EPAPER

Post Office:- 35 లక్షలు కావాలా.. నెలకు రూ.1500 చొప్పున పెట్టుబడి పెట్టినా చాలు

Post Office:- 35 లక్షలు కావాలా.. నెలకు రూ.1500 చొప్పున పెట్టుబడి పెట్టినా చాలు


Post Office:- పోస్టాఫీస్ స్కీమ్స్ అంటే.. చాలా మందికి తెలిసింది ఫిక్స్డ్ డిపాజిట్లు, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ అకౌంట్లు మాత్రమే. కాని, గ్రామ సురక్ష పథకం ఒకటి ఉందని తెలుసా. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా 30 లక్షల రూపాయల నుంచి 35 లక్షల రూపాయల వరకు సంపాదించొచ్చు. పైగా అతి తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో. నెలకు 1500 రూపాయలు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. కాకపోతే.. నెలకు 1500 మాత్రమే పెట్టుబడి పెడుతూ.. 35 లక్షల రూపాయలు చేతికి అందాలి అంటే..అంతే ఓర్పు కూడా కావాలి. అంటే దీనర్థం, దాదాపు రిటైర్మెంట్ వయసుకు వచ్చాకనే ఇంత అమౌంట్ చేతికి అందుతుందని తెలుసుకోవాలి. ఇది కూడా ఒకవిధంగా మంచి లాభమే. ఎందుకంటే.. నెలకు 1500 కట్టడం అంటే నథింగ్. అసలు మీరు పెట్టుబడి పెడుతున్నారన్న విషయమే మరిచిపోతారు. లైఫ్ అలా సాగిపోతూనే ఉంటుంది. మీకు 55 ఏళ్లు దాటిన తరువాత ఈ అమౌంట్ మీ చేతికి వచ్చినప్పుడు ఆ ఆనందమే వేరు.

18 ఏళ్లు దాటిన వాళ్లంతా ఈ గ్రామ సురక్ష పథకానికి అర్హులే. నిజానికి 19 ఏళ్ల వయసు నుంచే ఇన్వెస్ట్ చేయడం మంచిది. మీకు 55 ఏళ్ల వచ్చిన తరువాత మెచ్యూరిటీ తీరుతుంది. కావాలనుకుంటే.. 58 ఏళ్లు, 60 ఏళ్ల వయసులో మెచ్యూరిటీ తీరేలా పథకాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు కూడా. కాకపోతే ఈ పథకం కింద సంవత్సరానికి కనీసం 10 వేల రూపాయలు పెట్టుబడి పెట్టాలి. దీనికి గరిష్ట బీమా మొత్తం 10 లక్షల రూపాయలు. ప్రీమియం చెల్లింపులను నెలవారీగా లేదా మూడు నెలలకోసారి లేదా ఆరు నెలలకు ఒకసారి.. లేదంటే ఏడాది మొత్తాన్ని ఒకేసారి కట్టొచ్చు. ప్రీమియం చెల్లించడానికి 30 రోజుల గ్రేస్ పీరియడ్ కూడా ఉంటుంది. ఎప్పుడైనా లోన్ కావాలన్నా కూడా గ్రామ సురక్ష పథకం కింద తీసుకోవచ్చు. ఈ పథకం మొదలు పెట్టిన తరువాత వద్దు అనుకుంటే.. మూడేళ్ల తర్వాత రీడీమ్ చేసుకోవచ్చు. కాని ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి. మెచ్యూరిటీకి ముందే పథకాన్ని రద్దు చేస్తే, ఎలాంటి ప్రయోజనం ఉండదు.


ఎవరైనా సరే 55 సంవత్సరాల వరకు పెట్టుబడి పెడితే నెలవారీ ప్రీమియం 1515 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అదే 58 సంవత్సరాల మెచ్యూరిటీతో పాలసీ తీసుకుంటే నెలకు 1463 రూపాయల ప్రీమియం కట్టాలి. 60 ఏళ్ల పాటు పాలసీని కొనుగోలు చేస్తే ప్రీమియం 1411 అవుతుంది. 55 ఏళ్ల పాలసీకి 31.60 లక్షలు, 58 ఏళ్ల పాలసీకి 33.40 లక్షలు, 60 ఏళ్ల పాలసీకి 34.60 లక్షలు మీ చేతికి అందుతాయి. 

Related News

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Central Cabinet: కేంద్రమంత్రులుగా బండి సంజయ్, కిషన్ రెడ్డి..?

AP CID Raids: వాసుదేవరెడ్డి ఇంటిపై ఏపీ సీఐడీ సోదాలు.. లిస్టులో చాలామంది!

Virat Kohli: న్యూయార్క్‌లో ఐసీసీ అవార్డు అందుకున్న విరాట్ కోహ్లీ

×