EPAPER

Recurring Deposits:- రికరింగ్ డిపాజిట్లు మంచివేనా.. ఏ బ్యాంకులో ఎంతెంత వడ్డీ

Recurring Deposits:- రికరింగ్ డిపాజిట్లు మంచివేనా.. ఏ బ్యాంకులో ఎంతెంత వడ్డీ

Recurring Deposits:- బ్యాంకుల్లోనూ సిస్టమేటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ ఉంది. స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టినట్టే ఇందులోనూ నెలకు కొంత మొత్తంలో పెట్టుబడి పెట్టొచ్చు. అదే రికరింగ్ డిపాజిట్. పైగా 100 పర్సెంట్ సేఫ్ కూడా. ప్రస్తుతం ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు ఎక్కువ వడ్డీరేటే చెల్లిస్తున్నాయి బ్యాంకులు. అలాగే, రికరింగ్ డిపాజిట్లకు కూడా మంచి వడ్డీ ఇస్తున్నాయి. సాధారణ ప్రజలకు బ్యాంకులు 7.5 శాతం వరకు చెల్లిస్తుంటే.. సీనియర్ సిటిజన్లకు అర శాతం ఎక్కువగా.. అంటే, 8 శాతం వరకు ఇంట్రస్ట్ రేట్స్ చెల్లిస్తున్నాయి. పైగా, ఈ రికరింగ్ డిపాజిట్లను ప్రతి బ్యాంక్ ఆఫర్ చేస్తోంది.


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 6.5 శాతం వరకు, సీనియర్ సిటిజన్లకు 7 శాతం వరకు ఇంట్రస్ట్ రేట్ ఇస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ 6.6 శాతం వరకు, సీనియర్ సిటిజన్లకు 7.1 శాతం వరకు, ఎస్‌బీఐ 6.75 శాతం వరకు, సీనియర్ సిటిజన్లకు 7.25 శాతం వరకు, యాక్సిస్ బ్యాంక్ 6.5 శాతం వరకు, సీనియర్ సిటిజన్లకు 7.25 శాతం వరకు, బంధన్ బ్యాంక్ 7.5 శాతం వరకు, సీనియర్ సిటిజన్లకు 8 శాతం వరకు, బ్యాంక్ ఆఫ్ బరోడా 6.75 శాతం వరకు, సీనియర్ సిటిజన్లకు 7.25 శాతం వరకు, కెనరా బ్యాంక్ 7 శాతం వరకు, సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం వరకు, సిటీ బ్యాంక్ 7.25 శాతం వరకు, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వరకు, సిటీ యూనియన్ బ్యాంక్ 7.1 శాతం వరకు, సీనియర్ సిటిజన్లకు 7.4 శాతం వరకు, ధనలక్ష్మీ బ్యాంక్ 7.25 శాతం వరకు, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వరకు, ఫెడరల్ బ్యాంక్ 7.25 శాతం వరకు, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వరకు, ఇండస్ ఇండ్ బ్యాంక్ 7.25 శాతం వరకు, సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం వరకు, కర్నాటక బ్యాంక్ 7.2 శాతం వరకు, సీనియర్ సిటిజన్లకు 7.7 శాతం వరకు, కోటక్ మహీంద్రా బ్యాంక్ 7 శాతం వరకు, సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం వరకు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7 శాతం వరకు, సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం వరకు, యూనియన్ బ్యాంక్ 7.3 శాతం వరకు, సీనియర్ సిటిజన్లకు 7.8 శాతం వరకు, యెస్ బ్యాంక్ 7.5 శాతం వరకు, సీనియర్ సిటిజన్లకు 8 శాతం వరకు వడ్డీ చెల్లిస్తున్నాయి.

సో, నెలకు సిస్టమ్యాటిక్ ఇన్‌కమ్ వస్తున్న వాళ్లు.. ఎంతో కొంత చొప్పున రికరింగ్ డిపాజిట్ చేస్తూ వెళ్తే మంచి రిటర్న్స్ వస్తాయి. రిస్క్ తీసుకోగలిగితే.. స్టాక్ మార్కెట్ల ద్వారా కూడా మంచి లాభాలు ఉంటాయి.


Related News

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Central Cabinet: కేంద్రమంత్రులుగా బండి సంజయ్, కిషన్ రెడ్డి..?

AP CID Raids: వాసుదేవరెడ్డి ఇంటిపై ఏపీ సీఐడీ సోదాలు.. లిస్టులో చాలామంది!

Virat Kohli: న్యూయార్క్‌లో ఐసీసీ అవార్డు అందుకున్న విరాట్ కోహ్లీ

Big Stories

×