EPAPER

Italy tower : ఇటలీలో మరో పీసా.. కూలే స్థితికి భారీ టవర్

Italy tower : ఇటలీలో మరో పీసా.. కూలే స్థితికి భారీ టవర్
Italy tower

Italy tower : ఇటలీలో పీసా టవర్ తరహాలోనే మరొకటి ఒకవైపునకు ఒరిగిపోయి ప్రమాదకరంగా మారింది. బొలొవన్యా సిటీలోని మధ్యయుగాల నాటి గెరిసెండా టవర్ ఎప్పుడైనా కూలిపోవచ్చననే ఆందోళన వ్యక్తమవుతోంది. 12వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఎత్తైన కట్టడం చుట్టూ 16 అడుగుల పరిధిలో లోహపు కంచె ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు అధికారులు.


154 అడుగుల ఎత్తున్నఈ కట్టడం ఇప్పటికే 4 డిగ్రీల మేర ఒరిగిపోయింది. పీసా టవర్ కన్నా తక్కువ ఎత్తే ఉన్నా.. దాని కన్నా ఎక్కువ డిగ్రీలు ఒరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. పీసా టవర్ ప్రస్తుతం 3.99 డిగ్రీల మేర ఒరిగింది. గెరిసెండా టవర్ ఒరిగిపోయిన పరిస్థితిని చూస్తుంటే.. అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తోందని సిటీ కౌన్సిల్ ఆందోళన చెందుతోంది.

బొలొవన్యా సిటీలో ఠీవిగా, నిటారుగా నింగికేసి చూస్తున్న రెండు టవర్లలో ఇదొకటి. అసినెల్లి, గెరిసెండా ట్విన్ టవర్లు 1109-1119 మధ్య కాలంలో నిర్మితమయ్యాయి. గెరిసెండా టవర్ 14వ శతాబ్దంలోనే ఒకవైపునకు ఒరిగిపోవడం ఆరంభమైంది. దీంతో దాని ఎత్తును తగ్గించారు. గెరిసెండా టిల్ట్‌ను సెన్సర్లు పసిగట్టడంతో అక్టోబరు ఆరంభంలోనే దానిని మూసివేశారు.


బేస్ నిర్మాణంలో వాడిన మెటీరియల్ బలం క్రమేపీ క్షీణిస్తుండటం వల్లే ఒరిగిపోతునట్టు తనిఖీల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే సిటీ కౌన్సిల్ వెంటనే దాని పరిరక్షణకు తక్షణమే చర్యలు తీసుకునే పనిలో పడింది. బేస్ భాగంలో వాడిన ఇటుకల్లో నిట్టనిలువు పగుళ్లు కనిపిస్తున్నాయి. టవర్ చుట్టూ బ్యారియర్ నిర్మాణానికి 47 లక్షల డాలర్ల వ్యయం కాగలదని అంచనా.

ఒకవేళ టవర్ ఆకస్మికంగా కూలిన పక్షంలో.. దాని రాళ్లు చుట్టుపక్కల పరిసరాల్లో పడకుండా ప్రత్యేకంగా రూపొందించిన నెట్లను వాడుతున్నారు. అయితే తక్షణమే ఆ టవర్ కూలిపోయే ముప్పు ఏదీ లేదని అధికారులు చెబుతున్నారు. ఇది కూలడానికి 3 నెలలు, పదేళ్లు, 20 ఏళ్లు ఎంత సమయమైనా పట్టొచ్చని స్పష్టం చేశారు.

ఈ ఏడాది జూలై నుంచి టవర్ పరిస్థితి మరింత దిగజారిందని అధికారులు వివరించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ టవర్‌ను ప్రతి 15 నిమిషాలకు ఒకసారి పర్యవేక్షిస్తుంటామని వారు తెలిపారు.

Related News

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Central Cabinet: కేంద్రమంత్రులుగా బండి సంజయ్, కిషన్ రెడ్డి..?

AP CID Raids: వాసుదేవరెడ్డి ఇంటిపై ఏపీ సీఐడీ సోదాలు.. లిస్టులో చాలామంది!

Virat Kohli: న్యూయార్క్‌లో ఐసీసీ అవార్డు అందుకున్న విరాట్ కోహ్లీ

Big Stories

×