EPAPER
Kirrak Couples Episode 1

Economic Survey:2023 వృద్ధి రేటు 7% అంటున్న ఆర్థిక సర్వే

Economic Survey:2023 వృద్ధి రేటు 7% అంటున్న ఆర్థిక సర్వే

Economic Survey:వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు మందగిస్తుందని, అయినా ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి సాధిస్తోన్న భారత్‌లో… ఆర్థిక వృద్ధి రేటు 7 శాతంగా నమోదవుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. అయితే 2023-24లో ఆర్థిక వృద్ధి రేటు 6.5 శాతానికే పరిమితమవుతుందని తెలిపింది. పర్చేజింగ్‌ పవర్‌ ప్యారిటీ పరంగా భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని… ఎకనామిక్ సర్వే పేర్కొంది.


కరోనా కారణంగా పూర్తిగా స్తంభించిన దేశ ఆర్థిక వ్యవస్థ… ఇప్పుడు పూర్తిగా కోలుకుందని ఆర్థిక సర్వే తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 6.8 శాతం ఉంటుందని… ఇది వ్యక్తిగత వినియోగాన్ని తగ్గించేలా, పెట్టుబడులను బలహీనపరిచేలా ఉండదని అభిప్రాయపడింది. వడ్డీ రేట్లు మరికొన్నాళ్లు ఎక్కువగానే ఉండే
అవకాశం ఉందని, ద్రవ్యోల్బణం కారణంగా కఠిన ద్రవ్య పరపతి విధాన వైఖరిని మరికొంత కాలం పొడిగించాల్సి రావొచ్చని అంచనా వేసింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను మరింత పెంచే అవకాశం ఉందని… రూపాయి మారక విలువకు సవాళ్లు ఎదురుకావొచ్చని అభిప్రాయపడింది. అలాగే ఎగుమతుల వృద్ధి నెమ్మదించి, కరెంట్ ఖాతా లోటు పెరగడం వల్ల రూపాయికి ఒడుదొడుకులు తప్పకపోవచ్చని పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా కమోడిటీ ధరలు అధిక స్థాయిల దగ్గర ఉన్నందున కరెంటు ఖాతా లోటు మరింత పెరిగే అవకాశం ఉందని… దేశీయ గిరాకీ, మూలధన పెట్టుబడుల్లో పెరుగుదల భారత వృద్ధికి దోహదం చేస్తాయని ఎకనామిక్ సర్వే తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో ఎగుమతుల వృద్ధి కాస్త నెమ్మదించిందని… పపంచ ఆర్థిక వృద్ధి, వాణిజ్య కార్యకలాపాలు నెమ్మదించడం ఎగుమతులపై ప్రభావం చూపాయని వెల్లడించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం సాధారణ స్థాయిలో ఉండి, రుణ వ్యయం తక్కువగా ఉంటే… సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి పరిశ్రమల రుణాల వృద్ధి మెరుగ్గా ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. కొవిడ్‌ తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన అత్యవసర రుణ హామీ పథకం వల్లే ఎంఎస్ఎంఈలు వేగంగా కోలుకుంటున్నాయని ఎకనామిక్ సర్వే అభిప్రాయపడింది.


Related News

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Central Cabinet: కేంద్రమంత్రులుగా బండి సంజయ్, కిషన్ రెడ్డి..?

AP CID Raids: వాసుదేవరెడ్డి ఇంటిపై ఏపీ సీఐడీ సోదాలు.. లిస్టులో చాలామంది!

Virat Kohli: న్యూయార్క్‌లో ఐసీసీ అవార్డు అందుకున్న విరాట్ కోహ్లీ

Big Stories

×