EPAPER

Mobiles : అమ్మకాల్లో ఆ ఫోన్లే అదుర్స్..

Mobiles : అమ్మకాల్లో ఆ ఫోన్లే అదుర్స్..
mobile

Mobiles : ప్రపంచవ్యాప్తంగా 693 కోట్ల మంది మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నారు. అంటే ప్రపంచ జనాభాలో 85.74% మంది చేతుల్లోకి అవి చేరాయి. మరి ఏ ఏ కంపెనీల ఫోన్లను అధికంగా కొనుగోలు చేశారనే అంశంపై టెక్ ఎనలిస్ట్ సంస్థ ఓమ్డియా లెక్కలు తేల్చింది.


నోకియా 1100 మొబైల్ ఫోన్లు ఆల్‌టైమ్ రికార్డు సాధించాయి. 2009లో వాటి తయారీ నిలిపివేతకు ముందు ఆరేళ్లలో ఏకంగా 250 మిలియన్ల యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇక నోకియా 1110 మొబైల్ ఫోన్లు 248 మిలియన్ల యూనిట్లు విక్రయించారు. ఐఫోన్6, ఐఫోన్ 6 ప్లస్ ఫోన్లు మూడో స్థానంలో నిలిచాయి. 222 మిలియన్ల మంది వాటిని కొనుగోలు చేశారు. యాపిల్ ఫోన్ల చరిత్రలో అత్యధికంగా అమ్ముడైనవి అవే.

అమ్మకాల్లో తర్వాతి 17 ర్యాంక్‌లు నోకియా-ఐఫోన్లకే దక్కాయి. శాంసంగ్ ఈ1100 మొబైల్, మోటరోలా రేజర్ వీ3 మాత్రమే 11, 17వ స్థానాలను దక్కించుకున్నాయి. తొలుత యూరప్ లో, అటుపై ఆసియాలో టెలికాం మార్కెట్ డీరెగ్యులేషన్ జరిగింది. కొత్త అవకాశాలను చేజిక్కించుకోవడంలో నోకియా విఫలమైనా.. యాపిల్, గూగుల్, శాంసంగ్ మాత్రం దుమ్మురేపాయి.


అలాగే యాపిల్ .. పర్సనల్ కంప్యూటింగ్ నుంచి మొబైల్ ఫోన్లకు తన కోర్ బిజినెస్‌ని మార్పు చేసుకోగలిగింది. 2009లో యాపిల్ రెవెన్యూలో 25% ఐఫోన్ అమ్మకాల ద్వారానే లభించింది. నిరుడు యాపిల్ 383 బిలియన్ డాలర్ల ఆదాయంలో సగం మొబైల్ ఫోన్లదే అంటే అర్థం చేసుకోవచ్చు.

2023లో 31 మిలియన్ల యూనిట్లు అమ్ముడుపోయిన ఐఫోన్ 14 ప్రో మాక్స్ బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది.
తొలి నాలుగు స్థానాలను ఐఫోన్ల అమ్మకాలే భర్తీ చేశాయి. 20 మిలియన్ల యూనిట్ల అమ్మకాలతో గేలక్సీ ఏ14 మొబైల్ ఫోన్లు ఐదో స్థానంలో నిలిచాయి. 11 మిలియన్ల అమ్మకాలతో రెడ్‌మీ 12సీ మొబైల్ ఫోన్లు పదో స్థానానికి పరిమితమయ్యాయి.

Related News

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Central Cabinet: కేంద్రమంత్రులుగా బండి సంజయ్, కిషన్ రెడ్డి..?

AP CID Raids: వాసుదేవరెడ్డి ఇంటిపై ఏపీ సీఐడీ సోదాలు.. లిస్టులో చాలామంది!

Virat Kohli: న్యూయార్క్‌లో ఐసీసీ అవార్డు అందుకున్న విరాట్ కోహ్లీ

Big Stories

×