EPAPER
Kirrak Couples Episode 1

Maruti Cars:- కార్లు అంటే మారుతినే.. మరి మారుతిలో ఏ బ్రాండ్‌ హైయెస్ట్ సేల్స్?

Maruti Cars:- కార్లు అంటే మారుతినే.. మరి మారుతిలో ఏ బ్రాండ్‌ హైయెస్ట్ సేల్స్?

Maruti Cars:- దేశంలో అమ్ముడవుతున్న కార్లలో మారుతి బ్రాండ్‌దే హవా. ఇప్పుడే కాదు.. ఏనాడూ మారుతి సేల్స్‌ను ఏ కంపెనీ బ్రేక్ చేసిందే లేదు. ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్‌ను దింపుతూ.. ప్రత్యర్ధులకు పోటీ ఇస్తూనే ఉంది మారుతి. పైగా కొత్తగా రిలీజ్ చేస్తున్న మోడల్స్‌లో దాదాపు అన్నీ సక్సెస్ అవుతున్నాయి. పైగా మారుతి అనే బ్రాండ్ ఎలాగూ ఉండనే ఉంది. దీంతో మెజారిటీ కస్టమర్లు మారుతి బ్రాండ్‌నే ఎంచుకుంటున్నారు.


కార్ల సేల్స్‌లో టాప్-10 బ్రాండ్లు తీస్తే.. అందులో హ్యుందాయ్ క్రెటా, టాటా మోటార్స్ పంచ్, నెక్సాన్ మినహా మిగతావన్నీ మారుతి సుజుకి కార్లే.  అంటే.. గ‌త నెల‌లో జ‌రిగిన టాప్‌-10 కార్ల సేల్స్‌లో ఏడు మారుతి సుజుకి మోడ‌ల్ కార్లే.

గతంలో టాటా మోటార్స్ నెక్సాన్‌, పంచ్ మోడ‌ల్ కార్లు టాప్‌లో ఉండేవి. ఇప్పుడు వాటిని ప‌క్క‌కు నెట్టేసి మారుతి సుజుకి గ్రాండ్ విటారా వ‌చ్చింది. గ‌తేడాది మార్చిలో ఐదో స్థానంలో ఉన్న మారుతి సుజుకి స్విఫ్ట్.. మార్చిలో 28.8 శాతం వృద్ధితో మొద‌టి స్థానానికి చేరింది. గ‌తేడాది టాప్‌లో ఉన్న వాగ‌న్‌-ఆర్.. ఈ ఏడాది సెకండ్ ప్లేస్ కి వచ్చింది.

గ‌తేడాది టాటా నెక్సాన్, టాటా పంచ్‌లదే పాపులారిటీ. కాని, ఈ ఏడాది మార్చిలో మాత్రం టాప్‌-10 జాబితాలో నెక్సాన్ ఐదో స్థానానికి, పంచ్ తొమ్మిదో స్థానానికి ప‌డిపోయాయి. ఇక హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ మోడ‌ల్ స్థానాన్ని టాటా పంచ్ రీప్లేస్ చేసింది.


ఇక మారుతి సుజుకి ఎస్‌యూవీ వేరియంట్ బాలెనో అమ్మకాలు పెరిగాయి. బ్రెజా మోడ‌ల్ సేల్స్ 30.45 శాతం వృద్ధి చెంద‌డంతోపాటు టాప్‌-10లో మూడో స్థానానికి చేరుకుంది. డిజైర్ మోడ‌ల్ కార్ల సేల్స్ మాత్రం భారీగా ప‌డిపోయాయి.

హ్యుందాయ్ క్రెటా ఎప్పటిలాగే క్రేజ్ పెంచుకుంటోంది. ఇక కియా మోటార్స్ సెల్టోస్, స్కోడా కుషాక్ మోడ‌ల్ కార్ల‌తో పోటీ ప‌డిన మారుతి సుజుకి గ్రాండ్ విటారా ప‌దో స్థానంలో నిలిచాయి. 

Related News

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Central Cabinet: కేంద్రమంత్రులుగా బండి సంజయ్, కిషన్ రెడ్డి..?

AP CID Raids: వాసుదేవరెడ్డి ఇంటిపై ఏపీ సీఐడీ సోదాలు.. లిస్టులో చాలామంది!

Virat Kohli: న్యూయార్క్‌లో ఐసీసీ అవార్డు అందుకున్న విరాట్ కోహ్లీ

Big Stories

×