EPAPER

Solar AC:- ఏసీలు పెట్టించుకోనిది బిల్లుకు భయపడే.. ఇలా చేస్తే 25 ఏళ్లు కరెంట్ బిల్లే కట్టక్కర్లేదు

Solar AC:- ఏసీలు పెట్టించుకోనిది బిల్లుకు భయపడే.. ఇలా చేస్తే 25 ఏళ్లు కరెంట్ బిల్లే కట్టక్కర్లేదు

Solar AC:- ఎండలు మండిపోతున్నాయి. ఎండాకాలం అయిపోయినా.. దాదాపు సెప్టెంబర్ వరకు ఎండలు దంచుతూనే ఉంటాయి. ఇప్పుడు ఎల్‌నినో కూడా రాబోతోందనే అంచనాలున్నాయి. అంటే.. వర్షాలు తక్కువగా పడొచ్చు. సో, ఈ పరిస్థితుల్లో ఫ్యాన్లు, కూలర్లు పనిచేయవు. ఏసీలు ఫిట్ చేసుకోవాల్సిందే. అయితే, చాలా మంది ఏసీలు పెట్టించుకోకపోవడానికి ప్రధాన కారణం.. కరెంట్ బిల్లుకు భయపడే. మెయింటనెన్స్ ఖర్చుల గురించి తరువాత.. ముందు నెలనెలా బిల్లు వేలల్లో వస్తుందని భయపడుతుంటారు. అలాంటి భయాలకు చెక్ పెట్టేసి సోలార్ ఏసీ.


ఇప్పుడు మార్కెట్లోకి సోలార్ ఏసీలు వస్తున్నాయి. ఏసీలు కొనకపోవడానికి ప్రధాన కారణం కరెంట్ బిల్లేనని ఆలోచించిన కంపెనీలు.. సోలార్ మోడల్స్ తీసుకొస్తున్నాయి. సోలార్ ACతో కరెంట్ బిల్లుల గురించి అస్సలు భయపడక్కర్లేదంటున్నాయి కంపెనీలు. ఈ మోడల్స్‌లో 0.8 టన్ను, 1 టన్ను, 1.5 టన్ను, 2 టన్నుల వరకు విండ్ అండ్ స్ప్లిట్ సోలార్ ACలు మార్కెట్‌లోకి తీసుకొచ్చాయి.

కరెంట్‌తో నడిచే ఏసీని రోజుకు 15 గంటల పాటు వాడితే.. రోజుకు 20 యూనిట్లు కాలుతుంది. అంటే ఒక నెలకు 600 యూనిట్లు. కరెంట్ బిల్లు ఈజీగా 5వేల రూపాయలు వస్తుంది. అదే, సోలార్ ఏసీ అయితే.. కరెంట్ బిల్లు రూపాయి కూడా కట్టక్కర్లేదు. అంటే.. సోలార్ ఏసీ ఫిట్ చేసుకుంటే.. నెలకు  5 వేల వరకు సేవ్ చేసినట్టే. పైగా ఏసీ మెయింటనెన్స్ కూడా తక్కువే. పైగా ఒక్కసారి సోలార్ ఏసీ ఎంపిక చేసుకుంటే. 5 ఏళ్ల నుంచి 25 ఏళ్ల పాటు పనిచేస్తాయి. కాకపోతే, ఈ సోలార్ ఏసీల స్టార్టింగ్ ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. 1 టన్ను సోలార్ ఏసీ ధర లక్ష వరకు ఉండగా.. 1.5 టన్ను కోసం 2 లక్షల వరకు చెల్లించాల్సి ఉంది. కాని, వన్ టైం ఇన్వెస్ట్ చేస్తే 25 ఏళ్ల పాటు కరెంట్ బిల్లు కట్టక్కర్లేదు. ఆ విధంగా చూసుకుంటే.. ఇవి బెటరే. 


Related News

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Central Cabinet: కేంద్రమంత్రులుగా బండి సంజయ్, కిషన్ రెడ్డి..?

AP CID Raids: వాసుదేవరెడ్డి ఇంటిపై ఏపీ సీఐడీ సోదాలు.. లిస్టులో చాలామంది!

Virat Kohli: న్యూయార్క్‌లో ఐసీసీ అవార్డు అందుకున్న విరాట్ కోహ్లీ

×