EPAPER

Factory Outlet Sales: ఫ్యాక్టరీ ఔట్‌లెట్ సేల్స్.. లాభాల వెనుక రహస్యం ఇదేనా..!

Factory Outlet Sales: ఫ్యాక్టరీ ఔట్‌లెట్ సేల్స్.. లాభాల వెనుక రహస్యం ఇదేనా..!

Factory Outlet Sales: బ్రాండెడ్ ఉత్పత్తులు అంటే.. అందరికీ ఇష్టమే. కానీ.. వాటి ధరల మూలంగా కొందరే వాటిని కొనగలరు. అయితే, చాలా బ్రాండెడ్ కంపెనీలు ఫ్యాక్టరీ ఔట్‌లెట్ల పేరుతో భారీ డిస్కౌంట్లతో తమ ఉత్పత్తులను అమ్ముతుంటాయి. మరి ‘అంత చౌకగా ఉత్పత్తులు అమ్మితే నష్టం రాదా’ అనే అనుమానం చాలామందిలో ఉంది. అసలు వీళ్ల వ్యాపార రహస్యం ఏమిటి? ఇలా అమ్ముతూ కూడా వీళ్లెలా లాభాలు పొందుతున్నారో తెలుసుకుందాం.


స్టాక్ క్లియరెన్స్
మార్కెట్లో రోజూ కొత్త బ్రాండ్ల దుస్తులు వస్తుంటాయి. కనుక, ఎప్పటికప్పుడు పాత స్టాకును వదిలించుకుని కొత్త స్టాకుతో ముందుకు రాకుంటే కస్టమర్లు దూరం అయిపోతారు. దీంతో భారీ డిస్కౌంట్‌తో స్పెషల్ సేల్స్‌లో పాత స్టాకును అమ్మేస్తాయి. దీనివల్ల లాభం రాకున్నా.. ఆయా ఉత్పత్తుల మేకింగ్ చార్జీలు తిరిగొస్తాయి. నష్టభయం అయితే ఉండదు.

లోపాల ఉత్పత్తులు
క్వాలిటీ లేని ప్రోడక్ట్స్‌ను పేరున్న ఔట్‌లెట్స్ అమ్మవు. దీంతో ఏదొక రేటును ఆ సరకును వదిలించుకోక తప్పదు. ఉదా.. దుస్తులైతే లూజ్ థ్రెడ్, వాషింగ్ ఇన్‌స్ట్రక్షన్స్, సైజుట్యాగ్‌లు, స్టైల్ టైప్ ట్యాగ్‌ లోపాల వల్ల పక్కన బెట్టాల్సిందే. ఇవన్నీ డిస్కౌంట్ పేరుతో ఫ్యాక్టరీ ఔట్‌లెట్స్‌లో సేల్‌కి వస్తాయి.


డిజైన్‌లో మార్పులు
స్టోర్‌లోని దుస్తులన్నీ ఒకేలా కనిపించినా.. నిజానికి వాటి థ్రెడ్ వర్క్‌లో, కలర్ షేడ్స్‌లో తేడాలుంటాయి. చిన్న లోపమైనా సరే.. వాటిని తక్కువ ధరకు అమ్మాలి. అందుకే, వాటిని ఫ్యాక్టరీ ఔట్‌లెట్స్‌కు పంపిస్తారు.

ఓవర్ సప్లయ్
పెద్దమొత్తంలో ఆర్డర్ ఇవ్వటం లేదా తయారీదారులు ఎక్కువగా తయారుచేసినప్పడు .. వీటిని తిరిగి రిటన్ పంపటానికి లేదా గోడౌన్లలో నిల్వచేయటానికి బోలెడంత ఖర్చవుతుంది. దీంతో ఈ ఉత్పత్తులను ఫ్యాక్టరీ ఔట్‌లెట్స్‌‌లో సేల్‌కి పెట్టి ఆఫర్ మీద అమ్మేస్తారు.

ఆర్డర్లు క్యాన్సిల్ కావడం
ఆన్‌లైన్ కస్టమర్లు రిటర్న్ చేసిన ఉత్పత్తులను ఔట్‌లెట్స్ యజమానులు అమ్మరు గనుక.. అవీ ఫ్యాక్టరీ ఔట్‌లెట్స్‌కు చేరతాయి. ఇవన్నీ తెలిశాక.. ఫ్యాక్టరీ ఔట్‌లెట్ల అమ్మకాల వెనక ఉన్న అసలు సంగతి అర్థమై ఉంటుంది. కనుక.. అక్కడి సేల్‌లో చౌకగా వస్తున్నాయని దుస్తులు కొనేముందు వాటి నాణ్యతను జాగ్రత్తగా పరిశీలించి తీసుకోవటం మంచిది.

Related News

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Central Cabinet: కేంద్రమంత్రులుగా బండి సంజయ్, కిషన్ రెడ్డి..?

AP CID Raids: వాసుదేవరెడ్డి ఇంటిపై ఏపీ సీఐడీ సోదాలు.. లిస్టులో చాలామంది!

Virat Kohli: న్యూయార్క్‌లో ఐసీసీ అవార్డు అందుకున్న విరాట్ కోహ్లీ

Big Stories

×