

రూల్ 6: మూలధనం కంటే లోన్స్ ఎక్కువ ఉన్న కంపెనీల షేర్ల జోలికి పోవద్దు. ఈ సంస్థల లాభం వడ్డీలకే సరిపోతుంది. కనుక లాభం పెద్దగా ఉండదు. తక్కువ లోన్స్ ఉన్న కంపెనీ షేరునే ఎంచుకోవాలి.

రూల్ 7: అధిక పోటీ ఉండే టెలికాం, ఎయిర్‌లైన్స్ వంటి రంగాల కంపెనీల్లో లాభాలు తక్కువ కనుక అలాంటి షేర్లకు దూరంగా ఉండాలి.

రూల్ 8: షేర్‌ను సరైన టైంలో కొనటం, అమ్మటం ముఖ్యం. ఇక్కడ అత్యాశ పనికిరాదు.హైప్ చూసి కొనటం, అమ్మటం అసలే వద్దు. చివరగా.. వారెన్ బఫెట్ చెప్పినట్లు.. జనం భయపడి వదిలేసినప్పడు.. వీలున్నన్ని షేర్లు కొనాలి. ఇతరులు ఆసక్తిగా ఉన్నప్పుడు వాటిని టక్కున అమ్మాలి.

Related News

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Central Cabinet: కేంద్రమంత్రులుగా బండి సంజయ్, కిషన్ రెడ్డి..?

AP CID Raids: వాసుదేవరెడ్డి ఇంటిపై ఏపీ సీఐడీ సోదాలు.. లిస్టులో చాలామంది!

Virat Kohli: న్యూయార్క్‌లో ఐసీసీ అవార్డు అందుకున్న విరాట్ కోహ్లీ

Big Stories

×